ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 7 April 2015

జ్యేష్టునికే రాజ్యాధికారం అన్నది న్యాయ సమ్మతమయితే, పాండు రాజుకులేని రాజ్యాధికారం పాండవులకు ఏవిధంగా సంక్రమిస్తుంది.?

ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగుట చేత రాజ్యాధికారి కాదని. కురువంశమునకు రాజుకాదగిన సమర్ధుడయిన కుమారుని తన కోడలికి అనుగ్రహింపమని సత్యవతి వ్యాసమహర్షిని కోరెను. అంతటి వ్యాసుడు పాండురాజును అనుగ్రహించెను. కనులులేని కారణంగా ధృతరాష్ట్రునికి రాజ్యార్హత కాకపోయినది. విదురుడు దాసీపుత్రుడు కనుక విదురునికి రాజ్యధికారములేకపోయినది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని విదురుడు దాసీ పుత్రుడు అని మనకు తెలిసిన విషయమే కదా! "మనుస్మృతి" యాజ్ఞ వల్క్యనిస్మృతి వంటి ధర్మశాస్త్ర గ్రంధాల ఆధారంగా రాజ్యాధికారం నేత్రాహీనుడయిన ధృతరాష్టునకు లేదు. పాండురాజు పరిపాలనా విశేషములు మహభారతంలో వివరింపబడినవి. ఆంధ్రామహాభారతం అదిపత్యం షష్ఠశ్వాసంలో కూడా 123, 124, 128, 129, 143 పద్యాలలో ధర్మరాజు- రాజు అవ్వవలసిన ఆవశ్యకత విషయంగా ధృతరాష్ర్టుడు దుర్యోధనునికి చెప్పిన విషయము, పౌరులు అందరు చర్చించుకున్న విషయం వున్నవి. ఒకసారి పాండురాజు అయినప్పుడు అతని కుమారుడే రాజు కావలెను అనే విషయం ధృతరాష్ట్రుడు దుర్యోధనునినో అన్న సందర్భాలువున్నాయి. కేవలం గుడ్డివాడుగా రాజార్హత కోల్పోయిన ధృతరాష్ట్రుడు పాండురాజు వానప్రస్ధంకు వెళ్ళగా అత్యవసరస్ధితిలో రాజ్యాధికారం తీసుకొని భీష్ముని రక్షణలో పాలన చేశాడు.వేరే ఆధారం లేనిసమయంలో యిచ్చిన రాజ్యాధికారం- అది విలువయినది కాదు. పాండురాజు రాజ్యంలో లేని కారణంగా అతని రాజ్యానికి రక్షణ నిమితం ప్రతినిధిగా ధృతరాష్ట్రుడు వున్నారు. అంతేకాని పూర్తి రాజరిక లక్షణాలతో రాజ్యాధికారి కాలేదు. అందువలన పూర్తిరాజు లక్షణాలు వున్న పాండురాజే రాజు. అతని పుత్రులు పాండవులే రాజ్యాధికారులు. యిది ధర్మశాస్త్ర విషయము.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML