గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 8 April 2015

విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఒక్క తులసిదళాన్ని తన పాదాలచెంత సమర్పించడం వలన, వివిధ రకాల పూలతో పూజించిన ఫలితం దక్కుతుంది.

అందుచేత పూజా మందిరాల్లోనూ స్వామివారిని తులసిదళాలతో పూజిస్తుంటారు. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమనీ ... అందువలన స్వామివారు తులసికోటలో నివాసముంటాడని పండితులు చెబుతున్నారు.

విష్ణుమూర్తి అనుగ్రహం కోసమే చాలామంది ఇంట్లో తులసీకోటను ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. అనునిత్యం తులసికి నీళ్లు పోసి దీపం పెట్టి ప్రదక్షిణలుచేస్తూ పూజిస్తుంటారు. ఇంకా గోవింద నామాలు చెబుతూ తులసిని పూజించడం వలన, సమస్తపాపాలు దోషాలు నశిస్తాయి.


దారిద్ర్యం వలన కలిగే బాధలు, వ్యాధులు దూరమైపోతాయి. సిరిసంపదలు, సుఖశాంతులు చేరువవుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం, దివ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం ... గోదానం చేసిన ఫలితం విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించడం ద్వారా లభిస్తుంది.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML