'నూరేండ్లు జీవించెదరు గాక' అనెడు ఆశీర్వాదము భారత సంస్కృతి తోడ పెనవేసుకొని యున్నది. 'దీర్ఘాయుష్మాన్ భావ' అనేది ఆశీస్సు సదాచారమై ఒప్పుచున్నది. నూరేండ్ల నీవనము లేదా సహస్ర శరద్రాతులు అనగా వేయి పూర్ణిమలు లేక 83 ఏళ్ళు దాటి జీవించుట ఘనమైన జీవిత విశేషముగా వర్ణింపబడినది. ఆధునిక జీవన శాస్త్రము నందు కూడా దీర్తాయువులు గల దేశమును ఘనముగా పేర్కొనబడి వారి దీర్ఘాయువునకు గల రహస్యములను అన్వేషించుట జరుగుచున్నది.
వ్యక్తి నిరోగియై, యోగియై, మలమూత్రా స్వేదములు వాసనా రహితమూ, వంశాభివృద్ధిగ, సకల సంపదలతో ఎల్లప్పుడూ ఆనందముతో జీవించినచో వ్యక్తి జీవితము సంపూర్ణమని మనమెల్లరము భావింపవచ్చును.
సంధ్యావందనమున 'జీవేమశరదశ్శతం' (నూరేండ్లు జీవించుము), 'నందామశరదశ్శతం' (ఆనందముగా నూరేండ్లు బ్రతుకుము), 'మోదామ శరదశ్శతం' (మోదము ఇతరులకు కలిగించుచూ నూరేండ్లు నివసింపుము), 'అజీతాశ్వామశరదశ్శతం' (అజేయుడవై - పరులకు బానిస కాకుండగా - వ్యసనములకు లోనుగాక) నూరేండ్లు జీవించుము' అనేది ఉత్కృష్ట భావన మన భరత జాతికి వేదముల ద్వారా పూర్వులు అందించియున్నారు.
'కాలేవర్షతు పర్జన్యః' - సకాలమునకు వర్షములు పడుగాక. దాని వలన 'పృథివీ సస్యశాలినీ' - భూమి సస్యశ్యామలమగు గాక, 'దేశోయం క్షోభ రహితో' - దేశము క్షోభలు, అల్లకల్లోలములు లేకుండా ఉండుగాక, బ్రాహ్మణా స్సంతు నిర్భయాః' - బ్రహ్మ విద్యా పరులు, సత్యాన్వేషకులు అయిన బ్రాహ్మణులు (కర్మలను బట్టిగాని, జన్మమును బట్టి బ్రాహ్మణుడు కానేరడని శాస్త్రము) నిర్భయులుగా ఉండెదరు గాక, 'అపుత్రః పుత్రిణస్సంతు' - పుత్రులు లేని వారు బిడ్డలను బడయుదురు గాక, 'అదనాస్సధనాస్సంతు' - నిర్ధనులు ధనములు బడసెదరు గాక, జీవంతు శరదాం శతం' నూరేండ్లు జీవించెదరు గాక. ఇంతకన్న ఆనందకరమైన విషయమేమియున్నది?
ॐ ఆశీర్వచనము ॐ
"శ్రేయోస్తు
వాంఛితమనోరథసిద్ధిరస్తు !
కల్యాణమస్తు ధనధాన్య
సమృద్ధిరస్తు !
విద్యావివేక నిచయోస్తు పురాణగోష్ఠాం
శ్రీ శ్రీనివాసదయయా యువయోస్తు నిత్యమ్"!!
శతమానంభవతి శతాయుఃపురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి మంగళం మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

No comments:
Post a Comment