గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 16 April 2015

శ్రీ కట్ట్టమైసమ్మ దేవాలయం బేగంపేటశ్రీ కట్ట్టమైసమ్మ దేవాలయం బేగంపేట

జగన్మాత మహాలక్ష్మి అమ్మవారి అంశ కట్టమైసమ్మ దేవాలయం. కట్టమైసమ్మ దేవాలయం ప్రాచీనమైన సికింద్రాబాద్ లోని బేగంపేటలో ఉంది. దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ... 96 సంవత్సరాల పూర్వం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట బ్రాంచ్ నిర్మింపబడుతున్న సమయం. స్కూల్ నిర్మాణ కాంట్రాక్టర్ కు కలలో కనిపించిన అమ్మవారు తనకు ఒక ఆలయం నిర్మించమని, తానూ ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలను కాపాడుతారని కోరిందట. కాంట్రాక్టర్ పొద్దున్న మేల్కొని తనకు వచ్చిన కలను గురించి చుట్టుపక్కలవారికి తెలియజేశాడట. వెంటనే రాతివిగ్రహంతో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారట స్థానికులు.


మైసమ్మ అమ్మవారిని పూజించి, ప్రశంసించటం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు తెల్లవారు ఝామున దక్షిణ దిశలో ఒక చెరువు ఏర్పడింది. ప్రజలు ఈ చెరువుని చూసి ఆశ్చర్యపడి ఆనందించారు. ప్రజలు చెరువు దగ్గర ఇళ్ళ నిర్మాణాలు చేసుకున్నారు. వర్షాకాలంలో ఇళ్ళల్లోకి నీరు చేరేది. ప్రజలందరూ అమ్మవారికి మొరపెట్టుకున్నారు. అమ్మవారు దయతలిచి నీరు వెనక్కు తిరిగి వెళ్ళిపోయేలా చేసింది. దీంతో ఆరోజు నుండి ప్రజలు అమ్మవారిని కలవరేటి మైసమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. కలవరేటి మైసమ్మ మహాలక్ష్మిదేవిగా అవతరించింది.

4.08.1991 లో అమ్మవారి దేవాలయం ముఖమండపం, గర్భాలయంతో అభివృద్ధి ప్రారంభమైంది. శ్రీమతి మరియు శ్రీ సుభాష్ ముదిరాజ్ చిన్న రాతి విగ్రహం ఎదుట అమ్మవారి విగ్రహాన్ని, శ్రీ చక్రం ప్రతిష్టించారు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఆరోజు నుండి అమ్మవారిని కట్టమైసమ్మ మహాలక్ష్మీదేవిగా ప్రాశస్త్యం పొందింది. 1991 తరువాత అమ్మవారి మందిరం దినదినాభివృద్ధి చెందుతూ ప్రసిద్ధి పొందింది. మాతంగేశ్వరి దేవి రాజగోపురం, అష్టలక్ష్మి మండపం, నాగదేవత విగ్రహం, నవదుర్గ మండపం మొదలైనవి శ్రీ చెక్కల సుభాష్ ముజ్దిరాజ్ గారు భక్తుల సహాయసహకారాలతో నిర్మించారు.

ప్రస్తుతం కట్టమైసమ్మ దేవాలయం అన్ని రకాల వసతులతో, ఏర్పాట్లతో పూర్తయింది.

పూజలు : ప్రతిరోజూ అష్టోత్తరం అభిషేకం

ప్రతి శుక్రవారాలు : లలితా సహస్రనామం, కుంకుమార్చన, అన్నదానం

ప్రతి పౌర్ణమి రోజున : లోకకళ్యాణార్థం చండీ హోమం.

కట్టమైసమ్మ దేవాలయంలో బోనాల నిర్వహణ కోసం మండపాలు నిర్మించారు. అమ్మవారికి వడిబియ్యం మొదలైన ఆచారాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం మరికొన్ని మండపాలను నిర్మించాలనే ప్రయత్నాలలో ఉన్నారు. భక్తుల మనోవాంచలు, కోరికలను నెరవేర్చడానికి బేగంపేట ప్రధాన రహదారిలో ఉన్న కట్టమైసమ్మ మహాలక్ష్మిదేవి ఆలయం కొలువై ఉంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML