ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్ర సూత్రాలు (అమ్మ లక్ష్మి గారు)
స్థల శుద్ధి లేనప్పుడు గృహ నిర్మాణం పనికిరాదు. స్థలం ఎన్నుకోవడంలో నేర్పు వుంటే గృహ నిర్మాణం తీరుగా వుంటుంది. స్థలానికి సమకోణంలో వీధి దూసుకుపోతే వీధి శూల వున్నట్లు అర్థం. అంటే వేరే వీధి వచ్చి గృహ గర్భంలో తగిలితే "గర్భశూల" అంటారు. వీధి స్థలంలోని ఇంటి నుండి దూసుకుని వెళితే "వీధిశూల" అని గుర్తించాలి.
తూర్పు వీధిశూల వల్ల రాజభయం. ఆగ్నేయం అయితే అగ్ని భయం, చోర భయం కూడా కలుగుతాయి. దక్షిణం అయితే రోగాలు, చావులు. పాము పుట్ట వున్న స్థలం కొని పుట్ట త్రవ్వి తీసివేసుకోవచ్చులే అని అనుకోకూడదు. అలా చేస్తే తర తరాలుగా నాగ భయం పీడిస్తుంది. నాగ దోషం కారణంగా సంతాన నష్టం, పిల్లల అకాల మరణం వంటివి సంభవిస్తాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
దేవాలయ ఆవరణంలోని స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. అలా చేస్తే తరతరాలు ఏ పని మొదలు పెట్టినా అపజయమే సిద్ధిస్తుంది. క్రమంగా వంశ నాశనం కూడా కలుగుతుంది. దేవతా విగ్రహాలు ఏ స్థలంలో దొరుకుతాయో ఆ స్థలాన్నికొని, గృహ నిర్మాణం చేయకూడదు. దేవతా శాపం వల్ల వివాహాలు కావు, మంత్రజపాలు బెడిసి కొడుతాయి.
మామిడిచెట్లు, పాలుగారే చెట్లు, కొబ్బరి చెట్లు నరికివేసి గృహాన్ని నిర్మించుకోవలసి వస్తే, ఆ స్థలాన్ని వాడుకోరాదు. అలాంటిచోట నివసించే స్త్రీలు నిండు యవ్వనంలోనే మరణిస్తారు. ఇంటి గర్భంలో ఆస్పత్రి, కబేళా, చర్మ పరిశ్రమలు దూసుకువచ్చేలా వున్న స్థలాన్ని నివాస గృహ నిర్మాణానికి ఎంపిక చేయకూడదని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు
No comments:
Post a comment