గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 9 March 2015

చైత్రమాసపు శుక్లపక్షంలోని మొదటి సూర్యోదయ కాలంలో బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని శ్లోకానికి అర్థం.చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని
శుక్లపక్షే సమగ్రస్తు తథా సూర్యోదయే సతి॥

చైత్రమాసపు శుక్లపక్షంలోని మొదటి సూర్యోదయ కాలంలో బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని పై శ్లోకానికి అర్థం. ఏ పూర్ణిమ అయితే చిత్తా నక్షత్రంతో కూడి ఉంటుందో అదే చైత్రమాసం. ఈ చైత్రమాసం మొదటి రోజే ఉగాది. యుగారంభంలో శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై పవళించినట్లు మనకు పురాణాలు విశదపరుస్తున్నాయి.


నవ చైతన్యానికి, నవ్య శోభకు, విశ్వ సౌందర్యానికీ ఉజ్వల ప్రతీకగా ‘ఉగాది’ని అభివర్ణించారు పెద్దలు. ప్రకృతిని ఆశలకు, ఆకాంక్షలకు ప్రతీకగా చూపి... మానవునిలోని నిరాశా నిస్పృహలను పోగొట్టి నవ చైతన్యాన్ని కలిగించి, కొత్త కలలకు మొగ్గలు తొడిగించి శోభింపజేసేదే ఉగాది. మోడువారి నిశ్చేతనంగా ఉన్న శిశిరంలోంచి వినూత్న శోభను చిగురింపజేసి దివ్యానుభూతులకు పలికే నాందీ వాచకమే ఉగాది.

ఆదిలో ఈ ఉగాది పర్వదినం రోజునే చతుర్ముఖ బ్రహ్మ ఈ చరాచర సృష్టిని ఆరంభించినట్లు ‘బ్రహ్మాండ పురాణం’ తెలియజేస్తోంది. వసుచక్రవర్తి ఘోరాతిఘోరమైన తపమొనరించి రాజ్యాధికారం పొందినప్పుడు దేవేంద్రుడే స్వయంగా ఆయనకు ఉగాది రోజున నూతన దివ్య వస్త్రాలను బహూకరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విధంగా శ్రీరామ చంద్రుడు రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యా నగరానికి ఈ ఉగాది పర్వదినానే వచ్చినట్లు రామాయణ కావ్యంలో ఉంది. సరిగ్గా ఆ ఉగాది నాడు శ్రీరాముని పట్టాభిషేకం కూడా జరిగింది. యుగాలు మార్పు చెందినప్పుడల్లా సృష్టిలో, సకల చరాచర ప్రకృతిలో విశిష్టమైన మార్పులు చోటు చేసుకున్నట్లు ప్రాచీన వాఙ్మయంలో సుస్పష్టమైన ఆధారాలున్నాయి. దీని మూలం ‘కాలతంత్రం’ అని భాగవతం చెబుతోంది.

పంచభూతాల సంయోగ-వియోగాలకు కాలమే కారణభూతం అవుతోంది. ఒక యుగం మారి మరొక యుగంలో పాదం మోపే సంధి సమయంలో చిత్ర విచిత్రాలైన పెనుమార్పులు సంభవిస్తుంటాయి. ద్వాపర యుగాంతంలో, కలియుగ ఆరంభంలో కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగింది. ఇందుకు కారణం సప్తరుషులు మఖానక్షత్రంలోనికి ప్రవేశించడమేనని జ్యోతిష శాస్త్రజ్ఞుల నమ్మకం. సృష్టిలోని సమస్త పశువులు, పక్షులు, మానవులు, అచరములైన పర్వతాలు, వృక్షాలు, సముద్రాలు అన్నిటిపై కాలం తన ప్రభావం చూపిస్తూనే ఉంది.

‘కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః అని శ్రీకృష్ణ పరమాత్మ తన గీతా సందేశంలో సర్వమానవాళికి తెలియపరిచాడు. ఈ కాల గమనాన్ని స్తంభీభూతం చేయాలంటే మనం సెకనుకు 1,80,000 మైళ్ల కాంతి వేగంతో ప్రయాణించాలి. ఇది మానవ మాత్రులకు సాధ్యం కాదు కనుక కాలంతో పాటు ప్రయాణించాలి. ఈ ‘శ్రీ మన్మధ’ ఉగాది అందరిలోనూ నవనవోత్సాహాన్ని రేకెత్తించి ప్రగతి పథంలో ముందుకు సాగేలా చేస్తుందని ఆశిద్దాం!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML