గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 16 April 2015

అక్షయ తృతీయ నాడుఅక్షయ తృతీయ నాడు, మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా,
[ అది పుణ్యంకావచ్చు; లేదా పాపం కావచ్చు.] అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధంలేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది.

పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా, ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ,
కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మల
లోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు.


వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. గురువుగారి, తత్సంబంధిత అనుగ్రహ భాషణాన్ని ఓ సారి పరిశీలిస్తే, భాగవతం ప్రధమ స్కంధం ప్రకారం, పరీక్షిన్మహా రాజు కలి పురుషుడికి ఐదు నివాస స్థానాలను కేటాయించాడు.

అవి:
జూదం, మద్య పానం, స్త్రీలు, ప్రాణి వధ, బంగారం. వీటితో పాటు కలి కి లభించినవి

ఇంకో ఐదు;
అసత్యం,గర్వం, కామం, హింస, వైరం. జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ పైన ఉన్న ఐదిటికీ ఇవి అనుషంగికాలు.

ఆ పై ఐదిటినీ ఇవి నీడలా వెన్నంటే ఉంటాయి.
అక్షయ తృతీయ రోజు ఎవరైనా, ఈ ఐదిటిలో దేని జోలికి వెళ్ళినా, కలి పురుషుడి దుష్ప్రభావం అక్షయంగా వెంటాడుతూనే ఉంటుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML