గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 30 April 2015

నాగారాధన తో చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని ఓ నమ్మకముంది. కొన్ని వ్యాధుల నిర్మూలనలో సర్ప విషం విలువ తెలిసిందే.నాగారాధన తో చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని ఓ నమ్మకముంది. కొన్ని వ్యాధుల నిర్మూలనలో సర్ప విషం విలువ తెలిసిందే. ఇంతటి సామాజిక ప్రయోజనం ఉన్నందువల్లనే ఒక ప్రాంతం, ఒక దేశమని కాకుండా నేటికీ చాలామంది సర్పారాధన చేస్తున్నారు. ప్రాణులన్నిటా పరమాత్మ ఉన్నాడని, ఏ ప్రాణి నీ అనవసరం గా భాదించకూడదని, దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతూనే ఉంటుందని తెలియజెప్పే ఓ సందేశం తో సర్ప పూజ ఆచరణ లోకి వచ్చిందని పూర్వులు చెబుతారు. నాగ దేవతలను ఆరాధించే సంస్కృతీ ప్రపంచవ్యాప్తం గా పలు ప్రాంతాలలో ఉంది. అందరు జరుపుకోనేది ఒకే కారణానికి, కాని ఆచరించే విధానాలు వేరుగా ఉంటాయి.కొన్ని వేదమంత్రాల్లో సర్పమంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. గుళ్ళు గోపురాలు, విగ్రహాలు లేనప్పటి నుండి కూడా నాగ పూజలను ఆచరించే వారు. ప్రకృతి తో పాటు గా నాగారాధన అనాదిగా వస్తున్న ఆచారం. మన తెలుగునాట ముఖ్యం గా శ్రావణ శుద్ద చవితి, పంచమి నాడు, కార్తీక శుద్ద చవితి, పంచమి నాడు ఈ నాగ పూజను విశేషం గా జరుపుతారు.
నాగుల చవితి, పంచమి గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. గ్రీష్మ వర్ష ఋతువులలో సర్వ సాధారణం గా పాములు బయట సంచరించవు. శరదృతువులో ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పాములు బాగా స్పందించి సంచరిస్తూ ఉంటాయి. అందుకే ఈ కాలం లోనే నాగులను పూజించడం ఆచారం గా చెప్పబడింది. శ్రావణ మాసం లో వర్షాల వల్ల పుట్టల నుంచి పాములు వెలుపలికి వచ్చి బాదిస్తాయి, కావున నాగ పూజ వర్షాకాలం లో ప్రాధాన్యత ను సంచరించుకుంది.
వాసుకి, తక్షకుడు, ఐరావతుదు ధనుంజయుడు, కర్కోటకుడు, అనంతుడు, శేషుడు వీరిని సర్ప జాతికి మూల పురుషులుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. వీటిలో వాసుకి, అనంత, శేష సత్వగుణ ప్రధానులు, ఐరావత ధనుంజయ,శంఖపాల రజోగుణ ప్రధానులు, తక్షక కర్కోటక తమోగుణ ప్రధానం గా గలవారు.
ఆదివారం నాడు తక్షకజాతి ,సోమవారం నాడు శంఖపాల జాతి , మంగళవారం నాడు కర్కోటక జాతి, బుధవారం నాడు వాసుకి, గురువారం ఐరావత జాతి, శుక్రవారం ధనుంజయ జాతి, శనివారం శేష జాతి సర్పాలు విషపూరితమై సంచరిస్తాయి. ఆయా జాతి సర్పాలు కాటు వేసినప్పుడు ప్రాణులు జీవించడం కష్టతరమవుతుందని, మిగిలిన వారాలలో అన్య జాతి సర్పాల కాటువల్ల ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చని తెలుస్తోంది.
మనిషి పుట్టుకకు ముందు, తర్వాత కలిగే జన్మల రహస్యాలను ఇముడ్చుకొని ఉంటుందని పూర్వుల మాట. గత జన్మ లో సర్పశాపం ఉంటే ఈ జన్మలో సంతాన హాని అనుభవిస్తారని పరాశర మహర్షి స్వయం గా తెలియజేసాడని పురాణాల ఆధారం గా తెలుస్తోంది. ఈ కారణంగానే కాల సర్పదోషం ప్రాప్తిస్తుంది. జాతకాన్ని పరిశీలించినట్లయితే, జాతకుని కుండలి లో రాహు కేతువుల మధ్య గ్రహాలు ఉండడాన్ని కాల సర్ప దోషం గా పరిగణిస్తారు. ఈ దోషం ఉన్న వారికి, జీవితం లో కొన్ని అనుకోని ఊహించలేని మార్పులు జరుగుతుంటాయి. దీని పరిహారినికి మనకున్న నివారణోపాయలలో నాగ ప్రతిష్ఠలు , నాగులచవితి , నాగ పంచమి రోజున చేసే పూజలు ప్రాధాన్యమైనవి. నాగుల చవితి నాడు ఉపవాసముండి పంచమి నాడు నాగ ప్రతిమకు శక్తి కొలది పంచామృతాలతో విధివిధానం గా మంత్రోపచారాలతో సుగంధభరిత పుష్పాలు, జాజి, సంపెంగ వంటి వాటితో పుట్టకు పాలు, చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసిన చిమ్మిలి, క్షీరాన్నం మొదలైనవి నైవేద్యం గా సమర్పించి నాగదేవతను భక్తిశ్రద్దలతో పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుగ్రహ దోషాలు, నాగ దోషాలు ,సర్వ దోషాలు తొలగుతాయని శాస్త్ర వచనం, ముఖ్యం గా సంతానం కలగకపోవడం, ఆలస్య వివాహం, భార్యాభర్తలు విడిపోవడం, దాంపత్య సౌఖ్యం లేకపోవడం, చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించడం వంటి ప్రధాన సమస్యలన్నీ నాగ దోషాల వల్ల కలిగేవే. ఇటువంటి సమస్యలతో తీవ్రం గా బాధపడుతున్నవారు ఈ విధానాలని ఆచరించి సత్ఫలితాలని పొందవచ్చు. దోషం తీవ్రం గా ఉన్న జాతకులు మంగళవారం కాని, ఆదివారం నాడు కాని ఉపవాసముండి నాగ దేవతాలయం చుట్టూ లలితా సహస్రనామం చదువుతూ ప్రదక్షినచేయడం ద్వారా, శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గా దేవి ని పూజించడం ద్వారా, నాగ సూక్తము చదవడం ద్వారా దోష నివారణ కలుగుతుంది.
నాగ శిలలను గ్రామ సమీపం లో చెరువు, నది, రావి మారేడు చెట్ల కింద ప్రతిష్టిస్తారు. ముఖ్యం గా రామేశ్వరం వంటి పుణ్య క్షేత్రం లో ప్రతిష్టించడం సర్వ శుభప్రదం. శ్రీ రామ చంద్రుడు తనకు ఉన్న శుక్రవంక నష్టరేఖ, కాల సర్ప దోషాల నివారణ కోసం కల్పం లో చెప్పినట్లు రామేశ్వరం లో నాగ శిలలను ప్రతిష్టించాడని పురాణ ప్రతీతి. ప్రతిష్ఠ జరిగిన శిలల పై మారేడు, రావి దళాల నీడ, ఆకులు, వర్షపు నీరు ఎండిన ఆకులు పడినంత మాత్రాన అభిషేక ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML