గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 30 April 2015

జాతకంలో శనిరాహువులు ఒక రాశిలో కలసి ఉంటె అది గొప్ప దోషంగా పరిగణింపబడుతుంది. దీనిని శపిత యోగం అని అంటారు.కొన్ని జ్యోతిష సాంప్రదాయాలలో దీనిని మహాదోషంగా పరిగణిస్తారు.కొంతమంది అయితే ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి ఇష్టపడరు.జాతకంలో శనిరాహువులు ఒక రాశిలో కలసి ఉంటె అది గొప్ప దోషంగా పరిగణింపబడుతుంది. దీనిని శపిత యోగం అని అంటారు.కొన్ని జ్యోతిష సాంప్రదాయాలలో దీనిని మహాదోషంగా పరిగణిస్తారు.కొంతమంది అయితే ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి ఇష్టపడరు.

గోచార రీత్యా వీరిద్దరూ ఒకే రాశిలో కలసినప్పుడు కూడా ఇదే దోషం ఏర్పడుతుంది.వీరిద్దరి పరస్పర వేగాలలో తేడాలవల్ల అలా కలవడం ఎప్పుడో కాని జరగదు.కాని అలా కలిసినప్పుడు మాత్రం లోకంలో చాలా ఘోరాలు జరుగుతాయి.

ఆ సమయంలో పుట్టిన జాతకాలలో ఈ యోగం రకరకాలుగా ప్రతిఫలిస్తుంది. ఆయా జాతకులను ముప్పుతిప్పలు పెడుతుంది. కాలసర్ప యోగం ఎంత బాధ పెడుతుందో ఈ యోగమూ అంత కంటే ఎక్కువ బాధ పెడుతుంది. అయితే అది బాధించే తీరూ ఇది బాధించే తీరూ వేర్వేరుగా ఉంటాయి.

ప్రస్తుతం వీరిద్దరూ 2012 డిసెంబర్ 24 నుంచి 2014 జూలై 13 వరకూ తులా రాశిలో కలిసి ఉంటారు.ఈ సమయమంతా దోషప్రదమే.ఈ ఏడాదిన్నర పాటు లోకం రకరకాల ఉపద్రవాలతో తల్లడిల్లక తప్పదు. ఈ సమయంలో పుట్టే పిల్లల జాతకాలలో ఈ దోషం తప్పకుండా ఉంటుంది. కనుక పెరిగి పెద్దయ్యాక వారి జీవితాలలో వారు చాలా చెడు ఖర్మను అనుభవించక తప్పదు. గతజన్మలో చాలా పాపఖర్మల బరువు ఉన్న జీవులు ఈ సమయంలో భూమిమీద జన్మ తీసుకుంటారు.

దీనిని శపిత దోషం అని ఎందుకంటారు? ఈ జాతకులకు చాలా శాపాలు ఉంటాయి. గత జన్మలలో వీరు అనేక చెడుకర్మలు చేసుకుని అనేక మంది ఉసురుపోసుకుని వారి శాపాలకు గురై ఉంటారు.పూర్వజన్మలలో చేసుకున్న చెడుఖర్మల ఫలితంగా ఈ జన్మలో అనేక కష్టాలు బాధలు పడవలసి వస్తుంది.అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న చెడుఖర్మ ఈ రకమైన దోషంగా జాతకంలో ప్రతిఫలిస్తుంది.

శపిత దోషం ఉన్న జాతకాలు చూచి వారికి రెమేడీలు చెప్పిన జ్యోతిష్కుడు కూడా ఆ కర్మలో భాగం పంచుకోవలసి వస్తుంది. పరిహారాలు చేసిన జోస్యునిపైన రాహు,శనుల కోపదృష్టి పడుతుంది. జాతకుని తీవ్ర కర్మలో జోస్యుడు జోక్యం చేసుకుంటున్నాడు కనుక అతనూ ఆ కర్మను కొంత పంచుకోవలసి వస్తుంది.

ఒకసారి ఒక ముసలి జ్యోతిష్కుని నేను చూచాను. ఒక జాతకాన్ని తన చేతిలోకి తీసుకుని చూచీ చూడక ముందే ఆ కాగితాన్ని విసిరి పారేసాడు.ఆ జాతకం తాను చూడననీ, ఆ జాతకున్ని వెళ్ళిపోమ్మనీ అరిచాడు. ఉత్త పుణ్యానికి అలా ఎందుకు అరుస్తున్నాడో నాకు అర్ధం కాలేదు.తర్వాత చెప్పాడు అది శపిత దోషం ఉన్న జాతకం మనం దానిని చూడరాదు.విశ్లేషించరాదు అని.

పన్నెండు రాశులలో దేనిలో ఈ దోషం ఏర్పడింది? దీనిపైన మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉన్నది? అన్న దానిని బట్టి ఈ దోష తీవ్రతను జాతకుని పూర్వకర్మను అంచనా వెయ్యాలి.

ఈ యోగం ఉన్నప్పుడు ఆ జాతకుడు తీవ్రమైన కోపానికి,నిలకడలేని ప్రవర్తనకు లోనవుతాడు.తట్టుకోలేని కోపంలో హత్యలు రేపులు చేసేవారు, ఉన్నట్టుండి తీవ్ర నిర్ణయాలు తీసుకునే వారిలో ఈ దోషం ఉంటుంది.వీరిలో విచక్షణ లోపిస్తుంది.మొండిగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలు తర్వాత ఏడుస్తూ అనుభవిస్తారు.శనిరాహువుల సంయోగం అలాంటి ప్రవర్తనను ప్రేరేపిస్తుంది.తట్టుకోలేని భావోద్రేకాలను,మొండితనాన్ని, మూర్ఖపు వాదనలను,ఒంటరిగా ఉండి క్రూరమైన ప్లానులు వెయ్యడాన్ని ఈ గ్రహసంయోగం కలిగిస్తుంది.స్నేహితుల మధ్యన,ప్రేమికుల మధ్యన, అప్పటివరకూ కలిసిమెలిసి తిరిగిన వారిమధ్యన,హటాత్తుగా గొడవలు రావడం ఈ దోషం యొక్క ప్రభావమే.

డిల్లీ రేప్ కేస్ గాని,తర్వాత జరుగుతున్న ఇతర రేపులు హత్యలు ఘోరాలు గాని,యాక్సిడెంట్లు గాని,అన్నీప్రస్తుతం గోచారరీత్యా అమలులో ఉన్న ఈ యోగం యొక్క ఫలితాలే. అంతేకాదు,అక్బరుద్దీన్ ఉదంతం గాని,పాకిస్తాన్ దుందుడుకు చర్యలు గాని,సరిహద్దులో మనల్ని రెచ్చగొట్టడం గాని,పాకిస్తాన్లో సంక్షోభం గాని ఇవన్నీ ఈ గ్రహయుతి యొక్క ఫలితాలే.

చాలామంది జీవితాలలో జూలై 2014 లోపు ఈ గ్రహదోషం చుక్కలు చూపించి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది అనడం నగ్నసత్యం. వేచి చూడండి ఫలితాలు ఎవరి జీవితాలలో వారికే కనిపిస్తాయి.
పరిచయం
జ్యోతిష్యం అనేది భారతదేశములో ఉన్న శాస్త్రములలో ఒక గొప్ప శాస్త్రము. భారతదేశంలో ఎందరో ఋషులు ఈ జ్యోతిష్య శాస్త్రమును చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. వారి దివ్య చక్షువులు ద్వారా ఆకాశంలో ఎక్కడో దూరంగా కంటికి కనిపించనంత దూరంలో ఉన్న గ్రహాలను, వాటి స్వరూపాలను, వాటి విశిష్టతను తెలియజేసారు. ఈ జ్యోతిష్య శాస్త్రము
౧. సిద్ధాంత భాగము
౨. జాతకభాగము
౩. ముహూర్తభాగము
అను మూడు భాగాలుగా తెలియజేయబడి వున్నది. పూర్వము అనేకమంది మహర్షులు ఈ జ్యోతిష్య శాస్త్రములో అనేక గ్రంథాలు రచించి వున్నారు. వారిలో బ్రహ్మ, వశిష్టుడు, అత్రి, గౌతముడు, మనువు, కాళిదాసు, పౌలస్తుడు, రోమసుడు, మరీచి, అంగీరసుడు, వ్యాసుడు, నారదుడు, శౌనకుడు, భ్రుగువు, చ్యవనుడు, యవనుడు, గర్గుడు, కశ్యపుడు, పరాశరుడు మొదలైనవారు ముఖ్యులుగాను యింకా మరెందరో వున్నారు. ముఖ్యముగా ఈ జోతిష్య శాస్త్రములో పరాశర, జైమిని, శ్రీపతి అను మూడు పద్ధతులు వాడుకలో వున్నవి. నేడు మనదేశములో పరాశరపద్ధతి ఎక్కువ వాడుకలోను, ఎక్కువగా ప్రజాదరణ పొందినదిగా చెప్పవొచ్చును. జైమిని మహర్షి రచించిన జైమినిపద్ధతి కూడాను వాడుకలో వున్నది. కొందరు పరాశర, జైమిని రెండు పద్ధతులను కలిపి ఫలితాలు చెప్పిరి. మనము చేయు ప్రతి పని కూడాను కర్మగా చెప్పవొచ్చును. మరి ఆ కర్మనే వృత్తి గా పిలువబడుతున్నది. తాము పూర్వజన్మలో చేసిన కర్మఫలితములను బట్టి ఈజన్మలో శుభాశుభ ఫలితాలుగా పొందుతున్నారు.

చెప్తారు అంటే... స్త్రీల జతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు. మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు పురుషులకు కూడా అప్పదించి కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు. శాస్త్రరిత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.

కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట కుజదోషము-పరిహారములు :

కుజగ్రహము గురించి: కుజ అనగా భూమి పుత్రుడు. ఆధునిక వైజ్ఞానికులు కుడా భూమికి కుజునికి పోలికలు ఉంటాయని నిరూపించారు

ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
అని మన పూర్వ మహర్షులు వర్ణించారు. ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.మరి ఈ శ్లోకం అదే తెలుపు తున్నదికదా... ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది.ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు. కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..


మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది.

వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి,జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం,నమ్మకము,విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి.భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.
సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.

ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.

కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టిదక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.

స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.
ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.

ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.

ప్రతిరోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.

కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు)
కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.,
కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
కుజదశలో కుజుని అంతర్దశకు....ఉత్తరకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.

కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ యాభై ఎనిమిదవసర్గ, తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
కుజ దశలో కేతు అంతర్దశకు-- యుధకాండ నూట పదహారు సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
కుజ దశలో శని అంతర్దశకు -- అరణ్యకాండ డెభై వ సర్గ -- నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
కుజుదశలో బుధ అంతర్దశ --- బాలకాండ పదహారవసర్గ -- ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
కుజు దశలో గురు అంతర్దశ -- సుందర కాండ యాభై ఒకటి సర్గ--- అరటిపండ్లు నైవేద్యము.
కుజ దశలో శుక్ర అంతర్దశకు --- సుందరాకాండ యాబై మూడు సర్గ -- పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం.
కుజ దశలో రవి అంతర్దశకు --- బాలకాండ ఇరై మూడు సర్గ -- చామ కారెట్ దుంప నైవేద్యము.
కుజదశలో రవి అంతర్దశకు --- బాలకాండ పదిహేడవ సర్గ-- పాలు, పాయేసం నైవేద్యము

కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు:
సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
రక్త దానము చేయుట చాల మంచిది.
అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.
వివిధ భావాలలో కుజదోషం ఉంటె తీసుకోవలసిన జాగ్రతలు:
భావము: వీరు అబద్ధములు ఆడకూడదు, దంతముతో చేసిన వస్తువులు ఇంటిలో ఉంచరాదు, ఏ వస్తువైనా దానం teesukoraadu.

భావము: వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో చేసిన తీపి పదార్థములు తినిపించాలి.
భావము: వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.
భావము: వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.
భావము: వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే అనీరు పచ్చని చెట్టులో పోయాలివేప చెట్టు దక్షిణం వైపు నాటాలి..
భావము: అంగారక మంత్రము జపించాలి, ఇందుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, పడిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.
భావము: మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకో కూడదు.
భావము: నాలుగు, ఆరు భావాల్లోని రేమేడీలు చేసుకోవాలి, విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.
భావము: కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునండు పెట్టుకోవాలి, అన్నగారు చెప్పినవి చేయాలి.
భావము: ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామీ ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో పదనీకండి.
భావము: చిన్న మట్టి పాత్రలో తెనేకాని, సిన్దురంకాని వేసి ఉంచండి
భావము: ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామీ ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.
-- ఇవి అన్ని రోజులు పాటించవలసిన నియమములు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML