గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 30 April 2015

మొత్తం పదునాల్గు భువనాలు..అంటే పద్నాలుగు లోకాలన్నమాట.!హిందూ సంస్కృతిలో పురాణాలలోని అధర్వణ వేదంలో లోక అనే పదం వాడబడింది.. లోక అనే పదం నుండి లోకం అనే భావన ఏర్పడింది. సంచార జీవుల వల్ల లోకం అంటే.. ప్రదేశం, ప్రపంచం అనే అర్ధం స్థిర పడింది. కానీ వేద సంస్కృతి ప్రకారం లోక్ అంటే మానసిక స్థితి యొక్క స్థానము. అంటే.. మన మనసే మరో లోకాన్ని ప్రతిబింబిస్తుందన్నమాట..! మరి ఆ లోకాలు ఎన్ని అవి ఏవి అన్న విషయం చాలామందికీ తెలిసినా... చాలామందికీ తెలియక పోవచ్చు..
ఇంతకీ అధర్వణ వేదం ప్రకారం
మొత్తం పదునాల్గు భువనాలు..అంటే పద్నాలుగు లోకాలన్నమాట.! మధ్య నుంచి పైకి ఏడు లోకాలు ఊర్ధ్వలోకలు అంటారు.. మధ్య నుంచి క్రిందకు అధో లోకాలు అంటారు. అవి ఏడు.. ఇవి ఏడన్నమాట. అంటే మనిషి మానసికం గా ఎదిగితే ఏడింతలు ఎదగొచ్చు.. మనసికంగా కృశించి పోవడం మొదలైతే ఏడింతలు తరిగిపోవచ్చని ఆ వేదఘోషలోని లోకాల శబ్ధ భావన.
వాటి పేర్లు తెలుసుకుందాం.....
ఊర్ధ్వలోకాలు
1. సత్య లోకం
2. తప లోకం
3. జన లోకం
4. మహర్లోకం
5. సువర్లోకం
6. భువర్లోకం
7. భుర్లోకం


అధో లోకాలు
8. అతల లోకం
9. వితల లోకం
10. సుతల లోకం
11. తలాతల లోకం
12. మహాతల లోకం
13. రసాతల లోకం
14. పాతాళ లోకం
అదండీ సంగతి..! చెప్పిన మాట వినకపోతే పాతాళానికి జారిపోతావ్ అని గురువుగారంటారు గుర్తొచ్చిందా..! మరి జాగ్రత్త సుమ్మీ..!
ఇంతకీ మనమెక్కడున్నామబ్బా..?? మా లోకం.. ఏది మన లోకం ??
లోక సమస్తా సుఖినో భవంతు..!!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML