గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 6 April 2015

గంగా నది ప్రాశిష్టం :గంగా నది ప్రాశిష్టం :

నదులు ఎన్నో ఉన్నా కూడా మొట్ట మొదట మనం స్మరించేనటువంటిది గంగానది . గంగానది శ్రీ రామాయణం బాలకాండ ప్రకారము ఐతే అది హిమవంతుని యొక్క పెద్ద కూతురు ,నదీస్వరూపం అధిష్టాన దేవత . నది మాములుగా ఏదో నీటి రూపములో ప్రవహిస్తుంటుందిగాని ప్రతి నదికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటంది ,ఆ అధిష్టాన దేవత యొక్క రంగు ,ఆవిడ పెట్టుకునేటటువంటి నగలు ,కట్టుకునేటటువంటి బట్ట ,ఆవిడ ఎలా ఉంటుంది , ఏమి చేస్తూ ఉంటంది ,ఎలా అనుగ్రహిస్తుంది , ఇవి దర్శనం చేసిన వంటి మహాత్ములు చెప్పారు ,నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే గంగానది మీద అష్టకం చదివారనుకోండి నోట్లో చదువుకోవాలి ఎప్పుడైనా భయంకరమైన కష్టం వచ్చేసింది అనుకోండి ఎంత గట్టిగా మీరు చెప్పగలరో అంత గట్టిగా మీరు ఎక్కడున్నారో అక్కడే నిలబడి యమునాష్టకం చెబితే యమునా నది యొక్క అధిష్టాన దేవత అనుగ్రహిస్తుంది ,నే చెప్పలేదు ఈ మాట శంకరభగవద్పదాచార్యులు చెప్పారు . యమునాష్టకాన్ని గట్టిగా చదివితే ఎంత బిగ్గరగా అంటే నువ్వు ఎంత గట్టిగా చదవగలవో అంత గట్టిగా చదివితే యమునా నదికి ఒక అధిష్టాన దేవత ఉంటంది ఆవిడ నల్లటి రంగులో ఉంటంది అని శంకరాచార్యులు వారు వర్ణించారు ,ఆవిడ అనుగ్రహిస్తుంది ,అలాగే గంగానదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది ఆమె హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె . గంగ అసలు ప్రారంబములో అసలు భూమి మీద ప్రవహించినటువంటి నది కాదు . దేవ గంగ అన్న పేరుతొ ,ఆకాశ గంగ అన్న పేరుతొ ఎక్కడో కేవలము స్వర్గ లోకములోనే ప్రవహిస్తూ ఉండేది . అది దేవతలకు మాత్రమే ఉపయుక్తమైంది ఒకప్పుడు బఘిరధుడు తన పితృలందరినీ కూడా ఉద్దరించడము కోసమని ఘోరమైనటువంటి తపస్సు చేసాడు ,చేస్తే చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యారు . ఏం కావాలి అని అడిగారు పాతాళ లోకములో ఎక్కడో నా పితరులు అరువై వేల మంది సగరులు బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు . వాళ్ళకి ఈ భూమి మీద ఉన్న నీటిచేత ఉద్దరణ కలుగదు ఎందుచేత అంటే బ్రాహ్మణుని యొక్క తేజస్సుకి మరనిన్చినటువంటి వాడికి ఈ భూమిమీద నీళ్ళతో తర్పణ చేస్తే ఉదకము అందదు ,అందకుండా మధ్యలోనే ఆవిరైపోతుంది . అందుకే బ్రాహ్మణ తేజస్సు చేత మరణించారు సగరులు ,కపిల మహర్షి యొక్క కోపాగ్నికి దగ్దమైపోయారు . కపిలురు బ్రహ్మర్షి బ్రహ్మన్నోత్తములు అయన కోపాగ్నికి దగ్దము అయ్యారు కాబట్టి భూమిమీద ఉన్న జలాలతో తర్పణ చేస్తే దాహం తీరదు ,ఏ నదీ జలాలతో తర్పణ చేయాలి అంటే స్వర్గ లోకములో ఉన్న గంగ భూమి మీదకు రావాలి ,భూమి మీంచి పాతాళానికి వెళ్ళాలి ,పాతలములో ఈ భూడిద కుప్పల మీద ప్రవహించాలి అప్పుడు సగరులు ఉద్దరణ పొందుతారు దానికోసము మహానుబావుడు తపస్సు చేసాడు ,తపస్సు చేస్తే ప్రత్యక్షమై బ్రహ్మ గారు అన్నారు ఆ ఆకశ గంగ పైనుంచి కింద పడితే దాన్ని పట్టుకోగలిగినటువంటి వాడు లేడు . నాకు తెలిసి అది పట్టుకోగలిగినటివంటివాడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే కాబట్టి ఆయనను నేను శాసిన్చలేను పట్టమని వెళ్లి అయన గురించి తపస్సు చేయి మల్లీ వెళ్లి గోకర్ణం లో తపస్సు చేసారు పరమ శివుడు ప్రత్యక్షమై దయాలుడు కనుక నేను పడతాను పద అన్నాడు హిమాలయ పర్వతాలమీద బిందు సరోవరం మీద నిలబడి పైనుంచి పడుతున్నటువంటి గంగని తన జటాజూటములో ధరించడానికి సిద్ద పడ్డాడు . గంగ అహంకరిన్చింది ఏమిటో అనుకున్నాడు నిలబడ్డాడు ఇడ్చేస్తాను , కొన్ని సంవస్తరములు పడింది , జటాజూటములో బంధించి ఒక్క చుక్క కింద పడకుండా పట్టేసాడు . ఇన్నేళ్ళు అయిపోఇంది గంగ కింద పడడం లేదు , పితురులు ఎలా ఉద్దరణ పొందుతారు ,బఘీరదుదు ప్రార్ధించాడు అప్పుడు విడిచి పెట్టాడు ఆ విడిచి పెట్టిన దానిలో ఒక పాయ భఘీరదుదు వెంట వెళ్లి పాతలములో సగరలు యొక్క ఆ బూడిద కుప్పల మీద నుంచి వెళ్తే వాళ్ళు అందరు కూడా ఊర్ద్వ లోకాలు పొందారు ,మనకేం అదృష్టం కలిగిందంటే వాల్మీకి మహర్షి రామాయణం లో అంటారు ,గంగావతరణం జరిగినప్పుడు ఎవరు తల పెట్టలేదు అంట ,అంత వేగముతో వస్తుంది కాబట్టి చేతితో తీసుకుని తల మీద జల్లుకున్నారు ,పాపాలు అన్ని పోయి స్వర్గ లోకానికి వెళ్ళిపోయారు ,స్వర్గ లోకములో పుణ్యం పూర్తీ అయిపోయినవాళ్లు మల్లి కిందకు వచ్చి మల్లి జల్లుకున్నారు ,మల్లి పైకి వెళ్ళిపోయారు ,ఇదొక పెద్ద చక్రం తిరిగింది ఒక్క గంగావతరణం లోనే ,గంగ వెళుతుంటే ,గంగ ఒడ్డున సిద్ధులు ,సాత్యులు ,ఋషులు ,గందర్వులు ,దేవతలు వాళ్ళ వాళ్ళ వాద్య పరికరాలు మోగిస్తూ ,నృత్యం చేస్తూ పరుగులు తీసారు సంతోషముతో ,ఎందుకని పరమ శివుని యొక్క శరీరాన్ని అది తాకింది ,తాకి పడింది కాబట్టి అందరి పాపాలను దహించ కలిగినటువంటి శక్తి వచ్చింది . నీటి రూపంలో ఉంటుంది కానీ పాపాన్ని దహించెస్తున్ది అందులో మునక వేస్తె ,పాపాల్ని కాల్చడానికి స్నానయోగ్యమైనటువంటి నదీ ప్రవాహముగా ఈ లోకములో నిలబడి మనలని అనుగ్రహించినటువంటి పరమోత్క్రుష్టమైన స్వరూపం గంగ ,పైగా గంగ యందు ఒక విశేషము ఉంది ,శంకరాచార్యులు వారు గంగా నది కోసం అష్టకం చేస్తూ ఒక మాట అంటారు ,అయన అన్నారు "త్వత్తీరే వపుషోవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్" అని ఓ గంగమ్మ నేనొక్కటే కోరుకుంటాను నా శరీరం పడిపోయే ముందు నేను నీకు నీ వొడ్డున నిలబడి నీ ప్రవాహము వంక చూడాలి ,నీ ప్రవాహము వంక చూస్తూ నా మనసులో నారాయన్నంగ్రిద్వయం ,కాశిలో నిలబడి విశ్వనాదుడిని కాదు నారాయణుడి పాదాలు నే స్మరించాలి అదేంటది విశ్వనాదుడిని కదా స్మరించాలి మరి నారాయన్నంగ్రిద్వయం ఏంటి త్వత్తిరే వపుషోవసానసమయే ,వపుషో అంటే శరీరం ,శరీరం పడిపోయే సమయములో నేను నారాయణ స్మరించాలి ఎందుకు అంటే అయన అన్నారు అసలు నేను బ్రతికున్నంత కాలము ,చచ్చిపోయేటపుడు కూడా శివకేశవులు అని ఇద్దరున్నారన్న భావన నా యందు కలగకుండు గాక నారాయన్నంగ్రిద్వయం నేను స్మరించడం విశ్వనాధ పాదద్వాయాన్ని స్మరించడం అలా చిత్త చివర "మమ ప్రాణప్రయాణోత్సవే" ణోస్తవే అంటే తలెత్తడం ,అబ్బ అని సంతోషింతో తల ఎత్తి చూస్తం , ఉత్సవము అంటే అది పరమేశ్వరుడు వెల్లిపోతున్నడనుకోండి వాహనము లో తలెత్తి తలెత్తి చూస్తాము ఉత్స్తవము అంటారు ,నీరసముగా ఉండకూడదు . చచ్చిపోయేతపుడు నీరసముగా ఎవడు ఉంటాడు , ఇది పోతోంది అని బెంగ పెట్టుకున్నవాడు ,హమ్మయ్య ఈ పరిమితమయిన శరీరం పడిపోతుంది అనంతమైన పరబ్రహ్మ్మమును చేరిపోతున్నాడు ఇక ఈ పరిమితమైన కవచము ఉండదు ,ఇది పిట్లి పోతుంది అని "మమ ప్రాణప్రయాణోస్తవే",అని నా ప్రాణాలు ప్రయానమైపోతుంటే నేను ఉత్స్తవముగా తలెత్తి నీ వంక చూడాలి ఓ గంగమ్మ చూసి "నారాయన్నంగ్రిద్వయం"మనసులో తలుచుకోవాలి . గంగ వంక చూస్తూ వదిలేసినా ,గంగను స్మరిస్తూ వదిలేసినా ,గంగ నీటి బిందువు నాలుక మీద పడిన ప్రతిరోజూ గంగానది ,గంగానది ,గంగానది అని మూడు మాట్లు అన్న వాడు చిట్ట చివరికి స్వర్గాలోకన్నే చేరుతాడు ,అంతటి పాప దహనం చేస్తుంది ,అందుకే మీరు గమనించండి మనకి తెలియకుండానే గంగానది పేరు స్మరింపజేస్తారు , స్నానం చేస్తే సంకల్పములో రోజు గంగానది పేరు చెప్తాం ,పూజ చేసేటపుడు కలస ఆరాధనలో

"గంగే చ యమునే చైవ
గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిం కురు!!

గంగ గంగ గంగ అని మూడు మాట్లు అంటే చాలు అనుగ్రహిస్తుంది . ఏ నదికి లేని శక్తి గంగ ఒక్క దానికే ఎక్కడ ఉంది అంటే నైమిత్తిక తిదులయందు సమస్త జలములును గంగ ఆవహిస్తుంది ,ఇది మిగిలిన నదులు చేయవు ,నైమిత్తిక తిధులు అని కొన్ని ఉంటాయి ,దీపావళి పండగ ఉందనుకోండి , దీపావళి పండగ నాడు తెల్లవారి పోయాక స్నానం చేయకూడదు ,తెల్లవారక ముందు తైలభ్యాగణము చేసుకుని అంటే ఒళ్ళంతా నువ్వులు నూని రాసుకుని పెద్దవాళ్ళు వచ్చి మాడు మీద చమురు పెడతారు ,ఒంటికంతటికి నువ్వులు నూనె రాసుకుని అప్పుడు సూర్యోదయం కాకముందు తలస్నానము చేసేయాలి ,ఎందుకని ?,ఎందుకు అలా చేయాలి దీపావళి నాడు అంటే శాస్త్రం చెప్పింది ,అప్పుడు తైలే లక్ష్మి ,జలే గంగ , తైలము నందు ప్రవేశిస్తుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ,ఆ నూనె వంటికి రాసుకున్నారు అనుకోండి లక్ష్మి ఒళ్ళంతా ప్రవేశిస్తుంది ,లక్ష్మి ప్రవేశిస్తే అలక్ష్మీ తొలగిపోతుంది , జలే గంగ .. జలముల యందు గంగ ప్రవేశిస్తుంది తన పాపమే కదూ తన చేత దుష్టమైన ఆలోచనలు చేయించి కష్టాల్లో పడేటట్టు చేస్తుంది ,ఈ పాపము ఎప్పుడు తొలగిపోతుంది అంటే దీపావళి పండగ నాడు తెల్లవారుజామున చేసినటువంటి సామాన్యమైన ఉదకముతో కూడిన స్నానమైన గంగ ఆవాహన చేసి ఉండడము చేత పాపాలు పోగుట్టుకుంటారు ,రెండు దేవతలు ఎలా వస్తారో అలా పిలిస్తే చాలు నీలల్లోకి గంగ వస్తుంది లేకపోతే

"గంగే చ యమునే చైవ
గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిం కురు!! అని ఎలా అడుగుతున్నారు మంత్రముతో పిలిస్తే వస్తుంది ,పిలవకపోయినా వస్తుంది అది గంగ గొప్పతనము అందుకే

"భగవద్గీత కించిదధీత
గంగాజలలవకణికా పీతా
సకృదపియేన మురారి సమర్చా
తస్యకరోతి యమోపి న చర్చామ్ || "

గంగాజలలవకణికా అంటే ఒక చిన్న బిందువు నాలుక మీద పడిందనుకోండి ఇక వాడికి యమధర్మరాజు తో చర్చ లేదు ,గంగ చెంబు ,గంగ చెంబు అని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎవరికైనా అకస్మాత్తుగా ప్రనొత్కరనమ్ అవుతుంటే ఒక గంగ బిందువు తెచ్చి నాలుక మీద వేస్తారు ,వాడు ఉంచుకున్నాడ ,తాగాడ సంభందము లేదు ,వాడు ఇంకా లోపల ప్రాణం ఉండగా ఆ నాలుక మీద గంగ బిందువు పడిన్ది కాబట్టి ,శంకర భగవత్పాదులు చెప్తున్నారు ""భగవద్గీత కించిదధీత " ఒంట్లో ఓపిక ఉంటే భగవంతున్ని చదువుతావు ,ఓపిక ఉంటె విష్ణువిని ఆరాధన చేస్తావు ,ఓపిక పోయి ఇంద్రియములు వెనక్కి వెళ్ళిపోయి ,చెవి వినక ,ముక్కు ఊపిరి పీల్చక ,నోరు తెరుచుకోక బాధపడుతున్నపుడు ఇంకా ప్రాణం ఉండగా ఒక్క బిందువు నోట్లో పడితే పాపాల్ని అంతటిని కాల్చేస్తుంది ,కాల్చేసింది కాబట్టి ,యముడు గాని ,యమధర్మరాజు భటులు గాని ఎదురుకుండా నిలబడరు ,వాళ్ళ పని ఏముంది ,వాళ్ళు రా అంటే నేను రాను అనడము చర్చ కాబట్టి ఇక వాళ్ళు రా అనరు ,విష్ణు పార్శ్వకులు వస్తారు ,శివ పార్శ్వకులు వస్తారు ,వాళ్ళని చూడగానే సంతోషం అబ్బా ఎంత గొప్పగా ఉన్నారురా అంటాడు ,ఆ సంతోషములో వెళ్ళిపోతాడు ,కాబట్టి "తస్యకరోతి యమోపి న చర్చామ్" చర్చ లేకుండా చేసేస్తుంది యమధర్మరాజు తో గంగ, ఎప్పడు ? వెళ్లి స్నానం చేస్తే కాదు బిందువు నాలుకు మీద వేస్తె ,రోజు పుచ్చుకోండి , మూడు మాట్లు గంగానది ,గంగానది ,గంగానది అంటే చాలు పైగా అభిమానము చేత గంగ పరమేశ్వరునికి ఏ స్తానాన్ని పొందిది అంటే భార్య స్తానాన్ని పొందింది ,పరమ శివునికి ముగ్గురు భార్యలు అని శాస్త్రము అంటే నిజముగా భార్యలు అనుకునేరు .కాశీ పట్టణము ఒకటి`,గంగా నది ఒకటి ,గౌరీ దేవి ఒకటి ఈ ముగ్గురు భార్యలతో సమానం . పార్వతి దేవి అంటే ఎంత ప్రాణమో ఆయనకి గంగా నది అన్న ,కాశీ పట్టణము అన్న అంత ప్రీతి ,అందుకే కాశీ పట్టణము జోలికి వెళితే వ్యాసుడిని కూడా ఉపేక్షించలేదు . అంత గొప్ప నది గంగానది ,గంగ జోలికి వెళితే అనుగ్రహం పొందక పోవడము ఏంటి ,పిలిస్తే గంగ లేస్తుంది ,గంగ అధిష్టాన దేవతగా దర్శనము ఇస్తుంది ,తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు తన భార్య నగ పుచ్చుకుని వెళ్లి గంగానదికి సమర్పించి స్నానం చేసి ఇంటికొచ్చారు . ఇంటికొచ్చి కూర్చునారు ,కూర్చునేటప్పటికి పూజా మందిరములో ఎదురుకుండా ఆ వేసేసిన నగ ఉంది ,గంగా నదె కదా అని స్నానం చేసే ముందు వాళ్ళ ఆవిడని అడిగి అమ్మ తీసుకో అని ఆ నగలు ఇచ్చారు ,చెవి తాటంకాలు ఇచ్చేసారు ,మళ్లీ ఉన్నాయి అక్కడ ,ఆమ్మ గంగమ్మా నీకిచ్చాగా మల్లి ఇచ్చేసావే అన్నారాయన ,అమ్మవారి వాణి వినబడింది వారికి ,గంగమ్మ మాట్లాడింది ,అది నీ భార్య తాటంకాలు అయ్యా , నీవున్నవని అనడానికి గుర్తు ,నీ ఆయుర్దాయానికి గుర్తు ఆవిడ సౌభాగ్యానికి గుర్తు అవి ఇస్తావే ఓ గొలుసట్టుకొచ్చి వేయి అంది ,గంగ తన యొక్క బిడ్డలను అలా కాపాడుకుంటుంది ,ఇప్పటికి ఉన్నారు ,చింతామణి గణపతి దేవస్తానాన్ని నిర్వహణ చేస్తుంటారు మహానుభావులు ,వాళ్ళ అన్నదములు అందరు . వాళ్ళ నాన్నగారు ఆకరికి గంగ గడ్డ కట్టేసిన రోజులలో కూడా గంగలో స్నానం చేయకుండా ఇంటికొచ్చేవారు కాదు . ఒకప్పుడు ఆయన అంత తీవ్రమైన చలిలో గంగాలోకి వెళ్లి తల ముంచి స్నానానికి దిగారు ,ఇక లేవలేదు ,వలలు వేసి అంతటా వెతికారు ఎక్కడా దొరకలే శరీరము ,సాదారణముగా నీలల్లో చచ్చిపోతే చెవులు తినేస్తాయి ఎందుకంటే అది మృదులస్తి మెత్తగా ఉంటుంది ,చేపలు కూడా కొరికేస్తాయి ,చెవులు ఉండవు ఇంక ,తొమ్మిది రోజులు తర్వాత ఆయన శరీరము పైకి లేచింది ,ఎక్కడ మునిగారో అక్కడే లేచింది ,అంతా వెతికారు దొరకలేదు ,తొమ్మిది రోజుల తర్వాత పైకి లేస్తే దేదీప్యమానముగా ఉన్నారు ,ఎలా మునిగారో అలానే ఉన్నారు ,అప్పుడు ఒక మహా ప్రజ్ఞుడైన వ్యక్తి వచ్చి ఒక మాట అన్నాడు, ఏవయ్య ఆయన్ని కన్నపుడు వాళ్ళ అమ్మ తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుంది ,ఇంతటి ఆ భక్తుడు తొమ్మిది రోజులు నా కడుపులో పెట్టుకుని పంపిస్తానని గంగమ్మ తన కడుపులో పెట్టుకుంది . అప్పటికి ,ఇప్పటికి గంగ గంగే ,గంగ లాంటి నది లేదు ,అందుకే మిగిలిన నదులుకు అమ్మా అనె మాట కలిపామ లేదా ఉండదు గంగమ్మ అంటాం ,గంగ పూజ అంటాం అంత గొప్ప గంగ ,గంగా నది లాంటి నది ఉండదు . అందుకే అయన కాశి పట్టణములో ఉండేవాడు ,మహానుభావుడు గొప్ప సంగీతవిద్వంసుడు ,మహ్మదీయ మతానికి చెందినటువంటి వాడు భిస్విల్లాఖాన్ ఆయన్ని అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇస్తాం వచ్చేసేయ్ అంటే అయన అన్నాడు అమెరికా లో అన్ని ఉన్నాయేమో గాని గంగ లేదుగా ,గంగ అన్నది అంత గొప్పది ,అటువంటి గంగ గురించి స్మరించిన చాలు .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML