ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 30 April 2015

మేషలగ్నస్థ గ్రహములుమేషలగ్నస్థ గ్రహములు

మేష లగ్నములో ఉండే గ్రహముల వలన కలిగే ఫలితాలు.
* సూర్యుడు :- మేషలగ్నానికి సుర్యుడు పంచమాధిపతి కనుక సూర్యుడు మేషలగ్నానికి శుభుడు. పంచమాధిపతి లగ్నములో ఉచ్ఛస్థితిలో ఉపస్థితమై ఉన్న కారణముగా వ్యక్తి అందము ఆకర్షణ కలిగి ఉంటాడు. విద్యావంతుడు ఔతాడు. జీవిత సరళిలో తండ్రితో విభెదాలు తల ఎత్త వచ్చు. ఆర్ధిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. సూర్యుడు పాపగ్రహ పీడితుడు కాక ఉన్న ప్రభుత్వపక్షము నుండి సహాయము అందుతుంది. సుర్యుడి ప్రభావము వలన సంతానప్రాప్తి కలుగుతుంది. సూర్యుడు తన పూర్ణదృష్టితో సప్తమ భావమైన తులారాశిని చూస్తాడు కనుక తులారాశి అధిపతి సూర్యుడు కనుక జీవితభాగస్వామి అందముగా ఉంటారు. జీవిత భగస్వామి సంయోగము లభిస్తుంది. కాని వివాహ జీవితములో ఒడి దుడుకులు ఉంటాయి.
* చంద్రుడు :- చంద్రుడు మేషలగ్నానికి సుఖస్థానాధిపతి కనుక జాతకుడు శాంత స్వభావుడైనా కొంటె తనము కలిగి ఉంటారు. కల్పనాశక్తి, మరియు భోగలాలస కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితము మీద ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి తల్లి నుండి తల్లి పక్షము నుండి సహాయము లభిస్తుంది. భూమి, భవనము, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. ప్రకృతి ఆరాధన, సౌందర్యపిపాస కలిగిఉంటారు. చలి వలన కలిగే జలుబు, దగ్గుల వలన బాధలు ఉంటాయి. చలి సంభందిత రోగములకు అవకాశము ఉంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వము, ప్రభుత్వ పక్షము నుండి ప్రయోజనము ఉంటుంది. సప్తమంలో తులారాశి మీద చంద్రుడి దృష్టి పూర్ణముగా ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామి కళాదృష్టి కలిగి, గుణసంపద కలిగి, సహాయసహకారాలు అందించే వారుగా ఉంటారు.
* కుజుడు :- కుజుడు మేషలగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి ఔతాడు. లగ్నాధిపత్యము వలన అష్టమాధిపత్య దోషం పోతుంది. కుజుడు లగ్నస్థుడు కనుక జాతకుడు కండలు తిరిగిన శరీరముతో సాహసవంతుడు, పరాక్రశాలిగా ఉంటాడు. కోపము, మొరటుదనము ఎక్కువ. కఠినమైన పనులను కూడా ఆత్మబలముతో చేయకలిగిన సామర్ధ్యము కలిగి ఉంటారు. సమాజములో పేరు, ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. బలహీనుల పట్ల వీరి హృదయములో సానుభూతి ఉంటుంది. కుజుడు చతుర్ధ స్థానమును, సప్తమ స్థానమును, అష్టమస్థానమును చూస్తాడు. దీని కారణముగా భూమి, వాహన సౌఖ్యము లభిస్తుంది. దుర్ఘటనలు జరగడానికి అవకాశము ఉంది. భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కనుక వైవ్వహిక జీవితము బాధించ బడుతుంది.
* బుధుడు :- బుధుడు మేషలగ్నానికి తృతీయ మరియు షష్టమభఅవాధిపతిగా అశుభము కలిగించును. లగ్నములో ఉన్న బుధుడు వ్యక్తిని జ్ఞానిగా, బుద్ధిమంతుడిగా చేయును. కళాక్షేత్రములో, లేఖకుడిగా అవకాశములు లభిస్తాయి. బుధ దశలలో బంధుమిత్రులతో వివాదములు, అశాంతి ఉంటాయి. షష్థమ స్థానాధిపతిగా బుధుడు ఉదర సంబంధమైన వ్యాదులు, మూర్చ వ్యాధి, ఆజన్మ రోగములు, మతిమరుపు కలిగిస్తాడు. వ్యాపారములో వీరికి సఫలత లభిస్తుంది. బుదుడి సప్తమ దృష్టికారణముగా సంతాన సంబంధాలలో సమస్యలు ఎదురౌతాయి. జీవితభాగస్వామికి ఆరోగ్యసమస్యలు ఉంటాయి. సప్తమమైన తులారాశి మీద బుధుడి దృష్టి కారణముగా జీవితభాగస్వామి గుణవంతుడుగా ఉంటాడు. వైవాహిక జీవితము సాధారణముగా ఉంటుంది.
* గురువు :- మేషలగ్నానికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతి ఔతాడు. ద్వాదశస్థానాధిపత్యము కారణముగా గురువు మేషలగ్నానికి అకారణమైన అసుభఫలములు ఇస్తాడు. అయినా త్రికోణాధిపత్యముతో అశుభము తొలగి పోతుంది. మేషలగ్న గురువు కారణముగా జాతకుడు మేధావి మరియు జ్ఞాని ఔతాడు. ఉజ్వలమైన ప్రభావవంతమైన వాక్కు వీరి స్వంతము. వీరికి ప్రజా సన్మానము, ప్రతిష్థ కలుగుతాయి. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ భావమును చూస్తాడు కనుక సంతాన భాగ్యము ఉంటుంది. శత్రు స్థానమైన తులారాశి మీద గురువు దృష్టి ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామికి మనోకలతలు ఉంటాయి. నమస్థానమైన ధనసు మీద గురువు దృష్టికి కారణముగా తండ్రికి శుభములు కలుగుతాయి.
* శుక్రుడు :- శుక్రుడు మేష లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి ఔతాడు. శుక్రుడు లగ్నస్థముగా కష్టములు, రోగములు కలిగిస్తాడు. జాతకుడు అందంగా కనిపించినా ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటాడు. శుక్రదశలో వీరు అధికముగా కష్టములను ఎదుర్కొంటారు. లగ్నస్థ శుక్రుడి కారణముగా స్త్రీ పురుషల మద్య ఆకర్షణ అధికము.
* శని :- లగ్నస్థ శని మేషలగ్నముకు దశమాధిపతిగా శుభములను, ఏకాదశాధిపతిగా అశుభమును కలిగిస్తాడు. లగ్నస్థ శని కారణముగా జాతకుడు సన్నముగా పొడవుగా ఉంటాడు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, దశమ స్థానాలపై దృష్టి సాగిస్తాడు. కనుక జాతకుడికి బంధుమిత్రుల సహకారము లభించుట కష్టము. ఉద్యోగ వ్యాపారములలో నిలకడ ఉండదు. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి.
* రాహువు :- మేషలగ్నములో రాహువు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. జీవితములో చాలా సంఘర్షణ ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాదులు ఉంటాయి. ఉద్యోగవ్యాపారాలలో అతి కష్టము మీద సఫలత సాధిస్తారు. వ్య్యాపారము చేయాలన్న కోరిక ఉన్నా ఉద్యోగము అధిక సఫలత ఇస్తుంది. రాహువు సప్తమదృష్టి కారణముగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. వైవాహిక జీవితము బాధిస్తుంది. మిత్రులు, సహోదరులు సహకరిస్తారు.
* కేతువు :- మేషలగ్నస్థ కేతువు కారణముగా శారీరక బలము కలిగిఉంటారు. వీరి దరికి రోగములు చేరవు. ఆత్మవిశ్వాసము , ధైర్య సాహసములు కలిగి ఉంటారు. కనుక శత్రువులు భయభక్తులతో ఉంటారు. సమాజములో గౌరవము, ఖ్యాతి లభిస్తుంది. రాజనీతి, చతురత కలిగి ఉంటారు. మాతృ వర్గము నుండి సఫలత లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి సంతానము నుండి సమస్యలను ఎదుర్కొంటారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML