గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 1 March 2015

ఇది ధ్యాన శ్లోకంకంచన కాంచీతిలకం

కరధృత కోదండ బాణ సృణిపాశం

కఠిన స్తనభర నమ్రం

కైవల్యానందకంద మవలంబే!!

ఇది ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని ధ్యానం చేతే అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. దీనిని ప్రార్థనా శ్లోకంగా వాడతాం. ఎంత కష్టంలో ఉన్నప్పటికీ అమ్మవారికి సంబంధించినటువంటి బొట్టును ఒక్కసారి తలచుకొని ఈ శ్లోకం గానీ చదివితే ఎంత పెద్ద అమంగళమైనా సరే తప్పుతుంది. అమ్మవారు అనుగ్రహించి కాపాడుతుంది. అంత శక్తి ఈ శ్లోకంలో ఉంది.

కంచన కాంచీ తిలకం - కాంచీపురంలో ఉన్న మూర్తి గురించి చెప్తున్నాను అన్నారు. కామాక్షీ అని శ్లోకంలో ఎక్కడా లేదు. ఆయన కామాక్షిని చూసి చెప్తున్నారు అని అనకుండా శ్లోకాన్ని అన్వయం చేసుకుంటే అలా చేయడమే ఒక ధ్యానం. పేరు చెప్పకుండా వర్ణన చేయడం ధ్యానం. ఈ వర్ణన యథార్థమునకు లలితా త్రిపుర సుందరికి అన్వయం. శ్రీ విద్యా తంత్రం మొత్తానికి సంపూర్ణ స్వరూపంగా అత్యధిక ఫలితములు ఇవ్వగలిగిన పరదేవతా స్వరూపంగా తంత్రమునండు కీర్తింపబడిన స్వరూపం లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరీ స్వరూపమే కామాక్షీ స్వరూపం. రెండింటికీ భేదం లేదు.

తిలకం అన్నమాటకు అర్థం విశిష్ట వస్తువు, శ్రేష్ఠమైన వస్తువు. అంటే కాంచీపురంలోకెల్లా గొప్పది.

కంచన - ఒకే ఒక్కటి, తత్తుల్యం లేదు.

కాంచీ తిలకం - కాంచీ నగరమంతటికీ శ్రేష్ఠమైన దానిని ఒక ఒక్క దానిని

కర ధృత కోదండ బాణ సృణిపాశం - చేతులలో కోదండం. అది శ్రేష్ఠ వస్తువు. శ్రీ విద్యా తంత్రంలో పూర్ణత్వమును పొందినది. శ్రీవిద్యా తంత్రంచే ప్రతిపాదింప బడిన ఒక పూర్ణ స్వరూపం.

కరధృత - చేతులయండు కోదండం, బాణములు, పాశము, అంకుశము

కఠిన స్తన భర నమ్రం - ముందుకు కొంచెం వంగి ఉంటుంది. ఎందుకు? గట్టిగా ఉన్నటువంటి పూర్ణమైన స్తనములనే ఫలముల వలన వంగి ఉన్నది.

కైవల్యానందకరం - కైవల్యానందమునకు కందము. ఆనందం అన్నమాట బహు భంగిమల మారుతుంది. కైవల్యానందం - శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడో ఎక్కడో ఈశ్వర సాక్షాత్కారమై ఈశ్వరుడి దగ్గర కూర్చుంటే వచ్చే ఆనందం కాదు. ఇక్కడే జీవన్ముక్తుడైతే వచ్చే ఆనందం. జీవన్ముక్తుడు అంటే ఈ శరీరంలో ఈ ఇంద్రియములతో పొందే సుఖములు, సంతోషాలు వదిలిపెట్టి లోపల ఆత్మగా నిలబడి ఆనందంతో ఉండి శరీరం, ఇంద్రియాలతో సంబంధం తీగిపోయి శరీరాన్ని ఉప్పు బస్తాలాగా తిప్పుకుంటున్నవాడు. దానిని కైవల్యం అంటారు. అటువంటి ఆనందం ఎక్కడినుంచి అంకురంగా పైకి వస్తుందో

అవలంబే - దానిని నేను పట్టుకుంటున్నాను.

2,3 పాదాలు పట్టుకొని ఈవిడ ఎక్కడుందో తెలుసుకోవడానికి 1వ పాదం పట్టుకోవాలి. అలా పట్టుకున్న వాడికి వెతక్కుండా వచ్చేది 4వ పాదం. అది కేవలం శ్లోక పరిశీలనం చేత.ఈ శ్లోకం పట్టుకొని మానసికంగా అన్వయం చేసుకుంటే కామాక్షీ పరదేవతా దర్శనం చేసినట్లే.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML