
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 7 April 2015
గాంధారి భర్తను అనుసరించి అంధురాలు అయింది. అది పతివ్రతా ధర్మమా లేక ఆమె కూడా పుత్ర వ్యామోహంలో చిక్కుకున్నదా?
తన వివాహం ధృతరాష్ట్రునితో జరగనున్నదని సుబలుని బంధువుల మాటలు విన్నగాంధారి- నాకు భర్త ధృతరాష్ర్ట మహారాజే- అన్యులను వివాహమాడ అంగీకరించను. అని ఆ మహాపతివ్రత పరపురుషులను తాను చూచుటకు యిష్టపడక "భర్తకు కళ్ళు లేవు" కావున తానుకూడా కళ్ళకు గుడ్డ అడ్డం కటుకొన్నది. అదేవిధంగా జీవితాంతం భర్తతోపాటు అంధురాలిగానే గడిపినది. అయితే ఈమె కూడా ధృతరాష్ట్రుని మాదిరిగానే పాండవుల విషయంలో- పుత్రవ్యామోహంతో అంధురాలివలెనే ప్రవర్తించినది. కుంతికి ధర్మరాజు కలిగాడని తెలిసి గర్భవతిగా వున్న గాంధారి తన గర్భమును బాదుకొని గర్భాస్రావం చేసుకొన్నది. అయితే వ్యాసమహర్షి దయ వలన ఆమెకు ఆ పిండరక్షణ కలిగి దుర్యోధనాదులు ఉద్భవించారు. ఈ విధంగా పాండవుల ఉత్పత్తి నాటినుండే తన అసూయ ప్రకటించి ప్రవర్తనా విషయంగా అంధరాలయినది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment