గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 8 April 2015

ఒకరాజు రాజ్యాన్ని పాలించవలసిన రాజధర్మాలను వివరించండి ?

ఒకరాజు రాజ్యాన్ని పాలించవలసిన రాజధర్మాలను వివరించండి ?

భీష్ముని సమాధానం: రాజధర్మం అన్ని జీవులను సంరక్షించటం - ఇదే క్షత్రియ ధర్మం. కేవలం ఖజానా నింపుకోవటం కాదు. రాజు తన నేర్పులన్నీ దాచుకుని, సందర్భానుసారంగా వాటిని ప్రదర్శిస్తూ, అంతిమంగా, నిష్పక్షపాతంగా ప్రజాక్షేమం కాంక్షించాలి. శత్రువు ఎంత చిన్న చిన్నవాడైనా ఉపేక్షించరాదు. ఎందుకంటే ఒక విత్తనం నుంచి వేయి వృక్షాలు వచ్చినట్లు, ఒక అగ్గిరవ్వకు వెన్నతోడైతే అది ఒక దావానలంగా మారి దహించినట్టు శత్రువు బలహీనుడైనా, రాజు మీద ద్వేషం కలిగించి కీర్తిని నాశనం చేసి, బలాన్ని తగ్గించగలడు. రాజు తన చుట్టూ స్వార్థపరులను తగిన కారణం లేక పొగిడేవారిని ఉపేక్షించరాదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ "కృషి" వలననే సాధింపబడుతుంది అని మరువరాదు. విద్య, తపస్సు, ధనం, వంటివన్నీ కూడా కృషి వలననే సాధించగలం. ఆ 'కృషిని' నియంత్రించేది "బుద్దే ", అయినా కృషియే సర్వశ్రేష్ఠమైనది. ఈ దేహం 'కృషికి' కావలసిన 'శక్తి'నిస్తుంది. దేహం దేవతా స్వరూపం కనుక తెలివిగల వాడు దేహాన్ని విస్మరించడు. దురాశాపరుణ్ణి సదా బహుమతు ద్వారా గెలవవచ్చును. ఇటువంటివారిని మంత్రిగా కాని, ముఖ్యమైన అధికారులుగా గాని రాజు నియమించరాదు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML