ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Wednesday, 8 April 2015

గోవులున్న ఇల్లు, గ్రామం, దేశం సమస్త సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది.

భారతీయుల జీవనసరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితియ స్థానాన్ని వహించిందిం గోవు. గోవులే లేనట్లు అయితే మానవుని మనుగడ సాఫీగా జరగటానికి అవకాశాలు చాలా తక్కువగా వుంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి. కాబట్టి పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మొదలగువాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తుజాతమును అగ్ని నుండి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయివు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు.వారి హోమాల వలన గోవు ఒక్కటే ఉత్పన్నం అయ్యింది. గోవుకు వేదప్రమాణమైన ప్రాముఖ్యత కలదు. అగ్ని సంబంధమగు హోమం వలన గోవు జన్మించటంచేత గోవునకు అగ్నిహోత్రమని పేరు వచ్చింది. కవ్వముచేత గోక్షీరాన్ని మథిస్తే వచ్చేటువంటి వెన్న - నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదానము , హిరణ్యదానాలను యఙ్ఞాయాగాది క్రతువులందును. పితృకర్మలయందును చేయవలెనని శృతి బోధించున్నది. పాలు ఇచ్చేటువంటి గోవు ఉంటే ధాన్యం బాగా పండుతుంది. గోవులున్న ఇల్లు, గ్రామం, దేశం సమస్త సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML