గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 30 April 2015

పంచకరహితం అంటే?పంచకరహితం అంటే?

ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.

అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
2 అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.
4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.
6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.
8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.


కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.

అయితే తప్పని సరి పరిస్థితులలో .....

చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ
అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్

అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.

మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు.

ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04 ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం.
ఈ సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం.

తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి.

19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది.

వారం గురువారం - ఆదివారంనుంచి మొదలుపెడితే గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది.

తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది.

నక్షత్రం అనూరాధ. అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది.

లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది.

ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం.

తిథి + వారము + నక్షత్రము + లగ్నము
ఏకదశి + గురువారం + అనూరాధ + మిథునం
11 + 5 + 17 + 3 = 36 దీనిని 9 తో భాగహరించాలి.

9) 36 ( 4
36
-----
శేషం 0
-----

సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి` సంఖ్యకనుక ఈ ముహూర్తానికి పంచక రహితం అయినది.
Read More

చంద్ర బలంచంద్ర బలం
ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.

జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి
శుక్ల పక్షంలో : 2-5-9
క్రిష్ణ పక్షంలో : 4-8-12
శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.


అనగా శుక్లపక్షంలో చంద్రుడు 4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
Read More

ఫలానా సయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?ఫలానా సయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

జాతక చక్రం వేయడం తెలుసుకుందామనుకునే వారికి కలిగే మొదటి సందేహం ఇదే అనుకుంటాను. చాలా మందికి ఈ విషయం చిన్నప్పటి నుండే తెలిసి ఉంటుంది. కానీ ఇంకా ప్రాథమిక స్థాయికి వెళదామనిపించి ఈ విషయం కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఫలానా సయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? సమాధానం చాలా తేలికైనది. మన తెలుగు కాలెండర్ లో ఉంటాయి ఈ వివరాలన్నీ. ఇంకా మంచి పద్ధతి ఏమిటంటే ఓ చక్కని పంచాంగం ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడమే! తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అను ఐదు ( పంచ ) విషయాల ( అంగాల ) గురించి వివరించునదే "పఞ్చాఙ్గము" మన ఆంధ్రులు చంద్రుని బట్టి లెక్కలు వేస్తారు. కనుక మనది చాంద్రమానము.


సరే ఈ పఞ్చాఙ్గము లలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి గంటల పఞ్చాఙ్గము, ధృక్ ( సూర్య ) సిద్ధాంత పఞ్చాఙ్గము. పూర్వంనుండీ వాడేవి గంటల పఞ్చాఙ్గములు. కానీ సరిఅయిన లెక్కలు వచ్చునవి, జ్యోతీష్యులు అంగీకరించునవి ధృక్ సిద్ధాంత పఞ్చాఙ్గములు. తిథి, నక్షత్రాలు ఎప్పుడు ప్రారంభమౌతున్నాయి, ఎప్పుడు పూర్తవుతున్నాయి అనే విషయాలలో ఈ రెండింటికీ వ్యత్యాసాలు ఉన్నాయి. ( నేను ఇంకా తెలుసుకోవాలి )

ప్రస్థుతానికి నేను వాడేది ధృక్సిద్ధాంత పంచాగము. అందులో ‘పిడపర్తి వారి పంచాగము’ బాగుంటుంది. నేడు దానికి సరిపడు స్థాయిలో ‘కాలచక్రం’ అనే పంచాగము కుర్తాళం సిద్ధేశ్వర పీఠ ఆస్థాన సిద్ధాంతి గారైన శ్రీ పొన్నలూరి గార్గేయ దైవఙ్ఞ గారిచే రచింపబడున్నది.

సరే అటువంటి పంచాంగములో ఫలానా తేదీ నాడు ఏ తిథి, నక్షత్ర, యోగ, కరణములు ఎంతవరకు ఉన్నదీ అనే విషయం ఉంటుంది. సాధారణంగా అన్ని పంచాంగములలోనూ ప్రారంభ సమయాలు కాక, అంత్య సమయాలు ఇస్తారు. ఇక వారం విషయం అందరకూ తెలిసినదే! కానీ ఆంగ్ల మానము ప్రకారం అర్థ రాత్రి 12 నుండి మళ్లీ అర్థ రాత్రి 12 వరకు వారము కాదు. సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకటే వారముగా గ్రహించాలి. అలాగే తిథిని గ్రహించేటప్పుడు పూజలో సంకల్పానికి అయితే సూర్యోదయానికి ఎతిథి ఉంటే అదే తిథిని చెప్పాలి. కానీ ముహూర్త నిర్ణయానికి అయితే ఆసమయానికి ఏది ఉంటే అదే గ్రహించాలి.
Read More

స్కాందపురాణం లోని సహ్యాద్రి కాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది.స్కాందపురాణం లోని సహ్యాద్రి కాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇంతటి పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాలు ఉత్తర కర్నాటకలో పరశురాముడు సృష్టించిన నేటి కొంకణ భూభాగంలో నెలకొని ఉన్నాయి. ఈ ఏడు క్షేత్రాలు కూడా ఎన్నో శతాబ్దాల చరిత్రకు, మరెన్నో ప్రత్యేకతలకు నిలయాలు.

ఉడిపి

శ్రీ కృష్ణ క్షేత్రాలలో పేరొందిన ఉడిపికి ఆ పేరు రావడానికి సంభందించి రెండు రకాల కధనాలు వ్యాప్తిలో ఉండటం విశేషం. ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్ధం. నక్షత్రాల దేవుడు వెన్నెల రేడు చంద్రుడు. దక్ష శాపం నుండి సదాశివుని కృప వలన విముక్తుడై, శాశ్వతంగా ఆయన శిరమందు నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన క్షేత్రం అయినందున ఈ పేరు వచ్చినట్లుగా ఒక కధనం తెలుపుతున్నది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు. రెండవ కధనం ప్రకారం ఉడిపి అన్న పదం ఒడిపు అన్న తుళు పదం నుండి వచ్చినది అని, దానికి అర్ధం పవిత్ర గ్రామం అని అంటారు. జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా !
ఉడిపి దై్వత సిద్దాంత సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యుల వారి జన్మస్థలం.
పదమూడవ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించి మఠాన్ని స్థాపించారు.

కుక్కే సుబ్రహ్మణ్యం దేవస్థానం

ఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా (160 కి. మీ ) దక్షిణ కర్ణాటకలో ఉన్నది.
ఈ దివ్య క్షేత్ర పురాణ గాధ సత్య యుగం నాటిది.
లోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవ సేనతో మార్గశిర సుద్ద షష్టి నాడు ఇక్కడే జరిగినది.
స్కన్దునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు.
ఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార.కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ది.
దీనికి గల కారణం గురించిన గాధ ఇలా ఉన్నది.
గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది.

శంకర నారాయణ ఆలయం

కర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టిత సప్త ముక్తి క్షేత్రాలలో శంకరనారాయణలో ఉన్న శివ కేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. స్థానిక గాధ గురించిన విశేషాలు అందుబాటులో లేవు. కానీ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట సోమశేఖర రాయ అనే రాజు కట్టించినట్లుగా లభించిన ఆధారాల వలన తెలుస్తోంది.
సహ్యాద్రి పర్వతాలలో ఒకే పానువట్టం మీద హరిహరులిరువురూ లింగ రూపాలలో కొలువుతీరిన ఒకే ఒక్క క్షేత్రం ఇదేనేమో ! వ్యత్యాసము తెలియడానికి అన్నట్లు విష్ణు లింగ పై భాగాన కామ ధేనువు గిట్టల ముద్రలుంటాయి. మరో విశేషము ఏమిటంటే ఇక్కడ జయ విజయులు మరియు నంది ఉండటం. ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. భోగ మండపానికి బంగారు రేకులతో అలంకరించారు.

కోటేశ్వర

ఉడిపికి సుమారు ముపై్ప కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైనందున కోటేశ్వర అన్న పేరొచ్చింది. గతంలో ఉన్న ఏడు ప్రాకారాలలో కొంత వరకు కనుమరుగయ్యాయి. ఆలయ వెలుపల ఉన్న పెద్ద గద్దెను నిర్మించిన విధానానికి దానిని ఎక్కితే లోపల గర్భాలయంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని నేరుగా కాంచవచ్చును.
ఈ ఆలయంలో అన్ని ప్రత్యేక రూపాలలో కనపడతాయి.
ఇరవై అయిదు అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, వంద అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరణి, రెండో ప్రాకారంలో ఉన్న ఏనాటిదో తెలియని పెద్ద శిలా శాసనం ( ఇందులోని భాష గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటారు) ఇలా ప్రతివక్కటి విశేషమే !

కుంభాషి

సప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది కుంభాషి. ఉడిపికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువు తీరినది విఘ్న నాయకుడు శ్రీ గణేశుడు.
గజముఖుదు ఏనుగు తల ఆకారంలో ఉన్న కొండ మీద కొలువైనందున అనే గుద్దే ( ఏనుగు తల). పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట.
తీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఇక్కడి ప్రజలను చూసి వారు ప్రార్ధించగా గౌతమ ముని వచ్చి వరుణ దేవుని సంతృప్తి పరచడానికి యాగం ఆరంభించారట.
దానిని భగ్నం చేయడానికి కుంభాసురుడు అనే రాక్షసుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన భీమసేనుడు వానిని సంహరించారట.
కుంభాసురుడు మరణించిన ప్రదేశం కావడాన కుంభాషిగా పిలవబడుతోంది.
యాగం నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట.
యాగారంభములో పాండవులు ప్రతిష్టించిన శ్రీ మహా గణపతి నేటికీ అందరి పూజలు అనుకొంటున్నారు. ఇక్కడ ఒక చిన్న బిలం నుండి ఊరే నీరు గంగ నది అంత ర్వాహినిగా ప్రవహించడం వలన వస్తోంది అంటారు. దగ్గరలో సూర్య పుష్కరణి, చంద్ర పుష్కరణి ఉంటాయి. అలానే వారి ఆలయాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో నిలువెత్తు రూపంలో పెద్దశిరస్సు, చెవులతో, నిండైన వెండి కవచంలో చతుర్భుజ గణపతి దర్శనమిస్తారు.

కొల్లూర్‌ శ్రీ మూకాంబిక దేవి :

కోలా మహర్షి లోక కళ్యాణార్ధం చేసిన తపస్సుకు సంతసించిన సదా శివుడు ప్రత్యక్షం కాగ మహర్షి ఆది దంపతులను ఒకటిగా ఆరాధించే భాగ్యాన్ని కోరుకోన్నారట.
అందుకే లింగానికి మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది.
తదనంతర కాలంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఇక్కడ శ్రీ చక్ర సహిత దేవి యొక్క పంచలోహ విగ్రహాన్ని, శ్రీ చంద్రమౌలీశ్వర లింగాన్ని ప్రతిష్టించారట.
దేవి నవరాత్రులు, శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు.

శ్రీ మహాబలేశ్వర స్వామి కొలువుతీరిన గోకర్ణం :

ఉత్తర కర్ణాటకలో ఉన్న సప్త ముక్తి క్షేత్రాలలో ఆఖరిది గోకర్ణం.
రామాయణ కాలం నాటి ఈ క్షేత్ర గాధ అందరికి తెలిసినదే !
పరమ శివుని మెప్పించి ఆత్మ లింగాన్ని తీసుకొని లంకానగారానికి వెళుతున్న రావణాసురుని నుండి ఉపాయంతో గణపతి ఇక్కడ ఉంచాడు అన్నదే ఆ గాధ !
శ్రీ మహా బలేశ్వర స్వామి కొలువు తీరిన గోకర్ణం ఒక ఆద్యాత్మిక పర్యాటక కేంద్రం.
గోకర్ణం ఉడిపికి నూట డెభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ ఏడు స్థలాలను ఈ క్రింది మార్గంలో సందర్శించవచ్చును. తొలుత నేరుగా గోకర్ణం. తరువాత ఉడిపి తరువాత కుక్కే సుబ్రహ్మణ్యం. ఉడిపి నుండి బయలుదేరి కుందుపర వెళ్ళే దారిలో కుంబాషి, కోటేశ్వర సందర్శించుకొని కుందుపర, కొల్లూరు మీదగా శంకరనారాయణను చేరుకొని నాలుగు రోజులలో ప్రశాంతంగా యాత్ర పూర్తి చేసుకోవచ్చును.
Read More

తారాబలం చూడటం ఎలా?

తారాబలం చూడటం ఎలా?

ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం. ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.

1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....
1) జన్మతార, 2) సంపత్తార, 3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.


ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి. ఆ 27 నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి. అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది. మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.

పైవాటిలో సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను, ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.

జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.

చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.

ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.

ఉదాహరణ : రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే, ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.

తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....

ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !

ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను,
2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో ) మూడవ తారను,
3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను,
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు వదిలి పెట్టవలెను.

అంటే జన్మనక్షత్రము లగాయతు 1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.

అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి 1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.
Read More

నక్షత్రాలు - రాశులునక్షత్రాలు - రాశులు
కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు. - అని పురాణ కథ


ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.

అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం

మేషం: అశ్విని మొత్తం, భరణి మొత్తం, కృత్తిక 1వ పాదం
వృషభం: కృత్తిక 2వ, 3వ, 4వ పాదాలు, రోహిణి మొత్తం, మృగశిర 1వ, 2వ పాదాలు
మిథునం: మృగశిర 3వ , 4వ పాదాలు, ఆర్ద్ర మొత్తం, పునర్వసు 1వ, 2వ ,3వ పాదాలు
కర్కాటకం: పునర్వసు4వ పాదం, పుష్యమి మొత్తం, ఆశ్లేష మొత్తం
సింహం: మఘ మొత్తం, పుబ్బ(పూర్వ ఫల్గుణి)మొత్తం, ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం
కన్య: ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2వ,3వ,4వ పాదాలు, హస్త మొత్తం, చిత్త 1వ,2వ పాదాలు
తుల: చిత్త 3వ,4వ పాదాలు, స్వాతి మొత్తం, విశాఖ 1వ, 2వ, 3వ పాదాలు
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం, జ్యేష్ఠ మొత్తం
ధనుస్సు: మూల మొత్తం, పూర్వాషాఢ మొత్తం, ఉత్తరాషాఢ 1వ పాదం
మకరం: ఉత్తరాషాఢ 2వ,3వ,4వ పాదాలు, శ్రవణం మొత్తం, ధనిష్ఠ 1వ,2వ పాదాలు
కుంభం: ధనిష్ఠ 3వ,4వ పాదాలు, శతభిషం మొత్తం, పూర్వాభాద్ర 1వ, 2వ, 3వ పాదాలు
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం, రేవతి మొత్తం.

Read More

జాతకుని జన్మ కుండలి లో రాహు కేతువుల మద్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చిన చొ దానిని కాల సర్ప యోగం అని అంటారు.

జాతకుని జన్మ కుండలి లో రాహు కేతువుల మద్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చిన చొ దానిని కాల సర్ప యోగం అని అంటారు. దీనిలో చాల రకాలు వున్నాయి. వాటి వాటి స్తితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయం చెయ్యటం జరుగుతుంది దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయం చెయ్య బడుతుంది.
కాలసర్ప దోషం: రాహువు-రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని- కేతువు.


ఫలితాలు: కుటుంభ సమస్యలు, దీర్గ రోగాలు.

అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మద్య మిగలిన ఏడు గ్రహాలూ రావటం.
గుళిక కాల సర్ప దోషం: మాములుగా ఇది జాతక చక్రం లో మొదటి ఇంట ప్రారంభం అయ్యి తొమ్మిదొవ ఇంట సంమప్తం అవుతుంది.
ఫలితాలు:ఆర్ధిక మరియు కుటుంభ ఇబ్బందులు.
వాసుకి కాల సర్ప దోషం: రెండోవ ఇంట మొదలయి పడవ ఇంట సమాప్తం.
ఫలితాలు:అన్నదమ్ముల కలహాలు, సమస్యలు.
సంకాపాల కాలసర్ప దోషం: మూడోవ ఇంట మొదలయి ప్దకొందవైంట సమాప్తం.
ఫలితాలు:తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గన్డం, నివాస స్తల సమస్యలు.
పద్మ కాలసర్ప దోషం: నాలుగోవ ఇంట ప్రారంభమయి పన్నెండోవ ఇంట సంమాప్త.
ఫలితాలు: జీవిత భాగస్వామి తో కాని పిల్లలతో కాని సమస్యలు.
మహా పద్మ కాలసర్ప దోషం: అయిదోవ ఇంట ప్రారంభం అయ్యి ఒకటవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ.
తక్షక కాలసర్ప దోషం: ఆరవ ఇంట ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార నష్టాలు, వివాహ జీవతం లో ఇబ్బందులు.
కర్కోటక కాలసర్ప దోషం: యేడవ ఇంట ప్రారంభం మూడో వ ఇంట సమాప్తం.
ఫలితాలు: బార్య తో ఇబ్బందులు , అనుకోని సంఘటనలు.
శంఖచూడ కాలసర్ప దోషం: ఎనిమిదొవ ఇంట ప్రారంభం నాలుగో వ ఇంట సమాప్తం.
ఫలితాలు: తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట స్తితి.
ఘటక కాలసర్ప దోషం: తొమ్మిదొవ ఇంట ప్రారంభం అయిదోవ వ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార మరియు ఉద్యోగ సమస్యలు.
విషాధార కాలసర్ప దోషం: పదవ ఇంట ప్రారంభం ఆరోవ వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆర్ధిక మరియు వ్యాపార కష్టాలు.
శేషనాగ కాలసర్ప దోషం: పదకొండవ ఇంట ప్రారంభం యేడవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.
అపసవ్య కాలసర్ప దోషం: పన్నెండవ ఇంట ప్రారంభం ఎనిమిదొవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆలస్య వివాహం.

దోష పరిహారం :
కాళహస్తి లో కాని వేరే ఇతర రాహు కేతువులకు ప్రాముఖ్యం వున్నా ప్రదేశాలలో కాల సర్ప దోష నివారణ పూజ లు చేయున్చికుంటే ఉపసమనం కలుగుతుంది.


Read More

వాస్తు శాస్త్రంలో వర్గులు వర్గాధిపతుల యొక్క ప్రాధాన్యత........

వాస్తు శాస్త్రంలో వర్గులు వర్గాధిపతుల యొక్క ప్రాధాన్యత........

వాస్తు శాస్త్రంలో ‘అర్వణము’ అనే ఒక మాట ఉంది. అర్వణమూ అంటే అచ్చి రావటం. గ్రామాలూ, నగరాలూ, స్థలాలూ, క్షేత్రాలూ కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.


ఈ అర్వణం చూసే విధానం ‘కాలామృతం’ జ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది.

వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.

దేశం గురించి,అనారోగ్య సమయాలలో,గ్రామం గురించి,గృహ ప్రవేశ విషయాలలో,సేవకుని స్వీకరించే విషయాలలో,దానం చేసేటప్పుడు నామరాశికి ప్రాదాన్యం ఇవ్వాలి.యాత్రలకు,వివాహ విషయాలలో జన్మ రాశి ప్రాదాన్యం పొందుతుంది.

వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరం ఏ వర్గునకు చెందినదో ఆవర్గు అతనికి స్వవర్గు అవుతుంది,అయిదవది శత్రు వర్గు అవుతుంది.

ఉదా:-రాజశేఖర్ అనే వ్యక్తికి ఏ దిక్కు శత్రు వర్గు అవుతుంది.పేరులో మొదటి అక్షరం "రా" ర అనే అక్షరం "య" వర్గులో ఉంది .ఉత్తరం "స్వ "వర్గు అవుతుంది.కాబట్టి అయిదవ వర్గు దక్షిణం శత్రు వర్గు అవుతుంది.కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి దక్షిణ దిక్కు పనికి రాదు.

1,3,6,7 వర్గులు శుభప్రదమైనవి.2,4,5,8 శుభప్రదమైనవి కావు.

స్వవర్గు - ధన లాభం
ద్వితీయ వర్గు - స్వల్ప లాభం
తృతీయ వర్గు - శుభ ప్రదం
చతుర్థ వర్గు - వ్యాధులు
పంచమ వర్గు - శత్రు క్షేత్రం
షష్టమ వర్గు - కలహ ప్రదం (మతాంతరంలో లక్ష్మీ ప్రదం)
సప్తమ వర్గు - సర్వ సౌభాగ్యం
అష్టమ వర్గు - మరణ ప్రదం
Read More

ప్రపంచంలోనే అతి పురాతనమైన అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం.ప్రపంచంలోనే అతి పురాతనమైన అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం.

హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో
ఉన్నట్టు ఇప్పటికే ఋజువులున్నాయి.ఎన్నో ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలా ఫరిఢవిల్లింది.నాటి హిందూ రాజులు మన సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేశారు.మన సంప్రదాయాలు, శిల్ప కళా నైపు ణ్యం విదేశాల్లో ఇప్పటికీ వేనోళ్ళపొగడ్తలందుకుంటూనే ఉంది.హిందూ దేవాలయ సంప్రదా యం కేవలం మన భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా వ్యాపించింది.
జైన, బౌద్ధ మతాల కన్నా హిందూ మతం బాగా పరిఢవిల్లిం దనడం అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే ఈ కంబోడియా లోని కొన్ని వం దల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణూదేవు ని ఆలయం ‘ఆంగ్కోర్ వాట్’. ఆంగ్కోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

హిందూ సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాల యం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురా ర్పణ జరిగింది.
క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్ కోర్ వాట్ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి నట్లు చరిత్ర చెబుతోంది.
దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి వుంటాయి.
తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి.
అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయం తో ఆహ్లాద భరితంగా ఉంటుంది.మనదేశంలో కూడా లేదు..!భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన ఆర్కి టెక్చర్తో ఈ దేవాలయాన్ని రూపొందించారు.
కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణు మూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృ తికి దగ్గరగా ఉంటాయి.అత్యత్భుత సాంకేతిక నైపుణ్యం... ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుత మైన టెక్నాలజీని ఉపయో గించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట.
అదే టెక్నాలజీని ఆంగ్ కోర్ వాట్ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అందర్నీఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటి న్నర మైలు వెడల్పు తో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ ‘బారే’లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.
ఈ రిజర్వాయర్లను వ్యవ సాయ అవసరాలకు కూడా ఉపయోగించే వారట. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వా యర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచారు.

నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారం:

నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధ నలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట అద్భుతమైన దృశ్యాలు ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి.

ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు... ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించే వరకు అలాగే ఉండిపోతారు కూడా.ఎటు చూసినా హిందూ పురాణాలే..! కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి.

ఇక దక్షిణ మండపంలో ఆల యాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురు షాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్కోర్ వాట్ ఆలయ గోడలపై
సాక్షాత్కరిస్తాయి.
ఈ పేరెలా వచ్చిందంటే...ఇదంతా చదివిన తర్వాత భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంబోడియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా? అసలు విషయానికొస్తే పూర్వకాలంలో ‘కాంబోజ దేశం’ అని పిలిచేవారు.

సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంబోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంబోజ దేశం కాలక్రమంలో కంబోడియాగా మారిపోయింది.
కంబ ోడియా చరిత్ర...పూర్వకాలంలో కాంబోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది.
9-15 శతా బ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మన్తో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉంది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న ‘నాగ’ అనే రాకుమార్తెను వివాహం చేసుకుని
ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత అయిన ‘కాము’తో భరత ఖం డానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతా బ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సం స్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయా లుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాల నుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్కోర్ వాట్
దేవాలయం ఒకటి.మరో అద్భుతం ఆంగ్కోర్ థోమ్...ఆంగ్కోర్ వాట్ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్కోర్ థోమ్. ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన ‘జయవర్మన్ - 6 ఆంగ్కోర్ థోమ్ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే ‘గ్రేట్ సిటీ’ great city అని కూడా అంటారు.

9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏను గుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత.
ఆంగ్కోర్ థోమ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్ టవర్ (బెయాన్) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
54 అంతస్తులతో నిర్మించిన బెయాన్ (బుద్ధుని) దేవాలయంలో ఆంగ్కోర్ థోమ్కి ఆకర్షణీయంగానిలుస్తుంది.ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూ చియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ,బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి.

జీవిత కాలంలోకనీసం ఒక్కసారైనా ఇంత పెద్ద విష్ణుమూర్తి దేవాలయాన్నిదర్శించలనడం అతిశయోక్తి కాదు. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆంగ్కోర్ వాట్ వంటి అద్భుత కళాసౌరభం ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరకపోవడం బాధాకరం.


Read More

ర్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము.ర్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషుని తో ముగుస్తుంది. కాశి నగరం దగ్గర ప్రవరుడనే పరమ నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య ఉండేవారు. వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది.

తిరుగి పోయే ఉపాయం కోసం చూస్తున్న ప్రవరుడిని చూచు వరూధిని అనే అప్సరస మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు.
Read More

|| ఇతి శ్రీ పుష్పదంత విరచితం శివమహిమ్నః స్తోత్రం సమాప్తమ్ ||అథ శ్రీ శివమహిమ్నస్తోత్రమ్ ||

మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః |
అథా‌உవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్
మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః || 1 ||

అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయోః
అతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి |
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః || 2 ||

మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవతః
తవ బ్రహ్మన్‌ కిం వాగపి సురగురోర్విస్మయపదమ్ |
మమ త్వేతాం వాణీం గుణకథనపుణ్యేన భవతః
పునామీత్యర్థే‌உస్మిన్ పురమథన బుద్ధిర్వ్యవసితా || 3 ||

తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షాప్రలయకృత్
త్రయీవస్తు వ్యస్తం తిస్రుషు గుణభిన్నాసు తనుషు |
అభవ్యానామస్మిన్ వరద రమణీయామరమణీం
విహంతుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః || 4 ||

కిమీహః కింకాయః స ఖలు కిముపాయస్త్రిభువనం
కిమాధారో ధాతా సృజతి కిముపాదాన ఇతి చ |
అతర్క్యైశ్వర్యే త్వయ్యనవసర దుఃస్థో హతధియః
కుతర్కో‌உయం కాంశ్చిత్ ముఖరయతి మోహాయ జగతః || 5 ||

అజన్మానో లోకాః కిమవయవవంతో‌உపి జగతాం
అధిష్ఠాతారం కిం భవవిధిరనాదృత్య భవతి |
అనీశో వా కుర్యాద్ భువనజననే కః పరికరో
యతో మందాస్త్వాం ప్రత్యమరవర సంశేరత ఇమే || 6 ||

త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ |
రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిల నానాపథజుషాం
నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్ణవ ఇవ || 7 ||

మహోక్షః ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణినః
కపాలం చేతీయత్తవ వరద తంత్రోపకరణమ్ |
సురాస్తాం తామృద్ధిం దధతి తు భవద్భూప్రణిహితాం
న హి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి || 8 ||

ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వధ్రువమిదం
పరో ధ్రౌవ్యా‌உధ్రౌవ్యే జగతి గదతి వ్యస్తవిషయే |
సమస్తే‌உప్యేతస్మిన్ పురమథన తైర్విస్మిత ఇవ
స్తువన్‌ జిహ్రేమి త్వాం న ఖలు నను ధృష్టా ముఖరతా || 9 ||

తవైశ్వర్యం యత్నాద్ యదుపరి విరించిర్హరిరధః
పరిచ్ఛేతుం యాతావనలమనలస్కంధవపుషః |
తతో భక్తిశ్రద్ధా-భరగురు-గృణద్భ్యాం గిరిశ యత్
స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి || 10 ||

అయత్నాదాసాద్య త్రిభువనమవైరవ్యతికరం
దశాస్యో యద్బాహూనభృత రణకండూ-పరవశాన్ |
శిరఃపద్మశ్రేణీ-రచితచరణాంభోరుహ-బలేః
స్థిరాయాస్త్వద్భక్తేస్త్రిపురహర విస్ఫూర్జితమిదమ్ || 11 ||

అముష్య త్వత్సేవా-సమధిగతసారం భుజవనం
బలాత్ కైలాసే‌உపి త్వదధివసతౌ విక్రమయతః |
అలభ్యా పాతాలే‌உప్యలసచలితాంగుష్ఠశిరసి
ప్రతిష్ఠా త్వయ్యాసీద్ ధ్రువముపచితో ముహ్యతి ఖలః || 12 ||

యదృద్ధిం సుత్రామ్ణో వరద పరమోచ్చైరపి సతీం
అధశ్చక్రే బాణః పరిజనవిధేయత్రిభువనః |
న తచ్చిత్రం తస్మిన్ వరివసితరి త్వచ్చరణయోః
న కస్యాప్యున్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః || 13 ||

అకాండ-బ్రహ్మాండ-క్షయచకిత-దేవాసురకృపా
విధేయస్యా‌உ‌உసీద్‌ యస్త్రినయన విషం సంహృతవతః |
స కల్మాషః కంఠే తవ న కురుతే న శ్రియమహో
వికారో‌உపి శ్లాఘ్యో భువన-భయ- భంగ- వ్యసనినః || 14 ||

అసిద్ధార్థా నైవ క్వచిదపి సదేవాసురనరే
నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః |
స పశ్యన్నీశ త్వామితరసురసాధారణమభూత్
స్మరః స్మర్తవ్యాత్మా న హి వశిషు పథ్యః పరిభవః || 15 ||

మహీ పాదాఘాతాద్ వ్రజతి సహసా సంశయపదం
పదం విష్ణోర్భ్రామ్యద్ భుజ-పరిఘ-రుగ్ణ-గ్రహ- గణమ్ |
ముహుర్ద్యౌర్దౌస్థ్యం యాత్యనిభృత-జటా-తాడిత-తటా
జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా || 16 ||

వియద్వ్యాపీ తారా-గణ-గుణిత-ఫేనోద్గమ-రుచిః
ప్రవాహో వారాం యః పృషతలఘుదృష్టః శిరసి తే |
జగద్ద్వీపాకారం జలధివలయం తేన కృతమితి
అనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తవ వపుః || 17 ||

రథః క్షోణీ యంతా శతధృతిరగేంద్రో ధనురథో
రథాంగే చంద్రార్కౌ రథ-చరణ-పాణిః శర ఇతి |
దిధక్షోస్తే కో‌உయం త్రిపురతృణమాడంబర-విధిః
విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః || 18 ||

హరిస్తే సాహస్రం కమల బలిమాధాయ పదయోః
యదేకోనే తస్మిన్‌ నిజముదహరన్నేత్రకమలమ్ |
గతో భక్త్యుద్రేకః పరిణతిమసౌ చక్రవపుషః
త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతామ్ || 19 ||

క్రతౌ సుప్తే జాగ్రత్‌ త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే |
అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదాన-ప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బధ్వా దృఢపరికరః కర్మసు జనః || 20 ||

క్రియాదక్షో దక్షః క్రతుపతిరధీశస్తనుభృతాం
ఋషీణామార్త్విజ్యం శరణద సదస్యాః సుర-గణాః |
క్రతుభ్రంశస్త్వత్తః క్రతుఫల-విధాన-వ్యసనినః
ధ్రువం కర్తుః శ్రద్ధా-విధురమభిచారాయ హి మఖాః || 21 ||

ప్రజానాథం నాథ ప్రసభమభికం స్వాం దుహితరం
గతం రోహిద్‌ భూతాం రిరమయిషుమృష్యస్య వపుషా |
ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమముం
త్రసంతం తే‌உద్యాపి త్యజతి న మృగవ్యాధరభసః || 22 ||

స్వలావణ్యాశంసా ధృతధనుషమహ్నాయ తృణవత్
పురః ప్లుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి |
యది స్త్రైణం దేవీ యమనిరత-దేహార్ధ-ఘటనాత్
అవైతి త్వామద్ధా బత వరద ముగ్ధా యువతయః || 23 ||

శ్మశానేష్వాక్రీడా స్మరహర పిశాచాః సహచరాః
చితా-భస్మాలేపః స్రగపి నృకరోటీ-పరికరః |
అమంగల్యం శీలం తవ భవతు నామైవమఖిలం
తథాపి స్మర్తౄణాం వరద పరమం మంగలమసి || 24 ||

మనః ప్రత్యక్చిత్తే సవిధమవిధాయాత్త-మరుతః
ప్రహృష్యద్రోమాణః ప్రమద-సలిలోత్సంగతి-దృశః |
యదాలోక్యాహ్లాదం హ్రద ఇవ నిమజ్యామృతమయే
దధత్యంతస్తత్త్వం కిమపి యమినస్తత్ కిల భవాన్ || 25 ||

త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహః
త్వమాపస్త్వం వ్యోమ త్వము ధరణిరాత్మా త్వమితి చ |
పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతా బిభ్రతి గిరం
న విద్మస్తత్తత్త్వం వయమిహ తు యత్ త్వం న భవసి || 26 ||

త్రయీం తిస్రో వృత్తీస్త్రిభువనమథో త్రీనపి సురాన్
అకారాద్యైర్వర్ణైస్త్రిభిరభిదధత్ తీర్ణవికృతి |
తురీయం తే ధామ ధ్వనిభిరవరుంధానమణుభిః
సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణాత్యోమితి పదమ్ || 27 ||

భవః శర్వో రుద్రః పశుపతిరథోగ్రః సహమహాన్
తథా భీమేశానావితి యదభిధానాష్టకమిదమ్ |
అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శ్రుతిరపి
ప్రియాయాస్మైధామ్నే ప్రణిహిత-నమస్యో‌உస్మి భవతే || 28 ||

నమో నేదిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమః
నమః క్షోదిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః |
నమో వర్షిష్ఠాయ త్రినయన యవిష్ఠాయ చ నమః
నమః సర్వస్మై తే తదిదమతిసర్వాయ చ నమః || 29 ||

బహుల-రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః
ప్రబల-తమసే తత్ సంహారే హరాయ నమో నమః |
జన-సుఖకృతే సత్త్వోద్రిక్తౌ మృడాయ నమో నమః
ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః || 30 ||

కృశ-పరిణతి-చేతః క్లేశవశ్యం క్వ చేదం క్వ చ తవ గుణ-సీమోల్లంఘినీ శశ్వదృద్ధిః |
ఇతి చకితమమందీకృత్య మాం భక్తిరాధాద్ వరద చరణయోస్తే వాక్య-పుష్పోపహారమ్ || 31 ||

అసిత-గిరి-సమం స్యాత్ కజ్జలం సింధు-పాత్రే సుర-తరువర-శాఖా లేఖనీ పత్రముర్వీ |
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశ పారం న యాతి || 32 ||

అసుర-సుర-మునీంద్రైరర్చితస్యేందు-మౌలేః గ్రథిత-గుణమహిమ్నో నిర్గుణస్యేశ్వరస్య |
సకల-గణ-వరిష్ఠః పుష్పదంతాభిధానః రుచిరమలఘువృత్తైః స్తోత్రమేతచ్చకార || 33 ||

అహరహరనవద్యం ధూర్జటేః స్తోత్రమేతత్ పఠతి పరమభక్త్యా శుద్ధ-చిత్తః పుమాన్ యః |
స భవతి శివలోకే రుద్రతుల్యస్తథా‌உత్ర ప్రచురతర-ధనాయుః పుత్రవాన్ కీర్తిమాంశ్చ || 34 ||

మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః |
అఘోరాన్నాపరో మంత్రో నాస్తి తత్త్వం గురోః పరమ్ || 35 ||

దీక్షా దానం తపస్తీర్థం ఙ్ఞానం యాగాదికాః క్రియాః |
మహిమ్నస్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశీమ్ || 36 ||

కుసుమదశన-నామా సర్వ-గంధర్వ-రాజః
శశిధరవర-మౌలేర్దేవదేవస్య దాసః |
స ఖలు నిజ-మహిమ్నో భ్రష్ట ఏవాస్య రోషాత్
స్తవనమిదమకార్షీద్ దివ్య-దివ్యం మహిమ్నః || 37 ||

సురగురుమభిపూజ్య స్వర్గ-మోక్షైక-హేతుం
పఠతి యది మనుష్యః ప్రాంజలిర్నాన్య-చేతాః |
వ్రజతి శివ-సమీపం కిన్నరైః స్తూయమానః
స్తవనమిదమమోఘం పుష్పదంతప్రణీతమ్ || 38 ||

ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వ-భాషితమ్ |
అనౌపమ్యం మనోహారి సర్వమీశ్వరవర్ణనమ్ || 39 ||

ఇత్యేషా వాఙ్మయీ పూజా శ్రీమచ్ఛంకర-పాదయోః |
అర్పితా తేన దేవేశః ప్రీయతాం మే సదాశివః || 40 ||

తవ తత్త్వం న జానామి కీదృశో‌உసి మహేశ్వర |
యాదృశో‌உసి మహాదేవ తాదృశాయ నమో నమః || 41 ||

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః |
సర్వపాప-వినిర్ముక్తః శివ లోకే మహీయతే || 42 ||

శ్రీ పుష్పదంత-ముఖ-పంకజ-నిర్గతేన
స్తోత్రేణ కిల్బిష-హరేణ హర-ప్రియేణ |
కంఠస్థితేన పఠితేన సమాహితేన
సుప్రీణితో భవతి భూతపతిర్మహేశః || 43 ||

|| ఇతి శ్రీ పుష్పదంత విరచితం శివమహిమ్నః స్తోత్రం సమాప్తమ్ ||
Read MoreRead More

గుడిలో శఠగోపం తలమీద పెట్టడం ద్వారా ఫలితం ?గుడిలో శఠగోపం తలమీద పెట్టడం ద్వారా ఫలితం ?

శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపంను వెండి , రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శడగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.


సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, షడగోప్యమును వక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. షడగోప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. షడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు.
Read More

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||

హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||
Read More

ప్రదోషస్తోత్రాష్టకంప్రదోషస్తోత్రాష్టకం

సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవ్రీమి సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి |
సంసారముల్బణమసారమవాప్య జంతోః సారోzయమీశ్వరపదాంబురుహస్య సేవా || ౧ ||


యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే |
ఏతత్కథాం శ్రుతిపుటైర్న పిబంతి మూఢాస్తే జన్మజన్మసు భవంతి నరా దరిద్రాః || ౨ ||

యే వై ప్రదోషసమయే పరమేశ్వరస్య కుర్వంత్యనన్యమనసోంzఘ్రిసరోజపూజామ్ |
నిత్యం ప్రవృద్ధధనధాన్యకళత్రపుత్రసౌభాగ్యసంపదధికాస్త ఇహైవ లోకే || ౩ ||

కైలాసశైలభువనే త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచితరత్నపీఠే |
నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణౌ దేవాః ప్రదోషసమయే ను భజంతి సర్వే || ౪ ||

వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుం దధత్పద్మజః
తాలోన్నిద్రకరో రమా భగవతీ గేయప్రయోగాన్వితా |
విష్ణుః సాంద్రమృదంగవాదనపటుర్దేవాః సమంతాత్ స్థితాః
సేవంతే తమను ప్రదోషసమయే దేవం మృడానీపతిమ్ || ౫ ||

గంధర్వయక్షపతగోరగసిద్ధసాధ్యవిద్యాధరామరవరాప్సరసాం గణాంశ్చ |
యేzన్యే త్రిలోకనిలయా సహభూతవర్గాః ప్రాప్తే ప్రదోషసమయే హరపార్శ్వసంస్థాః || ౬ ||

అతః ప్రదోషే శివ ఏక ఏవ పూజ్యోzథ నాన్యే హరిపద్మజాద్యాః |
తస్మిన్మహేశే విధినేజ్యమానే సర్వే ప్రసీదంతి సురాధినాథాః || ౭ ||

ఏష తే తనయః పూర్వజన్మని బ్రాహ్మణోత్తమః |
ప్రతిగ్రహైర్వయో నిన్యే న దానాద్యైః సుకర్మభిః |
అతో దారిద్ర్యమాపన్నః పుత్రస్తే ద్విజభామిని |
తద్దోషపరిహారార్థం శరణాం యాతు శంకరమ్ || ౮ ||
Read More

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పేదిస్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పేది

సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు
రెండు చేతులతో తల గీరుకోరాదు
అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును
ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు
ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను
గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు
గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు
గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు
సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం లక్ష్మి కటాక్షము. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం లక్ష్మి లోగిలోకి రావడానికి దోహదం
చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు
ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు
Read More

* శివుడు పంచావతారమూర్తి* శివుడు పంచావతారమూర్తి

పరమ శివుడు పంచావతారమూర్తి. విష్ణుమూర్తి లోక కళ్యాణార్ధం దశావతారాలుగా అవతరించినట్లు, అందరికి విదితమే ! కాని పరమశివుడు బ్రహ్మ కోరికపై ఐదు అవతారాలు దాల్చిన విషియం కొందరికి మాత్రమే విదితం.


ఈశ్వరుడు త్రిలోచనుడు , త్రిశూలి, ధవళ శరీరుడని మాత్రమే అందరూ ఎరిగిన విషియము. అమృత మధనం సమయంలో గరళ్ళాన్ని త్రాగి కంఠమున నిలుపుకున్నందున గరళకంఠుడూ, నీలకంఠుడు అని కంఠము మాత్రమే నీలినలుపు రంగుల్లో ఉంటుందని మన విశ్వాసం.

కాని బ్రహ్మ కోరిక పై ఐదు సందర్భాలలో అయిదే వతారమౌలను ధరించినందున ఆయ్న శరీర ఛాయలు ,నామములు కూడా పంచావతారమూర్తి పేరును సార్ధకం చేశాయి.

బ్రహ్మదేవుడు శ్వేతవరాహకల్పంలో పరమేశ్వరుని ధ్యానించి,తన విధులను నిర్వర్తించడానికి తగిన ఙ్ఞానాని ప్రసాదించమని ప్రార్ధించాడు. నిస్చల భక్తితో కొలచిన వారిని అనుగ్రహించడం కోసం వెంటనే ప్రత్యక్షమయ్యేవాడే పరమేఅశ్వరుడు.ఆయన గౌరిదేవితో కూడి సద్యోజాత శివరూపం తో ప్రత్యక్షం కాగా,తనకు పుత్ర ప్రాప్తి కలగాలన్నారు. వెంటన్నే నలుగురు కుమారులు కలిగారు, వారే సునందుడు, నందనుడు, విశ్వనందనుడు, ఉపనందుడు.

బ్రహ్మదేవుడు రక్తకల్పంలో బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ధ్యానించగా, ఆయన ఎర్రటి కళ్ళతోనూ,కెంపు రంగు శరీరంతోనూ, రక్త వర్ణ వస్త్రభూషణాలను ధరించడమే కాకుండా, అగ్నిగోళాల వంటి ఎర్రని కన్నులతో ప్రసాంత వదనంతో ప్రత్యక్షమై, ఙ్ఞానభిక్షతో బాటు, ఎర్రనివస్త్రాలను ధరించిన నలుగురు కుమారులను అనుగ్రహించారు. వారే విరజుడు,వివాహుడు, విశోకుడు, విశ్వభావనుడు. దీనితో శివుని రెండవ అవతారమైన వామదేవ అవతారం.

బ్రహ్మదేవుడు పీతవాసకల్పంలో శివుని ధ్యానించడం,ఆయన పసుపు వర్ణపు వస్త్రాలను ధరించి,బంగారు వర్ణంలో,మిలమిల మెరిసే పసిడి తెజస్సుతో,భుజబలశక్తిగల ఆజానుబాహునిలా ప్రత్యక్షమయ్యారు.అదే మూడవ అవతరామైన తత్పురుషవతారం.తరువాత వచ్చిన కల్పం శివకల్పం. ఈ కల్పంలో సర్వం జల మయమైపోయింది. ఏ దిశ చుచిన జలమయమే .ఇలా సహస్ర వర్షాలు గడిచిపోయాయి. సృష్టి కార్యం ఎలా నిర్వర్తించాలన్నది బ్రహ్మకు సమస్యై పోయింది. మరలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని ,శివుని గూర్చి తపస్సు చేసారు. అప్పుడు పరమేశ్వరుడు నల్లటి శరీరధారియై,నళ్ళటి కిరీటాన్ని ధరించడమే కాకుంద, శరీరంపై లేపనాన్ని పూసుకుని, ఓ దివ్యమైన,నలుపు లోను కూడా తెజస్సు గల "అఘోరమూర్తి"గా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు.

సృష్టికార్యానికి సహకారులుగా కొందరిని అనుగ్రహించమని మరీమరీ వేడుకోగా,నల్లని దేహం, నల్లని ముఖం,నల్లని శిఖ కలిగిన నలుగుర్ని బ్రహ్మ సృష్టికి ఆ నలుగురూ ఎంతగానో తోడ్పద్దారు, బ్రహ్మ అంతర్గత మధనాన్ని గ్రహించాడు. ఆ ఙ్ఞానన శక్తి వెనుకగల స్తిథిని గ్రహించాడు. బ్రహ్మ అడిగిన ఙ్ఞానప్రసాదమేమిటో గ్రహించారు.మరలా విశ్వకల్పం వచ్చింది. కల్పకల్పానికి జరిగినట్టుగానే ఇక్కడ బ్రహ్మకు మళ్ళి సమస్యలే! ఈ సారి బ్రహ్మ శరీరం నుంచే మహానాదం,సరస్వతి రూపావిర్భావం జరిగింది. పరమశివుడేఅ అలా అవతరించగా, బ్రహ్మ అది "ఈసానవతారంగా" భావించారు.

ఈ ఐదవ అవతారమే ఈశ్వరుని అన్ని అవతారలకంటే విశిష్టమైనది. ఇక్కడ ఆయనకు నలుగురు సహాయకులను కూడా ప్రదానం చేసారు. వారే జటి,ముండి, శిఖండి, అర్ధముండీలు.ఇలాగ ఐదు సందర్భాల్లోని ఐదు అవతారాల్లోనూ బ్రహ్మ సృష్టి నిర్మాణ సౌలభ్యానికి,ముల్లోకముల హితానికే ముక్కంటి అనుగ్రహించినట్టు శతరుద్రసమ్హిత చెబుతోంది.
హర హర మహా దేవ శంభో శంకర !
Read More

మహాభారతం - అరుదైన గ్రహణంమహాభారతం - అరుదైన గ్రహణం

మనకు ఎప్పుడైనా గ్రహణాలు సంభవించప్పుడు, ఇది చాలా అరుదుగా ఏర్పడే గ్రహణం, ఇలా 100 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని, లేదా 150 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, దీన్ని తప్పక వీక్షించండి అని నాసా మొదలైన సంస్థలు, భారతదేశంలో ఉండే మరికొన్ని సంస్థలు ప్రకటనలు జారీ చేస్తాయి. ఈ గ్రహణం కూడా అలాంటిదే, చాలా అరుదుగా ఏర్పడేది. ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది.


1. జ్యేష్ఠా నక్షత్రంలో అమావాస్య రావడం 19 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.

2. అదే సమయంలో జ్యేష్ఠాలో సూర్యగ్రహణం 340 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది.

3. అదీగాక, శని రోహిణిలో ఉండటం 7000 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.

ఈ అరుదైన కూటమి మహాభారత యుద్ధం తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఏర్పడలేదు. ఈ గ్రహణం, మహాభారతంలో చెప్పిన గ్రహకూటములు కోసం వెనక్కు లెక్కించుకుంటూ వెళ్తే, యుద్ధం సరిగ్గా 22 నవంబరు క్రీ.పూ. 3137 ప్రారంభమైందని తేలుతుంది. మనిషి లెక్కించటంలో తప్పులుండవచ్చు కానీ, గ్రహాలు, భూమి కదలికలు చాలా ఖచ్చితమైనవి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ప్రతి 7000 సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పాడుతుంది అన్నారు కదా, మరి మహాభారతం క్రీ.పూ.3137 లోనే జరిగిందని ఎలా నిర్ధారణకు వచ్చారు? అంతకంటే ముందు కూడా కూటమి ఏర్పాడి ఉండచ్చు కదా? అని అనిపిస్తుంది. కానీ ఈ ఖగోళవింతకు ఇంకో అరుదైన వింత తోడయ్యింది. విచిత్రమేంటంటే ఈ రెండు గ్రహణాలు కేవలం 13 రోజుల వ్యవధిలో ఏర్పడ్డాయి. చంద్రుడు భూమికి ఉపగ్రహం. చంద్రుడు 360 డిగ్రీలు తిరుగుతాడు. చంద్రుడి గమనంలో ప్రతి 12 డిగ్రీల మార్పును ఒక తిధిగా పరిగణిస్తారు. చంద్రుడు, భూమి, సూర్యుడు ఈ ముగ్గిరిలో భ్రమణం కారణంగా, చంద్రుడిపై భూమి నీడ పడినప్పుడు కనిపించని ప్రాంతాన్ని బట్టి చంద్రుడి ఎదుగుదల, క్షీణించడం కనిపిస్తాయి. సాధారణంగా అమావాస్య, పూర్ణిమకు మధ్య 15 రోజులు వ్యవధి ఉంటుంది. కానీ ఈ విశేష సంఘటన (వింత) జరిగడానికి కారణం చంద్రుడు తన కక్ష్యలో 180 డిగ్రీలు (అంటే పూర్ణిమ నుంచి అమావాస్య వరకు లేదా అమావాస్య నుంచి పూర్ణిమ వరకు) తిరగటానికి సాధారణంగా 12 డిగ్రీల వేగంతో పరిభ్రమిస్తాడు. అప్పుడు అమావాస్య, పూర్ణిమలకు మధ్య 15 రోజుల వ్యవధి ఉంటుంది. కానీ ఈ ఖగోళ వింత ఏర్పడినప్పుడు చంద్రుడు తన సాధారణ వేగానికి భిన్నంగా 13-17 డిగ్రీల వేగంతో తిరిగడం వలన 13 రోజుల వ్యవధిలోనే ఇలా జరిగింది.

దీన్ని ఆధునిక సాఫ్ట్వేర్ల ద్వారా పరిశీలించి, భారతీయులు, విదేశీయులు అనేకులు ధృవపరచటం జరిగింది. ఇలా జరగడానికి భారతీయ ఖగోళశాస్త్రంతో పాటు, ఆధునికశాస్త్రవేత్తలు కూడా కారణాలు వివరించారు. ఈ వింత మహాభారతం జరిగిందని ధృవపరచటానికి ఒక సాక్ష్యం. ఇటువంటివే అనేకం మహాభారతంలో ప్రస్తావించటం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకుని Astronomical dating చేసినప్పుడు పైన చెప్పిన తేదీలలో మాహాభారతం జరిగిందని నిర్ధారించారు.
Read More

వైదిక సంస్కృతి - మహాభారతంవైదిక సంస్కృతి - మహాభారతం

ద్వాపరయుగాంతం వరకు ప్రపంచమంతా సనాతనధర్మమే వర్ధిల్లింది. వేదప్రచారం నిత్యం జరిగింది. ఎక్కడ చూసిన వేదం గురించి చర్చలే, ప్రజలు కూడా వేదంలో ఉన్న విజ్ఞానం గురించే కాలక్షేపం చేసేవారు. అందరూ రోజు రెండుపుటలా నిత్యాగ్నిహోత్రం చేసేవారు. వైదికసంస్కృతి 3 పూవులు, 6 కాయలుగా వర్ధిల్లింది. కానీ విధినిర్ణయాన్ని ఎవరు తప్పించలేరు. ఇంతలోనే మహాభారత యుద్ధం మొదలైంది. సరిగ్గా ఇప్పటికి (2015 జనవరికి) 5152 సంవత్సరాల క్రితం ఉత్తరభారతదేశంలో కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కాలగతిలో కొన్నేళ్ళు అభివృద్ధి చెందితే, మరికొన్నేళ్ళు కష్టాలు పడవలసి వస్తుంది. జీవుల కర్మను అనుసరించి, వారి జన్మకు అనుగుణమైన పరిస్థితులు ఏర్పడవలసి వస్తుంది.


ప్రపంచమంతా వ్యాపించిన సనాతన ధర్మానికి మహాభారత యుద్ధంతో కష్టాలు మొదలయ్యాయి. మహాభారతం కావ్యం కాదు, పురాణం కాదు, మహాభారతం ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలాగే జరిగిందని అర్దం. మహాభారతం విశేషాలను సంస్కృతంలో వ్యాసమహర్షి చెప్పగా, గణపతి రచించాడు. మహాభారత యుద్ధం క్రీ.పూ. 3139 లో జరిగింది. యుద్ధం గెలిచాకా, పాండవులు హస్తినాపురాన్ని (నేటి ఢిల్లీ) రాజధానిగా చేసుకుని 36 ఏళ్ళ 8 నెలలు పాలించారు. క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17,18 నాటికి ద్వాపరయుగం అంతమై కలియుగం మొదలైంది. వీటిని జ్యోతిష్య శాస్త్రమూ, ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట, అతన ఆర్యభట్టీయం అనే గ్రంధంలో పొందుపరిచారు.

ఏదో పుస్తకంలో ఉన్నది మెము ఎట్లా అంగీకరించాలి అనవచ్చు. దానికి తగిన శాసనాలు ఉన్నాయి, అవే సంవత్సరాలని చెప్పటానికి అన్నిటికంటే ముఖ్యమైన ఖగోళ, అంతరిక్షానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వ్యాసమహర్షి ప్రజ్ఞ గురించి వర్ణించటం అసాధ్యం. కాలక్రమంలో పుస్తకాలు చినిగిపోతాయి, శాసనాలు కొంత రూపు పోవచ్చు, లేకపోతే విజ్ఞానశాస్త్ర గ్రంధాలు చౌర్యానికి గురై ప్రజలకు అందుబాటులో లేకుండా పోవచ్చు.

కానీ ఈ జగత్తులు ఎవరు మార్చలేనిది, ఎప్పటికి సాక్ష్యంగా నిలిచేవి అంతరిక్షంలో గ్రహాల కదలికలు, గ్రహస్థితులు (planetary positions). గ్రహాల మధ్య దూరం, కోణము, ఆ సమయంలో వాటి స్థానం, ఇవన్నీ తరుచుగా ఏర్పడే అంశాలు కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పడే ఈ ఖగోళ శాస్త్ర అద్భుతాలను వ్యాసమహర్షి గుర్తించి, సేకరించి, మహాభారతంలో పొందుపరిచారు, అనగా record చేశారు..

ఈ ఖగోళ అంశాలను ఈ రోజు ఆధునిక సాఫ్ట్వేర్ల ద్వారా astronomical dating ద్వారా పరీశీలించినప్పుడు పైన చెప్పుకున్న సంవత్సరాలే వస్తున్నాయి. వాటికి శాసనమైన ఆధారలు ఎన్ని ఉన్నాయో, ఖగోళ, జ్యోతిష్యశాస్త్ర ఆధారాలు అన్నే ఉన్నాయి. Astronomical dating అంటే ఇప్పుడున్న గ్రహస్థితుల నుంచి వెనక్కు లెక్కించుకుంటూ వెళ్ళడం...!!
Read More

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి

ముందుగా కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .


శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము ( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.

అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను.

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.

తతః శత పదాని గత్వా - వంద అడుగులు వేయవలెను. తరువాత

అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.

అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.
Read More

ప్రత్యేకించి మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం.

ప్రత్యేకించి మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం. శుక్రవారం లక్ష్మీప్రదం అని చెప్పి మనవాళ్ళు శుక్రవారం కూడా వద్దు అని అన్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారములు క్షౌరానికి ప్రశస్తం. శని ఆది వారాలు మధ్యం. మంగళవారం నాడు నింద్యము. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే (ఆధునిక భాషలో చెప్పాలంటే cutting) గోళ్ళు తీసుకోవాలి. గోళ్ళు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. కణ విభజన (Metabolism) నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని గోళ్లుగా పెరుగుతాయి. కనుక వీటిని తొలగించడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెప్పబడిన తిథులలో, వారాలలో సమయాలలో మాత్రమే తొలగించాలి. స్నానానికి పూర్వమే తొలగించాలి. గోళ్ళతో యే వస్తువును త్రుంచకూడదు. ఇంటిలోకాకుండా ఇంటిబయట తొలగించుకోవాలి. అసలు జీర్ణం కాని పదార్థం ఏదైనా ఉందా అంటే వెంట్రుక. అలాగే గోళ్ళు కూడా. కనుక గోళ్ళు ఇంట్లో తీయడం దరిద్రం అని ఎందుకు అన్నారంటే దానిని తొక్కినా, అన్నంలో కలిసినా సమస్యలొస్తాయి. మానవుడు ఆచరించే పాపాలు అధికం జుత్తును, గోళ్లను ఆశ్రయించి ఉంటాయి. కనుక వీటిని తొలగించడానికి ఇంత నేర్పరితనం కావాలి. గోళ్ళను పెంచుకోకూడదు. దీనికి ఒక కథ ఉంది వేదంలో. పాపాలన్నీ సూర్యుడి దగ్గరికి పోయాయి. మీరు నాదగ్గర ఉండకూడదు తిరిగిపోండి అన్నాడాయన. ఎక్కడికి పోవాలి? అని ఆ పాపాలు సూర్యుడిని అడిగితే గోళ్ళను ఆశ్రయించండి అన్నాడట. దీనిని ఆధారంగా గోళ్ళు పెంచుకోకూడదు అని నియమం పెట్టారు.
Read More

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే,అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?జంబుద్వీపే భరతవర్షే భరతఖండే,అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:


1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.
Read More

హిందూ సంప్రదాయాన్ని అనుసరించి పెళ్ళయిన స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం.హిందూ సంప్రదాయాన్ని అనుసరించి పెళ్ళయిన స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో ''మెట్టెలు''గా ఉన్న ఈ పదం నిజానికి ''మట్టెలు''. మనలో చాలామందికి అసలు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి అనే సందేహం కలగడం సహజం. ఆధునిక యువతులు ''మెట్టెలు ఎందుకు ధరించాలి.. చూడగానే పెళ్ళి అయింది అని తెలియడానికే తప్ప అవి కాలివేళ్ళకు పెట్టుకోవడం వల్ల మరేమీ ప్రయోజనం లేదు కదా?!” అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహిత స్త్రీలు మెట్టెలు ధరించడం వెనుక ఏమైనా ప్రయోజనం ఉందో లేదో తెలుసుకుందాం.

సంప్రదాయ పెళ్ళిళ్ళలో ''స్థాలీపాకం'' పేరుతో ఒక ఆచారాన్ని పాటిస్తారు. ఆ సమయంలో పెళ్ళికూతురి కాలివేళ్ళకు మెట్టెలు తొడుగుతారు. ఈ ఆచారం వెనుక కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే...


* మెట్టెలు ధరించడం శుభసూచకం, మంగళకరం.

* గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్ళకు సంబంధం ఉంటుంది. వేళ్ళకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెలవల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు.

* సంతానలేమి సమస్య ఉన్న పురుషులకు కాలి వేలికి రాగితీగను గట్టిగా చుడతారు. ఇలా వత్తిడి కలిగించడంవల్ల ఆ సమస్యలు నివారణ అవుతాయి.

* పురుషుల కంటే స్త్రీలలో కామం ఎక్కువట. ఈ విషయాన్ని ఆధునిక సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. పూర్వకాలంలోనే ఈ వాస్తవాన్ని కనిపెట్టిన మన మహర్షులు స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే కొంత కామం తగ్గుతుందని, పురుషునితో సమానంగా ఉంటుందని, అప్పుడు భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రావని ఈ మెట్టెల ఆచారాన్ని ప్రవేశపెట్టారు.

* మెట్టెల సాయంతో కాలివేళ్ళకు వత్తిడి తగిలించడంవల్ల కామ సంబంధమైన కోరికలు తగ్గుతాయి. సన్యాసులు పావుకోళ్లు ధరించడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే.

* మెట్టెలు పెట్టుకోవడంవల్ల కొన్నిరకాల చర్మవ్యాధులు రావు.

* చిన్నపిల్లలకు రాగి కడియాలు తొడగడం మనకు తెలిసిందే. అవి కలిగించే వత్తిడివల్ల అనేక అనారోగ్యాలు నయమౌతాయి.

* మెట్టెలు పెట్టుకోవడంవల్ల పాదానికి ఒక వింత శోభ వస్తుంది.

* మెట్టెలు వెండితో తయారైనవి. వెండి శరీరంమీద ఉంటే మంచిది.

* మెట్టెలు ధరించడంవల్ల ''ఈమెకు వివాహం అయింది'' అనే సంకేతం కనిపిస్తుంది కనుక పరపురుషుల వ్యామోహం నుండి మెట్టెలు ఒక రకంగా రక్షిస్తాయి.
Read More

ఉప పాండవులు ద్రౌపదికి పాండవుల వలిన కలిగిన సంతానం. వీరు మహాభారత యుద్ధం తరువాత ద్రోణకుమారుడు ఐన అశ్వత్థామచే సంహరించబడ్డారు. వీరి పేర్లుఉప పాండవులు ద్రౌపదికి పాండవుల వలిన కలిగిన సంతానం. వీరు మహాభారత యుద్ధం తరువాత ద్రోణకుమారుడు ఐన అశ్వత్థామచే సంహరించబడ్డారు. వీరి పేర్లు

ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)
శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)
శ్రుతకర్ముడు - (అర్జునుని పుత్రుడు)
శతానీకుడు - (నకులుని పుత్రుడు)
శ్రుతసేనుడు - (సహదేవుని పుత్రుడు)


త్రేతాయుగపు కాలంనాటి హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్షను పరీక్షించాలని విశ్వామిత్రుడు అతనిరాజ్యము, భార్య, పిల్లలు కట్టు బట్టలతో సహా వదిలి పొమ్మని ఆదేశిస్తాడు... ఈక్రమంలో రాణిపై చేయికూడా చేసుకుంటాడు... ఆ సమయంలో పరమ వీరులయిన అయిదుగురు సైనికులు/రక్షకభటులువిశ్వామిత్రుని చర్యకు మండిపడి అతనిచర్యలను ఖండిస్తారు... దీనికి ఆగ్రహం చెందినవిశ్వామిత్రుడు మీకు ఈ జన్మలో మోక్షం రాకపోవుకాక అని శపిస్తాడు... ... భీతిల్లిన ఆ రక్షకభటులుమునివర్యుని శాంతింపజేసి శాపానికి విరుగుడు ప్రసాదించమని వేడుకుంటారు.. శాంతించినవిశ్వామిత్రుడు మీరు వచ్చేజన్మలో ఏ బంధాలు ఏర్పడక ముందే చనిపోవుదురు, తర్వాతి జన్మలోపాండవుల పుత్రులుగా జన్మించి ఏ తప్పు చేయనప్పటికీ అశ్వథ్థామ చేతిలో నిద్రించే సమయంలోమరణించి మోక్షం పొందుతారు అని అభయమిస్తాడు... (వారిని చంపిన అశ్వథ్థామ రహస్యం తల్లిఅయిన ఉత్తర గర్భంలో ఉన్న పరిక్షిత్తుకు (అభిమన్యుని కుమారునికి) తెలుస్తుంది... ఈ విషయంతెలుసుకున్న అశ్వథ్థామ ఆ గర్భస్థ శిశువును హతమార్చాలని కూడా చూస్తాడట... కానీ శ్రీకృష్ణుడుకాపాడతాడని ఇంకొక కథ ఉంది) ఆ విధంగా పుట్టిన వారే ఉప పాండవులు....

కురుక్షేత్ర సంగ్రామంలో ఉపపాండవుల శౌర్యాన్ని గూర్చి పెక్కు ప్రస్తావనలు ఉన్నాయి. ఆరవనాటి యుద్ధంలో కౌరువులు భీమ దృష్టద్యుమ్నులపై ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు. అప్పుడు పాండవుల పుత్రులు ఐదుగురూ అసమానమైన పరాక్రమం చూపి కౌరవులను పరుగులు తీయించారు. ముఖ్యంగా నకులుని కొడుకు శతానీకుని ప్రతాపం అందరినీ మెప్పించింది. పదహారవరోజు యుద్ధంలో ప్రతివింధ్యుడు విజృంభించి తోమరంతో కౌరవ వీరుడైన చిత్రసేనుని చంపేశాడు. ప్రతివింధ్యుని ఎదిరించిన కౌరవసేన పలాయనం చిత్తగించింది.

సౌప్తిక పర్వం

ఉపపాండవుల మరణం సౌప్తిక పర్వంలో చెప్పబడింది. "అపాండవం" చేస్తానని దుర్యోధనునికి మాట యిచ్చిన అశ్వత్థామ ఈశ్వరదత్తమైన ఖడ్గంతో పాండవసేనపై రాత్రిపూట దాడిచేశాడు. ప్రతివింధ్యున్ని అడ్డంగా నరికేశాడు. శ్రుతసోముడి గొంతు కోసేశాడు. శ్రుతకర్ముడి తల నరికి మెండాన్ని కాలుతో తన్నాడు. శతానీకుని, శ్రుతసేనుని తల నరికేశాడు. ఇలా అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు కలిసి ధృష్టద్యుమ్నుడి శిబిరంలో సమస్త సేనను ఘోరంగా చంపేశారు.

విజయశ్రీని వరించామని సంతోషంగా ఉన్నపాండవులకు జరిగింది తెలియగానే వారు ఒక్కమారు మ్రాన్పడిపోయారు. అన్నదమ్ముల శవాలను, పుత్రుల శవాలను చూసి ద్రౌపది గొల్లుమంది. భీమార్జునులు అశ్వత్థామను పట్టుకొన్నారు. గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా అతని తలపైనున్న సహజ సిద్ధమైన మణిని తీసుకొని వదిలేశారు.
Read More

రాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు
Agajaatha - అగజాత : పార్వతీ దేవికి “శక్తి, అంబిక, అగజాత, దుర్వ, దేవి, దాక్షాయణి, భువనేశ్వరి, భవాని, భార్గవి, సతి, గిరికన్య, గిరిజ, గౌరి, కాత్యాయని, కాళి, మేనక, మాత …అని అనేక పేర్లు ఉన్నాయి.

AghuDu - అఘుడు : రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.

అగస్త్య మహర్షి,Agastya Muni : అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. ఈయన బ్రహ్మదేవుని మానస పుత్రుడు .అగస్త్య మహర్షి కాశీలో వుండేవాడు, దక్షిణాపథానికి ఎందుకొచ్చాడు? అంటే, పూర్వం మహానుభావులు ఏమి చేసినా ప్రజా శ్రేయస్సుకోసమే చేసేవారు. అలాగే అగస్త్యుడుకూడా ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపధానికి వచ్చాడు.భార్య పేరు లోపాముద్ర .

Agni - అగ్ని: వేదములలో పేర్కొన్న ఓక దేవతా మూర్తి . అతని భార్య స్వాహాదేవి.

Anasuya : అనసూయ - అసూయ లేనిది. అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.

Anjana - అంజన: కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.

Atri : అత్రి - బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు . సప్తర్షులలో ప్రథముడు. ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు.

Arjunudu : అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు. పాండవులలో మద్యముడు . కుంతి కి మంత్రశక్తివలన ఇంద్రునిచే జన్మించినవాడు . . పాండురాజు తనయుడు .ఇతనికి అనేక పేర్లు ముఖ్యము గా 10 పేర్లు :
అర్జునుడు ,
పార్దు ,
కిరీటి ,
పాల్గుణ,
శ్వేతవాహనుడు ,
భీభత్సుడు ,
ధనంజయుడు ,
విజయుడు ,
నవ్య్ సాచి ,
జిష్ణుడు .

AbhimanyuDu : అభిమన్యుడు -- అర్జునుడు - సుభద్రల కుమారుడు . కురుక్షేత్ర సంగ్రామములో పద్మవ్యూహం లోపలకు వెళ్ళి బయటకు రావడం తెలియక మరణించాడు . అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు..... యధిష్టురుని తరువాత హస్తినాపురానికి (పరీక్షిత్తు) రాజు అయ్యాడు. పరీక్షిత్తు వలననే పాండవ వంశము వృద్ధి చెందినది.

AnaadrushyuDu : అనాదృష్యుడు -- గాంధారీ , ధృతరాష్ట్రుల కుమారుడు . నూరుగురు కౌరవులలో ఒకడు .

Aswaddhaama :అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఇతడు చిరంజీవి . ద్రోణుని కుమారుడు . పాండవ ద్వేషి .

AnjanEyuDu : ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు అని అర్ధము . హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి,మారుతి , వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

Ambika : అంబిక-- 1. హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Ambika : అంబిక--2. మహాభారతము లో సత్యవతి - శంతన మహారారు కుమారుడైన చిత్రాంగుని భార్య పేరు అంబిక . భర్త చనిపోయిన తరువాత ఈమె కు వ్యాసుని వలన గుడ్డివాడైన ధృతరాస్ట్రుడు జన్మిస్తాడు .

Ambaalika : అంబాలిక -- విచిత్రవీర్యుని ఇద్దరి భార్యలలో రెండెవది . విచిత్ర వీర్యుడు 8 సమ్వత్సరాలు కాపురము చేసి క్షయ (టి.బి.) వ్యాధి లో చనిపోయిన తరువాత అత్తగారైన సత్యవతి ప్రోద్బలముతో వ్యాసుని వలన పాండురాజును కన్నది .

Amma : అమ్మ--హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

AnirudduDu : అనిరుద్దుడు -- శ్రీకృష్ణుని మనుమడు . ప్రద్యుమ్నుని కుమారుడు . బాణాసురుడి కుమార్తె ' ఉష ' కు భర్త .

AkrUruDu - అక్రూరుడు : శ్రీకౄష్ణుని మేనమామ. అక్రూరుడు తండ్రి శ్వఫల్కుడు , కాశీరాజు కుమార్తెకు, శ్వఫల్కుడికి జన్మించిన వాడే అక్రూరుడు, సత్ప్రవర్తన, బ్రహ్మచర్య దీక్ష కలిగిన అక్రూరుడే శమంతక మణిని గ్రహించటానికి అర్హుడని కృష్ణుడు ఆమణిని అక్రూరుడికి ఇచ్చాడు. అలా ఆనాటినుండి అక్రూరుడు మనస్సులో ఎలాంటి భయాలు లేకుండా యజ్ఞాలను, శమంతక మణి ఇచ్చే బంగారం సహాయంతో చేస్తూ లోకకళ్యాణానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.

Akarkaarudu - అకర్కారుడు : కద్రువ కొడుకు. ఒక సర్పం.

Aparna : అపర్ణ --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Ayati : అయతి -- మేరువు కుమార్తె , ధాత భార్య . ఈమె కుమారుడు .. ప్రాణుడు .

AkshayapAtra : అక్షయపాత్ర -- అరణ్యవాసము చేస్తున్న ధర్మరాజు తనవెంట బ్రాహ్మణ భోజనార్ధం సూర్యుడుని ప్రార్ధించి ఒక పాత్ర సంపాదించారు . దానిలో కొద్దిగా వండినా అక్షయమవుతుంది (సరిపోయినంత) , దానితో ధర్మరాజు నిరంతరము అన్నదానాలు చేస్తుంటాడు .

Agnishauchamu , అగ్ని శౌచము : కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము .

Alakananda : అలకనంద -- దేవలోకం లోని గంగానది . పితృలోకాలో పయనించేటప్పుడు దీనిని ' వైతరణి ' అంటారు . మూడు లోకాల్లో పారే నది కాబట్టి గంగానదిని త్రిపథగ అంటారు.

స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనేవి ఆ మూడు లోకాలు.

* స్వర్గలోకంలో మందాకిని,

* భూలోకంలో గంగ మరియు అలకనంద

* పాతాళలోకంలో భోగవతి

అని గంగానదికి పేర్లు.

AtikaayuDu : అతికాయుడు - రావణుని కుమారుడు . పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహా తేశ్శాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు. వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్ళూ పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపులలాంటి శస్త్రాస్త్రాలతో యుద్ధం చేశారు. చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగనరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు.

Aanantha vijayam , అనంత విజయం : ధర్మరాజు శంఖము

Achala,అచల: కుమారస్వామి మాతౄగణములోని ఓక స్త్రీమూర్తి.

Ahalya ,అహల్య : అహల్య గౌతమ మహర్షి భార్య.ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి.
పుట్టుక-- బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.

BabruvAhanuDu-బభృవాహనుడు : బభృవాహనుడు అర్జునుడు మరియు మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.

Bali chakravarti:బలిచక్రవర్తి -- బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడు మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, వామనుడు(హరి) తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపుతాడు.

BarbareekuDu -బర్బరీకుడు : బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు.

Bhavani : భవాని --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Bharavi : భైరవి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Balaramudu : బలరాముడు -- బలముచే జనులను రమింపచేయువాడు., వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు. వీరి భార్య రేణుక .

Badrakaali : బద్రకాళి -- పార్వతి ( Parvati) మరో పేరు . హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, బద్రకాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Bruhaspati : బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్‌పతి).బృహస్పతి కి ఇంకో పేరు గురుడు. బృహస్పతి దేవతలకు గురువు. బృహస్పతి భార్య తార చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రుని తో రతి సరసాలు జరిపెను . అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు బుధుడు జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను.

Bharatudu : భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
1.భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు. సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదులకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు.
2. భరతుడు మహాభారతములో శకుంతల-దుష్యంతుల కుమారుడు . భరతుడు పరిపాలించిన దేశము గనుక భారతదేశము అని పేరు వచ్చినది .

Bhimudu : భీముడు - భయమును కలిగించువాడు . భీముడు పాండవ ద్వితీయుడు. మహాభారత ఇతిహాసములో వాయుదేవుడి అంశ. పాండురాజు సంతానం. కుంతికి వాయుదేవునికి కలిగిన సంతానం. ద్రౌపతి , హిడింబి ఇతని భార్యలు . హిడింబాసురుణ్ణి వధించి తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించినాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూర్గురినీ భీమసేనుడే వధించినాడు.

Bhishmudu : భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు. ఆ జన్మ భ్రహ్మచారి . మహాభారతంలో గంగాదేవీ శంతనమహారాజుకి జన్మించినాడు , భీష్ముడు పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.

BaaNaasuruDu : బాణాసురుడు -- వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని వంశపరంపర-> * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.
వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణ గా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి , మూర్ఖత్వానికి చింతించి నీ రధం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.

Daakini : డాకిని -- మంత్రాలను వల్లించడం ద్వారా అద్భుతాలు చేసే స్త్రీ . హిందూ పురాణాలలో చెప్పబడిన స్త్రీ .

Damayanthi : దమయంతి - 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).భీమమహారాజు కుమార్తె ,నిషధ రాజా నలునితో వైభవోపేతంగా వివాహం జరిగింది. కుమార్తె ఇంద్రసేన, కుమారుడు ఇంద్రసేనుడు .

Damodarudu : దామోదరుడు -- క్రిష్ణుడు చిన్నతనం లో తల్లి యశోద అతని నడుముకు పొట్టకు కట్టువేసి బండరాయికి కట్టివేసినది . బంధితమైన పొట్టగల వాడు కనుకనే ఆ నాటి నుంచి ఆయనకు దామోదరుడు అనే పేరొచ్చింది.

Dasarathudu : దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు. అయోధ్య రాజ్యానికి రఘు వంశపు రాజు . ముగ్గురు -(కౌషల్య , సుమిత్ర , కైకేయి ) భార్యలకు ... రాముడు , లక్ష్మణుడు , భరత ,శత్రుఘ్నులు (నలుగురు) కుమారులు .

Dattatreyudu : దత్తాత్రేయుడు -- శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.

Draupadi : ద్రౌపది -- పాంచాల రాజైన ద్రుపద మహారాజు కుమార్తె . మహాభారరము లో ప్రముఖ పాత్ర . అర్జునుడు మత్స్యయంత్రము కొట్టగా ఆమె పాండవులకు భార్య అయినది .

DrupaduDu : దృపదుడు -- పాంచాల రాజు . ద్రౌపది తండ్రి . ఈయన కుమారులు ... ద్రుష్టద్యుమ్నుడు , శిఖండి .

Dhanvantari : ధర్వంతరి -- క్షీరసాగర మధన సమయము లో జర్మించినది . ఆయుర్వేదానికి అధిష్టాన దేవత .

DharmarAju : ధర్మరాజు -- మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . యుధిష్టిరుడని మరొక పేరు . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి. జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు .

DharmavyAdhudu : ధర్మవ్యాధుడు --మిధిలా నగరము లో ఉండేవాడు . సమస్త ధర్మాలూ చక్కగా తెలిసినవాడు .

Dhrutaraastrudu :ధృతరాష్ట్రుడు -- కురువంశరాజు అయిన విచిత్రవీర్యుని కుమారుడు . అంధుడు . గాంధారి ఈయం భార్య . దుర్యోధనుడు .. .తదితర నూరు మంది కుమారులు , వీరినే కౌరవులు అంటారు .

Duryodhanudu : దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రధముడు, కౌరవాగ్రజుడు. గాంధారీ దృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారీ గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరవాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురతవలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది. ఈ విషయంవిన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరవాతనూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనడు జన్మించాడు. తరవాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక పేరు దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.

Dussala : దుస్సల --ధృతరాష్ట్రుడు , గాంధారి ల ఏకైక కుమార్తె . ధుర్యోధనాదుల సోదరి . ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు

Dusshaasanudu : దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు. దుశ్శాసనుడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు. దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభ లో ద్రౌపతి వస్త్రాపహరణం నకు పూనుకున్నాడు. కానీ శ్రీ క్రిష్ణుడి అభయ హస్తం తో ద్రౌపతి గౌరవం కాపాడబడింది.

Dushyanthudu : దుష్యంతుడు-- హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు మహారాజు . శకుంతల భర్త . భరతుని తండ్రి .

Daaxaayani : దాక్షాయణి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, బద్రకాళి , శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Durvaasudu : దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము), దుర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి , అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

Dronudu : ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు. భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. పరశురాముడు వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరవాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది. . అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి.

DakshinAyanamu : దక్షినాయనము : సూర్య్భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుండి మకరరాశిని చేరే వరకు మధ్యనున్న సమయమే దక్షిణాయనము . ఆ సమ్యములో సూర్యుడు భూమధ్యరే్ఖకు దక్షిణము గా సంచరిస్తాడు .

Dhvajastambham : ధ్వజస్తంభము -- సూర్యుని కాంతి కిరణములు నలభై ఐదు డిగ్రీల కోణము లో పరవర్తనము చెందుతాయి . ఆ దిశగా ధ్వజస్తంభాన్ని ప్రతిస్ఠారు . దక్షిణ వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలశము మీదుగా ధ్వజస్తంభము పైనుంచి స్వామి భూమధ్యకి చేరుతాయి అందుకే ధ్వజస్తంభమునకు , స్వామికి మధ్యన నిల్చుని నమస్కరించాలి . అప్పుడే గ్రహశక్తితో పాటు స్వామి శక్తీ మనల్ని చేరుతుంది .

EkalavyuDu : ఏకలవ్యుడు -- మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఏకలవ్యుడు ఎక్కడ తనను మించిపోతాడనే భయంతో అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని ఆశ్రయించి ఏదైనా చర్య తీసుకోమని కోరాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్ళి అతని కుడి చేతి బొటనవేలును గురుదక్షిణ గా ఇమ్మని అడుగుతాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.

Ethasham : ఏతశం --సూర్యుని రధం గుర్రాలలో ఒకటి

Gouri : గౌరి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Gyaanaprasunaamba : జ్ఞానప్రసూనాంబ - పరాశక్తి అవతారము . శ్రీకాళహస్తీశ్వరుని భార్య .

Ganga : గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు . గంగ అనగా తెలుగు భాషలో నీరు అని కూడా అర్ధం. పరమేశ్వరుని భార్యలలో ఒకరు .

Garutmanthudu : గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు . గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు

GaanDivam , గాంఢీవం : అర్జునుడి ధనుస్సు . దీనిని అగ్నిదేవుడు ఖాండవ వనం దహనమప్పుడు అర్జునుడికి ఇస్తాడు .

హరిశ్చంద్రుడు(Harischandrudu): హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు.
తండ్రిపేరు =సత్యవ్రతుడు , ఈ సత్యవ్రతునికే ' త్రిశంకుడనే ప్రసిద్ధ నామము ఉంది.
తల్లిపేరు --సత్యరధ ,
భార్య పేరు -- చంద్రమతి ,
కొడుకు పేరు -- లోహితాస్యుడు .

Indrajittu : ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము). ఇంద్రజిత్తు -- రావణాసురిడికి మండోదరి కి జన్మించిన పెద్ద కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్ధం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాధుడు అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా పరమేష్ఠి(బ్రహ్మ) అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన లక్ష్మణుడు యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు. ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన (ప్రమీల)నాగకన్య ను వివాహమాడినాడు
IndruDu ; ఇంద్రుడు , దేవేంద్రుడు -- హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, మరియు స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. విష్ణుమూర్తికి భూదేవికి పుట్టిన కవల పిల్లలలో ఒకడు (ఇంద్రుడు , అగ్ని ). అష్టదిక్పాలకులలో తూర్పు దిక్కునకు అధిపతి. ఇతని వాహనం 'ఐరావతం' అనే తెల్లని ఏనుగు. ఇతని భార్య శచీదేవి. వీరి కూతురు జయంతి మరియు కొడుకు జయంతుడు. ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.

Indramaala : ఇంద్రమాల -- ఒక కమల మాలిక . ఎన్నడూ వాడనిది . ఈ మాల ధరించిన వారిని ఏ అస్రమూ ఎమీ చేయలేదు .

Jatayuvu : జటాయువు -- రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. దశరథుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.

Jamadagni : జమదగ్ని -- భృగు వంశానికి చెందిన మహర్షి. పరశురాముడు కి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. రేణుక ఈయన భార్య .

Janamejayudu : జనమేజయుడు -- మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు. అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. . తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తు ను చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు.

Jaya Vijayulu : జయ విజయులు -- శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు.

Jaraasandhudu : జరాసంధుడు -- పరమ శివ భక్తుడు మరియు రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం లో వచ్చే పాత్ర. బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. సంతానము కోసము రాజు కోరిక మేరకు ఋషి చందకౌశిక మహర్షి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రి లొనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుండి. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజుకి తీసుకొని వెళ్ళి జరిగిన వృంత్తాంతాన్ని చెబుతుంది.

Jaambavanthudu : జాంబవంతుడు -- బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.

Kamadhenuvu-- కామధేనువు : కోరిన కోరికలు తీర్చే దివ్య శక్తులు గల గోవు

Kumaara swaami :కుమార స్వామి - శివ పార్వతుల ఇద్దరి కుమారులలో చిన్నవాడు కుమారస్వామి. ఇతనికి ఇద్దరు బార్యలు -- శ్రీవల్లి , దేవసేన .

Katyaayini : కాత్యాయిని --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Kali : కాళి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

కాళిదాసు,Kalidasu : ఒక గొప్ప సంస్కృత కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్షం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.

Karnudu : కర్ణుడు -- పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు. మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతి కి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించినాడు.

kaushikudu : కౌశికుడు - ధర్మ వ్యాధునివల్ల ధర్మ విశేషాలు తెలుసుకున్నవాడు . విశ్వామిత్రునికి మరో పేరు .

Kauravulu : కౌరవులు -- కురువంశరాజులు . మహాభారతం లో దుర్యోధనాదులు వందమంది . కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. కానీ మహాభారతములో ప్రధానముగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు యుయుత్సుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.

Kedaareswarudu : కేదారేశ్వరుడు - శివునికి మరో పేరు . కేదారేశ్వర ఆలయము హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో ఉన్నది , మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.

Kaikeyi : కైకేయి --అశ్వపతి కూతురు . దశరధమహారాజు ముడో భార్య . భరతుని తల్లి .

Kuberudu : కుబేరుడు -- హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.

Kumbhakarna : కుంభకర్ణుడు -- రామాయణం కావ్యంలో రావణుని తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు కైకసికి అసురసంధ్యవేళలొ సంభోగం వల్ల జన్మించిన సంతానం. ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు"

Kucheludu : కుచేలుడు--చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము). శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందము లో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు ,కుచేలుడు ..సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు

KamsuDu : కంసుడు -- ఉగ్రసేనుని కుమారుడు , శ్రీకృష్ణుని మేనమామ . మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భం లో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసాలలో పెడతాడు

KabanduDu : కబంధుడు -- రామాయణములో రాముని చేత సంహరింపబడిన దండకారణ్యము లో ఉన్న ఓ వికృతరూపము గల రాక్షసుడు. ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల మరియు మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు మరియు వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి. ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను.

Kalpavrukshamu : కల్పవృక్షము -- కోరిన కోరికలు ఇచ్చే చెట్టు. ఇది దేవతలు దానవులు కలిపిచేసిన క్షీర సాగర మథనం సమయంలో పుట్టింది. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు. బహుళ ప్రయోజనాలున్న తాటి, కొబ్బరి మొదలైన కొన్ని చెట్లను కల్పవృక్షాలుగా పేర్కొంటారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన పద్య కావ్యము రామాయణ కల్పవృక్షం అంటారు ..

kashyapuDu : కశ్యపుడు -- ప్రజాపతులలో ముఖ్యుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు కొడుకు(మనమడు). ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు. ఇతనికి బ్రహ్మ, విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

Khandavam , ఖాండవం (వనము) : ఇంద్రుని వనము . అగ్నిదేవుడు ప్రార్ధించగా కృష్ణార్జునులు దానిని అతనికి ఆహారము గా ఇచ్చారు .

కృపి ,Krupi : మహాభారతంలోని పాత్ర. ఈమె కృపాచార్యుని సోదరి మరియు ద్రోణుని భార్య..

జననం-- శరధ్వంతుడు ఒక రాజు. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి రేతః పతనమై ఆ వీర్యము రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు.

కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు మరియు కృపి అని నామకరణము చేయించాడు. కృపుడు విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు. కృపిని ద్రోణాచార్యుడు పరిణయం చేసుకున్నాడు. వీరికి కలిగిన పుత్రుడే అశ్వత్థామ.

కురువంశము, Kuru Dynasty : భరతుడి తరువాత వంశం--భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు.

Lalitha : లలిత--హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Lankhini : లంఖిణి -- లంకను కాపలాకాసిన రాక్షసి . హనుమంతుడు లంఖిని ని హతమార్చి లంకలో ప్రవేసిస్తాడు . లంకాదహనము కావిస్తాడు .

Lavakusulu : లవకుశులు -- సీతా రాముల కవల పిల్లలు .

ManDodari : మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని). మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.

ManmadhuDu : మన్మధుడు - మన్మధుడు అంటే మనస్సు కలత పెట్టువాడు , మనసుని మధించేవాడని పురాణాలు వర్ణించాయి.మన్మధుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును. ఈయనకు మనసిజుడు అని , అనంగుడని , పుష్పధన్యుడు అని పేర్లు ఉన్నాయి . మంచి రూపం కలిగిన వాడు. విష్ణువు కు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య. .

Mahishasura : మహిషాసురుడు -- హిందూ పురాణాలలో రాక్షసుడు
1. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (గేదె) తో కలిసి రతిలో పాల్గొన్న మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి మహిషాసురుడు కి జన్మనిస్తుంది. దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది.

Mahishaasura mardhini : మహిషాసుర మర్ధిని -- మహిషాసురుడనే రాక్షసుడిని చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చినది .

MaareechuDu : మారీచుడు : రాక్షసి తాటక కి కుమారుడు . సీతాపహరణ సమయం లో రావణుడు ఇతన్ని బంగారు జింక గా మారమని అదేశిస్తాడు ... తరువాత రాముని చే హతమార్చబడినాడు . ఇతని సోదరి కైకసి , సోదరుడు సుబాహుడు .

Menaka : మేనక -- మేనక ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. విశ్వామితుడి తపోభంగానికి ఇంద్రుడు నియమించిన అప్సరస . వీరిరువురి కలయిక వలన శకుంతల జన్మించింది .

Mohini : మోహిని -- మోహిని అంటే సాధారణంగా నారాయణుని మోహినీ అవతారము . దేవదానవులు అమృతాన్ని సాధించినతరువాత నాకంటే, నాకు అని పోరాటంచేస్తుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అందరినీ మోహించి, అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలకు మాత్రం ఇచ్చి రాక్షసులను మోసం చేస్తాడు. రాహుకేతువులు దేవతల వరుసలో కూర్చుంటే, వారిని తన చక్రాయుధంతో వధిస్తాడు.

ఇదే మోహినీ అవతారంలో విష్ణుమూర్తి శివుడిని కూడా మోహింపచేస్తాడు.

నకులుడు : పాండవుల్లో నాల్గోవాడు .

Naaradudu : 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు. నారదుడు - లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కధలు బహుళంగా వస్తాయి.

Parvati : పార్వతి -- హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Prahlaadudu : ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు . ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు. ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగినది. వీరికి వాతాపి, ఇల్వలుడు అనే కుమారులు కలరు.

Parasuraamudu : పరశురాముడు-- శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము (Parasurama Incarnation) ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

Paraasharudu : పరాశరుడు -- వసిష్టుని మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రకు పోవుచు యమునా నదిలో పడవ నడుపుచున్న మత్స్యగంధిని చూచి మోహించెను. ఆమె కన్యాత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోవునట్లు వరం ప్రసాదించి, యమునా నదీ ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించెను. వీరికి వ్యాసుడు జన్మించెను.

Parikṣit : పరీక్షిత్తు -- అంటే అంతటా దర్శించగలవాడని అర్దము . అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము యోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు.

Puthana : పూతన --- ఒక రాక్షసి . బాలకృష్ణుని చే వధించబడుతుంది .

Pradyumnudu : ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము). ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడి కి రుక్మిణి కి జన్మించన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతం లొ వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు . మాయవతి (రతి దేవి) ఈయన భార్య .

PanchavaTi , పంచవటి : రాముడు వనవాస సమయం లో దండకారణ్యములోని ఆశ్రమము పేరు .

Raama : రాముడు -- హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు . అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచున్నారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్ఠములు ఎదురెనను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు. రాముడి తండ్రి -ధశరధుడు ,తల్లి -కౌసల్య , పినతల్లులు- సుమిత్ర ,కైకేయి , సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు , భార్య -సీతాదేవి .పిల్లలు -లవ కుశలు .

Raavana : రావణాసురుడు -- కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు అని అర్ధము . రావణుడు (Ravana) రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంక కు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పదితలలతో చిత్రిస్తారు. పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశ కంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. రావణుని భార్య ' మండోదరి ' .
రావణాసురుడి కి ఆరుగురు సోదరులు ,ఇద్దరు సోదరీమణులు, ఏడుగురు కొడుకులు . సోదరులు = 1. కుబేరుడు 2. కుంభకర్ణుడు 3. విభీషణుడు 4. ఖరుడు 5. దూషణుడు 6. అహిరావణుడు , సోదరీమణులు = 1. శూర్పణఖ(చంద్రనఖు)2.కుంభిని . కుమారులు = 1. ఇంద్రజిత్తు , 2. ప్రహస్థుడు,3. అతికాయుడు,4. అక్షయకుమారుడు,5. దేవాంతకుడు,6. నరాంతకుడు, 7. త్రిశిరుడు.

Rambha : రంభ -- ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. రూప రేఖాలావణ్యాలు గల నర్తకి . దేవలోకానికి అధిపతియైన ఇంద్రుడు భూలోకములో ఋఉషుల తపస్సు లను భగ్ననము చేయుటకు పంపే అప్సరసలలో రంభ ఒకతె . రంభ , కుబేరుని కొడుకు అయిన 'నలకుబేరుని' భార్య ..

Radha : రాధ లేదా రాధిక -- శ్రీకృష్ణుని ప్రియురాలు , నందుని చెల్లెలు . కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వున్నారు..

Rathidevi : రతీదేవి --దక్ష ప్రజాపతి కూతురు . మన్మధుని భార్య , మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సర్వావయవ సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది? అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి. మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు.

Renuks : రేణుక --రేణుక భృగు వంశానికి చెందిన మహర్షి జమదగ్ని భార్య,. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు.

Revathi : రేవతి -- ఒక నక్షత్రము . దక్షప్రజాపతి కూతురు . చంద్రుని భార్య , భార్యలందరిలో రేవతి అంటే చంద్రునికి మిక్కిలి ప్రేమ .

Rukmini : రుక్మిణి - రుక్మము(బంగారము) కలది. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యల లొ పెద్ద భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు. రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందము లొ వస్తుంది. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజు కి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉన్నది. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు .

RushyamUkamu : ఋష్యమూకము -- అన్న వాలి చే తరుమబడి సుగ్రీవుడు తలదాచుకున్న కొండ . తన తల వేయి ముక్కలవును అనే ముని శాపము తో వాలి ఈ కొండ దరిదాపులకు రాడు .

Shakti : శక్తి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Sambudu : సాంబుడు -- జాంబవతి , శ్రీక్రిష్ణులకు జన్మించిన కుమారుడు .

Satyabhama - సత్యభామ : శ్రీకృష్ణుని భార్య సత్యభామ , ఈమె తండ్రి సత్రాజిత్తు (సత్రాజిత్తు ను శతధన్వుడు అనేవాడు సంహరించి శమంతక మణిని చేజిక్కించుకున్నాడు. శమంతక మణిని అపహరించుకుపోవటమేకాకా తన మామ అయిన సత్రాజిత్తును సంహరించిన శతధన్వుడిని శ్రీకృష్ణుడు హతమార్చెను .

Syaama : శ్యామ --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Shakuntala : శకుంతల -- మేనక, విశ్వామిత్రుల సంతానము. దుష్యంతుని భార్య మరియు భరతుని తల్లి. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనక ను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడైన విశ్వామిత్రుడు తపస్సు నుండి రతిక్రీడ లోకి మారతాడు. రతిక్రీడ ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు బయటి వాతావరణం చూసి శిశిర ఋతువు అవడం గ్రహించి తపోభంగం జరిగిందని గ్రహించి, మేనకను అక్కడ నుండి పంపివేస్తాడు. మేనక ఆడబిడ్డను ప్రసవించి, ఇసుక దిబ్బ మీద విడిచి, వెళ్ళిపోతుంది. అలా విడిచిన బిడ్డను పక్షులు తమ రెక్కలతో రక్షిస్తాయి. ఆ మార్గములో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కల చేత రక్షింపబడడం వల్ల శకుంతల అని పేరు పెట్టి, తన ఆశ్రమంలో పెంచి పెద్దచేస్తాడు.

Shantanudu : శంతనుడు -- శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు. అని అర్దము . శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు మరియు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ట పుత్రుడు

Shasti Devi : షస్టీదేవి -- మూల ప్రకృతిలోని అరోభాగం నుంచి జన్మించిన దేవత .

Shivagamga : శివగంగ -- బ్రహ్మ మానస పుత్రుడైన అంగీరసుడి భార్య .

Shurabhi : సురభి -- దేవతల గోవు

శకుని -Shakuni : గాంధార రాజైన సుబలుని కుమారుడు . సుబలుడు తన కుమార్తెలైన గాంధారి , సత్యసేన , సత్యవ్రత మొదలైన వాళ్ళను ధృతరాష్ట్రునకు ఇచ్చి వివాహము చేసాడు . శకుని మహాభారతంలో గాంధారి కి తమ్ముడు. దుర్యోధనుని మేనమామ. ఇతనికి ఇద్దరు సోదరులు వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు ఉలూకుడు.

శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు.

దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ఇతడే ధర్మరాజుని మాయా జూదంలో ఓడించినది. వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని బోధించినది కూడా ఇతడే. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతన్ని నకుల సహదేవులు సంహరించిరి.

Tapati : తపతి -- సూర్యుని కుమార్తె . -- సంజ్ఞ రూపంలో చాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వరుడు, తపతి కలిగారు. తపతి అందాల బొమ్మ, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది. సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన వరుడికోసం అన్వేషిస్తున్నాడు. చంద్రవంశ రాజు ఋక్షుని కుమారుడు సంవరణుడు తో ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది. ఆ దంపతులకు కురు వంశానికి మూలపురుషుడైన 'కురువు' జన్మించాడు. వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహించి ప్రజల పాపాలు పోగొట్టమని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట. తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహిస్తోంది.

Taara : తార -- తారుని కుమార్తె . వాలి భార్య . అంగదుని తల్లి . వాలి మరణించిన అనంతరము తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. కాని అది వీలుపడదని కర్మా-ధర్మాలను అనుభవించవసిందేనని తాను నిమిత్తమాత్రుడునని హితవు పలికెను . వాలి సోదరుడు ' సుగ్రీవుడు ' ఈమెను వివాహమాడెను .

Taataki : తాటకి -- లేదా తాటక రామాయణ ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు పిల్లల కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన మరియు అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె రాక్షస రాజైన సుమాలి ని పెళ్ళిచేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, మారీచుడు మరియు కైకసి. వీరిలో కైకసి విశ్రావసుని వలన రావణుడు, విభీషణుడు మరియు కుంభకర్ణుల్ని పుత్రులుగాను, శూర్పణఖ అనే పుత్రికను పొందుతుంది.

Tumburudu : తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు. గందర్వుడు , విష్ణు భక్తుడు మరియు దేవగాయకుడు . నారదుని తో పోటాపోటి గా నిలిచి నారద-తుంబురులు గా ప్రసిద్ధిగాంచిరి .

Trishankudu : త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు శంకువులు(పాపాలు) చేసినవాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన సత్యవంతుడు అనే మహారాజు, కులగురువులైన వశిష్ఠుడి తో వైరం నొంది వశిస్టుని కుమారులచే శపించబడి చండాలరూపాన్ని పొంది , విశ్వామిత్రుని ఆశ్రయించి త్రిశంకుస్వర్గము ( విశ్వామిత్రుని చే సృస్టించబడినది )నకు రాజైయ్యాడు .

Urvashi : ఊర్వశి - ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది. ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పూర్వం విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి రంభ ను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీ ని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది.

Uttara : ఉత్తర -- విరాటరాజు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. అర్జునుడు తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము ఉత్తరకు నేర్పించాడు. తరువాత అర్జునుడు ఉత్తరను తన కుమారుడు అభిమన్యునితో వివాహము చేసాడు. అభిమన్యుడు పిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అభిమన్యుడు మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు పరీక్షిత్తు. యధిష్టురుని తరువాత హస్తినాపురానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు.

UttaruDu : ఉత్తరుడు -- విరాట రాజ్యానికి రాజైన విరాటరాజు కు ఇతని భార్య సుధేష్ణ కు పుట్టిన కుమారుడు . ఉత్తర ఈయన సహోదరి .

Urmila : ఊర్మిళ -- రామాయణంలో దశరథుని కోడలు మరియు లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు.

Uma : ఉమ - పార్వతి ( Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Usha : ఉష -- వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని కూతురే ఉష . శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు ఈమె భర్త. వీరి కుమారుడు వజ్రుడు. బాణాసురుని వంశపరంపర-> * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.

ushana : ఉశన -- భృగువు భార్య , శుకృడి తల్లి .
Uluchi : ఉలూచి -- నాగకన్య . వాసుకి కుమార్తె . అర్జునుడు ఈమె ద్వారా ' ఇలావంతుడు ' ని జన్మనిస్తాడు .

Vigneswarudu : విఘ్నేశ్వరుడు - శివ పార్వతుల ఇద్దరి కుమారులలో పెద్దవాడు విఘ్నేశ్వరుడు , గణేషు , గనపతి అని అనేక పేర్లు ఉన్నాయి. ఇతనికి ఇద్దరు భార్యలు సిద్ధి , బుద్ధి .

vaalmiki : వాల్మీకి - నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ, తండ్రి ముని ప్రచితాస(Prachetasa sage) .అతి చిన్నవయసులో అడవిలో తప్పిపోయి రత్నాకరుడు గా ఒక బోయవాని దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి.

Vedi : వేది -- బ్రహ్మ దేవుని భార్య ;

VyaasuDu : వ్యాసుడు - వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు. హైందవ
సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు ఉపవేదాలు , 555 బ్రహ్మసూక్తులు , 108 ఉపనిషత్తులు , మహాభారతం, మహాభాగవత తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. ఈయన తండ్రి ' పరాశరుడు ', తల్లి ' సత్యవతి ' . వశిష్టవంశము వాడు .

Vidhura : విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం(pale) వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబిక కి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.

Vibhishana : విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు అని అర్దము . రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణ, కుంభకర్ణు లు విభీషణుడి అన్నలు. ఇతని భార్య పేరు ' సరమ ' . రావణ సంహారము తర్వాత లంక కు రాజు అయ్యాడు .

Viswarupudu : విశ్వ రూపుడు -- విశ్వకర్మ కుమారుడు , సూర్యుని
కుమార్తె ' విష్టి ' ఇతని భార్య .

విశ్వామిత్రుడు ,Viswamitra : హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:

గాయత్రీ మంత్ర సృష్టి కర్త
శ్రీరామున కు గురువు.
హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.
త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు
శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.

Yama : యముడు , యమధర్మరాజు - యమము (లయ)నుపొందించువాడు. యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు . యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము). యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. * భార్య పేరు ' శ్యామల * సోదరులు : వైవస్వతుడు, శని * సోదరీమణులు: యమున, తపతి

Yashoda : యశోద -- యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతము లో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు , సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ' ఏకనంగా ' అనే సొంత కూతురు ఉందటారు .

YaagyavalkuDu :యాజ్ఞవల్కుడు -- ప్రాత:స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము,జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్దికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి ,శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాదించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపధముచేసి , కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్కుని రెండవ భార్య అయినది. మహాజ్ఞాని,తపోనిధి, అయిన యాజ్ఞవల్కునికి మాఘ శుద్ద పౌర్ణమినాడు యోగీంద్ర పట్టాభిషేకము చేసారు. ఆయన ఋషులకు తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని,యోగయాజ్ఞవల్కమని ప్రసిద్ధికెక్కాయి. కర్మజ్ఞానము వలన మోక్షము కలుగుతుందని తెలియజేసిన ప్రా:స్మరణీయుడు యాజ్ఞవల్కుడు .ఆయన జయంతి రోజు నాడు ఆయన్ని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.

YudhisturuDu :యుధిష్టిరుడు -- ధర్మరాజు కు యుధిష్టిరుడని మరొక పేరు , మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి. జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు .
Read More

Powered By Blogger | Template Created By Lord HTML