గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 6 April 2015

క్రైస్తవం, ఇస్లాం పుట్టి 2000, 700 సంవత్సరాలు మాత్రమె అయ్యింది, అంతకు పూర్వం విశ్వమంతా హిందుత్వమే నిండి ఉంది, శుక్రాచార్యుల శివలింగానికే ఇంకా మక్కా లో 'నమాజ్' జరుగుతుంది, భారత మాతను తిడుతున్న వారే రోజుకు ఐదు సార్లు తల ఈ నేలకు ఆనిస్తున్నారు - శ్రీ రాజేష్ పాండే భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజక్


క్రైస్తవం, ఇస్లాం పుట్టి 2000, 700 సంవత్సరాలు మాత్రమె అయ్యింది, అంతకు పూర్వం విశ్వమంతా హిందుత్వమే నిండి ఉంది, శుక్రాచార్యుల శివలింగానికే ఇంకా మక్కా లో 'నమాజ్' జరుగుతుంది, భారత మాతను తిడుతున్న వారే రోజుకు ఐదు సార్లు తల ఈ నేలకు ఆనిస్తున్నారు - శ్రీ రాజేష్ పాండే భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజక్ .ఇంపీరియల్ గార్డెన్స్, 04/04/2015 : భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ముగింపు సభ శ్రీ తాడ్ బన్ హనుమాన్ మందిరాన్ని చేరిన తర్వాత సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగింది, ఈ సమావేశ వేదిక పైన విశ్వ హిందూ పరిషద్ , భజరంగ్ దళ్ నాయకులు, ఇతర హిందూ సంస్థల నాయకులు మార్గదర్శనం చేసారు, శ్రీ రామ రాజు (విహిప రాష్ట్ర అధ్యక్షులు ) గారు స్వాగతోపన్యాసం చేసారు.

ఈ సందర్భంలో కార్యక్రమానికి ముఖ్య అధితిగా హాజరైన శ్రీ రాజేష్ పాండే భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజకులు మాట్లాడుతూ ' విశ్వం అంతా హిందుత్వమే నిండి ఉంది, ప్రపంచం అంతా తమకు తెలిసో తెలియకో ఇప్పటికి హిందు ఆరాధన పద్ధతులనే అవలంభిస్తున్నారు, ఇది కేవలం కాకతాళీయం కాబోదు, కేవలం 2000 సంవత్సరాలకు పూర్వమే క్రైస్తవం ఆభిర్భావించింది, దాదాపు 700 సంవత్సరాలకు పూర్వం మాత్రమె ఇస్లాం పుట్టింది, కాని హిందుత్వ మూలానికి కేవలం కాలమే ప్రమాణం కాగలదు, ఎప్పుడు కాలం పుట్టిందో అప్పుడే హిందుత్వం పుట్టింది, అందుకే హిందుత్వం ప్రపంచ మానవులకు ఆదర్శప్రాయమైన జీవన విధానం అయ్యింది. కృష్ణ మాసం క్రిస్మస్ గా మారింది, రాముని గూర్చి తెలుసుకునే నెల రంజాన్ గా మారింది, ఇప్పటికి శుక్రాచార్యుడు మక్కా లో ప్రతిష్టించిన శివలింగానికే 'నమాజ్' జరుగుతుంది, ప్రపంచంలో వైద్యం పుట్టక ముందే, ప్రపంచానికి తోలి అల్లోపతి వైద్యుడు లభించడానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మన దేశంలో ప్లాస్టిక్ సర్జరీలు జరుగుఉండేవి, ప్రపంచం కళ్ళు తెరవ ముందే సభ్య నాగరిక నమాజం మన దేశంలో విలసిల్లింది, ఆర్ధిక, సామాజిక , సాంస్కృతిక అసమానతలు లేని ఆదర్శ సమాజ జీవనం ఈ దేశంలో గడిచింది, మన దేశం సిరి సంపదలతో తుల తూగేది మీరే చెప్పండి దిక్కు లేని వాడి ఇంట్లో ఎప్పుడైనా దోపిడీ జరుగుతుందా ?, కేవలం ధనవంతుడి ఇంట్లోనే దోపిడీ జరుగుతుంది ఇదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దోపిడీదారులు, దురాక్రమణ దారులు ఈ దేశం పై దండ యాత్ర చేసారు, దేశ సంపదను కొల్లగొట్టారు, మన సంస్కృతిక వైభవాన్ని తుడిచి పెట్టడానికి విఫల యత్నం చేసారు, కాని మన భారతం ఎన్నడు వారి పన్నాగాలను పూర్తీ స్థాయిలో సాగనివ్వలేదు, మీకు తెలుసా ? ప్రపంచంలో అనేక దేశాలు ఒకే ఒక్క శత్రు దురక్రమనతో కాలఘర్భంలో కలిసి పోయాయి, కాని నా భారతం కొన్ని వందల దురాక్రమణలను తట్టుకుని నిలిచి గెలిచిన దేశం అయ్యింది, ఈ రోజు భాగ్యనగరంలో 'సమర్థ హిందు శక్తి సంగమం' కనిపించింది, మహా బలి వీర హనుమాన్ ని ఆరాధించాల్సిన అసలైన పద్దతి ఇదే, మన దేశాన్ని అనేక దండయాత్ర తర్వాత కూడా నిలిచి ఉంచిన సాత్విక శక్తి కి మరో రూపుగా " శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర " నిలిచింది, ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా నా జన్మకు ఒక సార్ధకత లభించింది, " అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు, జాతీయ సహా కార్యదర్శి శ్రీ జి సత్యం గారు, తెలంగాణ అధ్యక్షులు శ్రీ రామ రాజు గారు, కార్యధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారి, ప్రాంత కార్యదర్శి శ్రీ గాళ్ రెడ్డి మాధవ రెడ్డి, ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ కేశవ రాజు గారు, భజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భాను ప్రకాష్ గారు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML