గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 19 April 2015

బ్రిటిష్ ప్రవేశం నాటికి భారత్‌లోని విద్యావిధానం .....బ్రిటిష్ ప్రవేశం నాటికి భారత్‌లోని విద్యావిధానం .....
బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ గ్రామస్థాయిలో కూడా విద్యా బోధన జరిగేది. సామాజిక శ్రేణికి అనుగుణంగా, గురుకుల పాఠశాలలు,వీధిబడులు వంటివి గ్రామ సమూహాల పర్యవేక్షణలో నిర్వహించబడేవి. కానీ ఇదంతా ఈస్టిండియా కంపెనీ, క్రిష్టియన్ మిషనరీల ప్రమేయంతో, వారు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్యావిధానం వల్లా అంతరించిపోయి భారతదేశం ఒక నిరక్షరాశ్య దేశంగా మార్చబడింది.

ఇందుకు ఋజువులు అక్టోబర్ 1931 లో మహాత్మాగాంధీ లండన్ లో ఒక ప్రకటన చేశాడు. దానితో లండన్ పత్రికా ప్రపంచం కలవరపడింది. "గత వంద, యాభై ఏళ్ళనాటికంటే ఇప్పుడు భారతదేశంలో నిరక్షరాశ్యులు ఎక్కువైనారు.ఇలాగే బర్మా కూడా తయారైంది. ఎందుకంటే బ్రిటిష్ వారు వచ్చిన తరువాత అప్పటికున్న వ్యవస్థలను సక్రమంగా నిర్వహించకుండా,వాటిని పెకలించివేశారు.మట్టిని త్రవ్వి వేర్లను బహిర్గతపరచడంతో......అందమైన భారతీయవిద్యావ్రుక్షం నాశనమైంది."

Sir thomos munrow ఆనాటి మద్రాసు గవర్నర్, జూన్ 1822 లో కులాలవారీ విద్యార్థుల సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం ఆనాటి విద్యార్థుల వివరాలు ....
# బ్రాహ్మణులు+ వైశ్యులు
విశాఖపట్నం- 47%
తిరునల్వేలి - 21.8%
దక్షిణ ఆర్కాడ్ - 16%

# శూద్రులు.
విశాఖపట్నం - 21%
తిరునల్వేలి -31.2%
దక్షిణ ఆర్కాడ్- ......

‪#‎ముస్లింలు‬
విశాఖపట్నం - 12%
తిరునల్వేలి - .......
దక్షిణ ఆర్కాడ్- ......

# ఇతరులు
విశాఖపట్నం - 20%
తిరునల్వేలి -38.4%
దక్షిణ ఆర్కాడ్- 84%
Source :(Dharmpal రచించిన Beautiful Tree)

@. Survey of indigenous education in the province of Bombay (1820- 1830) అనే సర్వే నిర్వహించారు. అందులో ఆనాటి బొంబాయి ప్రావిన్స్ లో కేవలం 30 శాతం మంది విద్యార్థులు బ్రాహ్మణులు, 70 శాతం ఇతర కులాల విద్యార్థులు. (Dharmpal - Beautiful tree)

@ . బెంగాల్,బీహార్‌ ప్రాంతాలలో కూడా బ్రాహ్మణ, కాయస్థ వర్ణం విద్యార్థులు 40% మాత్రమే ఉండేవారు.తక్కిన 60% ఇతరకులాలకు చెందిన విద్యార్థులు అని విలియం ఆడమ్ తన సర్వేలో పేర్కొన్నాడు.

@ . లార్డ్ వెల్లస్లీ 1800 లో ఒక పథకం ప్రకారం బ్రాహ్మణ కుల విద్యార్థుల విద్యాభ్యాసానికీ,ఇతరకుల విద్యాభ్యాసానికీ విభజన చేసి,భారతీయ విద్యావిధానాన్ని విభజించి, వర్ణవ్యవస్థలమధ్య వైషమ్యాలు పెంచి, సమాజ పతనానికి దారి తీశాడు.

"ఎర్నెస్ట్‌ హవెల్ " ఇలా అంటారు "ఆంగ్లో - ఇండియన్ విద్యావ్యవస్థ" జాతియొక్క సంస్కృతిని పరిపుష్టం చేయకుండా, మరిన్ని వనరులు సమకూర్చకుండా,వ్యతిరేకదిశలో,విధ్వంసకర విధానంలో పనిచేసింది.
మ్యాక్స్ ముల్లర్ తన భార్యకు రాసిన లేఖలో ఇలా రాశాడు " మనకు ఆఫ్రికా దేశీయులను క్రిష్టియన్లుగా మతం మార్పించడానికి పట్టిన కాలం కేవలం 200 సంవత్సరాలు,కానీ 400 సంవత్సరాల తర్వాత కూడా మనం భారతీయులను అలా మార్చలేకపోతున్నాం.దీనికి కారణం సంస్కృతభాష అని నా నమ్మకం.దీనిని వమ్ముచేయడానికే నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను."

భారతీయ ఆత్మ సంస్కృతంలో ఉంది. అందుకే మెకాలే భావిభారత తరాలను చాలా నేర్పుతో వారి మూలాలనుంచి వారిని వేరుచేశాడు.

(Source : Assaulting India's pluralist Ethos - by D.Harikumar)

స్వామి వివేకానంద - ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన విద్యావిధానం గురించి ఆనాడే ఇలా అన్నారు ......
" మీకు ఈరోజు సంప్రాప్తించిన విద్యావిధానం లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నా, చాలా ఎక్కువగా అవలక్షణాలు ఉన్నాయి.ఈ అవలక్షణాల వల్ల దానితో లభించిన కొద్దిమంచి కూడా నిరుపయోగంగా మారింది. ఎందుకంటే అది "వ్యక్తి నిర్మాణ విద్య "కాదు.ఇది కేవలం ఋణాత్మక విద్యావిధానం (negative Education) ఈ ఋణాత్మక విద్య,అందించే శిక్షణ మ్రుత్యువుకంటే ఘోరమైంది.మనం పిల్లవాడిని బడికి పంపగానే వాడు నేర్చుకునే మొదటి పాఠం తన తండ్రి ఒక మూర్ఖుడనీ.రెండో పాఠం తన తాత పిచ్చివాడని.మూడోపాఠం తన గురువులందరూ ఆత్మ వంచకులని.ఇక నాలుగో పాఠం మన పవిత్ర గ్రంథాలన్నీ అబద్ధాల పుట్టలని. ఇలా అతను 16 ఏళ్ళ వాడయ్యేసరికి అతను ఒక "నిరాశారాశిగా" జీవరహితంగా, వెన్ను లేని జీవిగా మిగులుతాడు. దీని ఫలితమే గత 50 ఏళ్ళ ఈ విద్యా విధానం. దేశంలోని 3 ప్రెసిడెన్సీలలోనూ అసలైన మనిషిని తయారు చేయలేకపోయింది ."
(Ref : Complete works of Swami Vivekananda, vol. 3, Pg. 301,302.) Credit :-sai deva

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML