గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 19 April 2015

సర్వ దేవత స్తుతిసర్వ దేవత స్తుతి 2:- శ్రీ శివ మహా పురాణము –రుద్ర సంహిత –సతీ ఖండం

ఆవిద్దదృక్ పరస్సాక్షి సర్వత్మా నేక రూపధృక్|
ఆత్మ భూతః పరబ్రహ్మ తపంతం శరణం గతాః ||
న యస్య దేవా ఋషయ స్సిద్ధాశ్చ న విదుః పదమ్|
కః పునర్జంతురపరో జ్ఞాతు మర్హతి వేదితుమ్ ||
దిదృక్షవో యస్య పదం ముక్తసంగా స్సుసాదవః |
చరితం సుగతిర్నస్త్వం సలోకవ్రత మవ్రణమ్||
త్వజ్జన్మాది వికారా నో విద్యంతే కే పి ధుఃఖధాః |
తథాపి మాయయా త్వంహి గృహ్ణాసి కృపయాచ తాన్ ||
తస్మై నమః పారేశాయ తుభ్య మాశ్చర్య కర్మణే |
నమో గిరాం విదూరాయ బ్రహ్మణే పరమాత్మనే!!


తాత్పర్యం :-

అమోఘమైన దృష్టిగల వాడు, పరమాత్మ సాక్షి , సర్వాత్మ , అనేక రూపాలను ధరించువాడు ,అన్నిటికి ఆత్మ ఐనా వాడు ,పరబ్రహ్మ ,తపస్వీ ఐనా నీకు శరణు. నీ పరమపదాన్ని దేవతలు , ఋషులు , మరియు సిద్దులు కూడా ఎరుగరు . ఇతర ప్రాణులు నిన్నెల తెలుసుకోగలరు ? నీ స్థానాన్ని చూడగోరిన మానవులు సంగ రహితులై సాధువులవుతున్నారు. నీ చరిత్రయే మాకు మోక్షప్రదం . లోకాలన్నీ నీనుండే ఉద్భవించినా నీవు వ్రణం(ఛిద్రం)లేని వాడవు ! నీకు ధుఃఖాన్ని ఇచ్చే జన్మాది వికారాలు లేవు. కానీ మాయచే దయతో వాటిని స్వీకరిస్తున్నావు. పరమేశ్వరుడు ,ఆశ్చర్యకరమైన కర్మలను చేయువాడు , మాటలకు అందని వాడు , పరబ్రహ్మ ,పరమాత్మ అగు నీకు నమస్కారం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML