గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 9 March 2015

|| ఓ పవనాత్మజ |||| ఓ పవనాత్మజ ||
బ్రహ్మజ్ఞానము గల ఓ ఆంజనేయా నీ బుద్ధివలంతో ఒప్పారుచున్నావు కదా
వాయుసుతుడైన ఓ హనుమంతుడా నీ పరాక్రమాన్ని ఎలా కొనియాడేది
నీ సాహసమెంత గొప్పదయ్యా. సూర్యునికే గ్రహణ కారకుడవయ్యావు
(బాల ఆంజనేయుడు సూర్యుని తినే ప్రయత్నంలో గ్రహణకాలం ఏర్పడినది).
తిరుగులేని దనుజాంతకుడవు
రావణుణ్ణి ముప్పతిప్పలు పెట్టిన ఓ ఆంజనేయా
కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుని పాదసేవకుడవైనాడవయ్యా
పవనాత్మజ = పవన + ఆత్మజ = వాయుసుతుడు;... బాపు = భళీ, బాపురే;
ఉదయాచలము = తూర్పుకొండ


రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML