గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 March 2015

ఈ యుగాన్ని శాలివాహన శకంగా పేర్కొన్నారు.

తెలుగువారికి తొలి పండుగ ఉగాది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిధి ఏ రోజు ఉంటుందో ఆ రోజే ఈ ఉగాది పండగ. అందుకని అనాదిగా వస్తున్న ఈ ‘యుగాది’ రాను రాను ‘ఉగాది’ పండుగగా మారింది. శాలివాహన చక్రవర్తి (క్రీ.శ.79) లో ఈ సంవత్సరాది నాడే పట్ట్భాషిక్తుడయ్యాడని చెబుతారు. ఆ కారణంగా ఈ యుగాన్ని శాలివాహన శకంగా పేర్కొన్నారు.
ఇది మనకు నిజమైన కొత్త సంవత్సరారంభం. ప్రకృతి
కూడా కొత్త మార్పులు ఈ రోజునందే మనకు కనబడతాయి. కొత్త చిగుళ్లు, కొత్త పూత- ఇలా అంతా కొత్తదనం కనుకనే ఈ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. మన ఆంధ్రులు ఔషధీ విలువలు ఉన్న ఉగాది పచ్చడి అని ఈ పండుగ చాలా పవిత్రంగా జరుపుకుంటారు. సంవత్సరారంభమున పూర్వ తిథితోకూడిన పాడ్యమినే గ్రహించాలి. చైత్ర శుద్ధ పాడ్యమి దినమున ఉపవాస దీక్ష జరిపి బ్రహ్మను పూజించినవాడు సంవత్సరం అంతయూ సుఖసంతోషాలతో విలసిల్లెదరు అని కొన్ని ప్రాచీన గ్రంథాలు చెప్పుతున్నాయ.
ఉగాది పర్వదినాన అందరూ ఉదయానే్న నిద్రలేచి స్నానాలాచరిస్తారు. పిల్లలు, పెద్దలు కొత్త బట్టలుధరిస్తారు. సంప్రదాయ సిద్ధంగా ఉండేవారు పట్టుబట్టలు ధరిస్తారు. ఉగాదికి ఎవరి ఇష్టదైవాన్ని వారు పూజిస్తారు. కొందరు దగ్గరలో ఉన్న దేవాలయాలకు కుటుంబ సమేతంగా వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. ఉగాదికి, ‘ఉగాది పచ్చడి’కి ప్రత్యేకత ఉంటుంది. వేపపూత, మామిడికాయలు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, అరటిపండు మొదలైన మిశ్రమంతో ‘ఉగాది పచ్చడి’ తయారుచేస్తారు. చేదు, తీపి, వగరుతో కూడిన ఈ ఉగాది పచ్చడిని మానవ జీవితంలో ఉండే సుఖదుఃఖాలకు ప్రతీకగా చెబుతారు.
ఈ ఉగాది పచ్చడిని అందరూ సేవిస్తారు. పులిహోర, బూరెలు, పాయసం వంటివి ఖచ్చితంగా చేసుకుంటారు. సాయంత్రం వేళ మాత్రం పంచాంగ శ్రవణం చేస్తారు. పురోహితులు ద్వారా గానీ లేక స్వయంగా గానీ కొత్త సంవత్సరంలో జాతక ఫలాలు, వర్షాలు, పంటలు మొదలైన విశేష విషయాలు తెలుసుకొంటారు.
గ్రామాల్లో ఉగాది మరింత వైభవంగా ఉంటుంది. గ్రామీణులు గ్రామ దేవతలను పూజిస్తారు. ప్రతీ గ్రామంలో ఒక గ్రామ దేవత ఉంటుంది. ఉగాదికి అక్కడ విశేష పూజలు చేస్తారు. భజనలు, కోలాటాలు ఏర్పాటుచేస్తారు. ఈ విధంగా గ్రామ దేవతని కొలిస్తే ఆమె అంటు వ్యాధులనుంచి కాపాడుతుందని విశ్వాసం. గ్రామ దేవతని వేప ఆకులతో పూజించడం, వేప ఆకుల తోరణాలు కట్టడం సంప్రదాయం. దీప వైద్య వృక్షం. వేప ఆకులతో నలుగుపెట్టి, స్నానం చేస్తే చర్మవ్యాధులు దూరమవుతాయి. అలాగే వేప గింజలు కూడా ఔషధాల్లో వినియోగిస్తారు. ఈ ఉద్దేశ్యంతోనే వేప పూతను ఉగాదిపచ్చడిలో కూడా కలుపుతారు.
శాస్తవ్రిధిగా పంచాంగ శ్రవణం, చేసిన వానికి, వినిపించినవారికీ సూర్యునివలన శౌర్యము, తేజస్సు చంద్రునివలన భాగ్యమూ, వైభవమును, కుజుని వలన సర్వమంగళములు, బుధుని వలన బుద్ధి వికాసమూ, గురునివలన గురుత్వము, జ్ఞానము, శుక్రునివల్ల సుఖము, శనివల్ల దుఃఖ రాహిత్యమును, రాహువు చేత ప్రాబల్యము, కేతువువల్ల తన వర్గంలో ప్రాముఖ్యత కలుగును.
ఉగాది పండుగ ప్రకృతితో ముడిపడి వుంటుంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పులవల్ల ఇప్పుడు ప్రకృతి ఇంత ఆహ్లాదకరంగా లేకపోయినా మనిషి గుండెలో ఉగాది అనుభూతులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా చిగురులు తొడుగుతూనే ఉంటాయి. అందుకే నవవసంతంలోని ఉగాదినుంచి ప్రజలందరూ న్యాయమూర్తులు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని కోరుకోవాలి. జనులు ధార్మిక జీవనులైతే వారు నడిచే బాట నలుగురికీ ఆదర్శవంతంగా ఉంటుంది

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML