ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 9 March 2015

విగ్రహారాధనలో అంతరార్థం!విగ్రహారాధనలో అంతరార్థం!

ఉత్తమం సహజావస్థా ద్వితీయం ధ్యానధారణా
తృతీయాప్రతిమా పూజా హోమయాత్రాచతుర్థికా – శివపురాణం

అంటే, భగవంతుని తనలో ప్రత్యక్షం (ఆత్మదర్శనం)చేసుకోవడం ఉత్తమమయినది. భగవంతుని గురించిన జ్ఞానము, ధారణ దాని తరువాతవి. మూడవది భగవంతుని ప్రతిమలను పూజించడం. నాలుగవది పుణ్యక్షేత్రాలను దర్శించడం. చివరి రెండూ సామాన్య భక్తుల కోసం ఉద్దేశించినవి. పరామాత్మ అనుగ్రహం పొందడానికి విగ్రహారాధన ఒక మెట్టు వంటిది.

అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాః పరికల్పితాః – ధర్మనోపనిషత్

సామాన్యులకు నిర్గుణాకారుడైన ఆ పరబ్రహ్మోపాసనార్థమై మొదటి మెట్టుగా విగ్రహారాధన కల్పించబడినది.

ఈ విధంగా ఏర్పడిన విగ్రహారాధన డవార్యదోర్వీర్యంబుఆ మోక్షాన్ని పొందవచ్చు. దీనికి భక్తి ప్రధానం.

భక్త్యా వీణా బ్రహ్మజ్ఞానం న కదా చిదపి జాయతే – మహానారాయణోపనిషత్

పరిపూర్ణమైన భక్తి లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని (ఆత్మజ్ఞానాన్ని) ఏవిధంగానూ పొందలేము.

ఆత్మజ్ఞానాన్ని పొందటానికి సాధనంగా వారికి ఇష్టమైన దైవ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి. అలా పూజించటం పరబ్రహ్మను పూజించినట్లే అవుతుంది. భక్తులు తఇష్టమైన మకు దేవతావిగ్రహాన్ని నిల్పుకుని ఆ విగ్రహమే ‘పరబ్రహ్మగా’ తలచి, నిశ్చలభక్తితో, శ్రద్ధాశక్తులతో, పరిపూర్ణవిశ్వాసంతో నిరంతరం పూజించితే తప్పనిసరిగా ‘ఆత్మజ్ఞానం’ పొందుతారు.

విగ్రహారాధన ద్వారా మనస్సుని నిశ్చల పరుచుకుని, (మనోనిగ్రహాన్ని పొంది) ఆ తదుపరి ‘నిర్గుణోపాసన’ ఆచరించవచ్చు. అంతేగాని, మనోనిగ్రహాన్ని పొందకుండా నిర్గుణోపాసన ద్వారా ‘ఆత్మజ్ఞానాన్ని’ తెలుసుకోవాలనుకోవటం హాస్యాస్పదం. మనస్సుని అంటే పంచేంద్రియాలను, కామ, క్రోధాది అరిషడ్వర్గములను జయించనివాడు ‘నిర్గుణోపాసన’కు అర్హుడు కాదు. భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో “విగ్రహారాధన” చేసేవారు “పరబ్రహ్మ”ను ఆరాధించి నట్లే అవుతుందని, వీరే పరమ భాగవతోత్తములని శ్రుతులు తెలుపుతున్నాయి.

విగ్రహారాధన చేయకుండానే “పరబ్రహ్మను” ఆరాధించవచ్చు. దీనినే ‘నిర్గుణోపాసన’ అంటారు. కాని నిర్గుణోపాసన సామాన్యులకు సాద్యం కానిది. ఎందువలనంటే మన ఎదుట నిలుపుకున్న ‘దైవవిగ్రహము’ మీదనే, మన దృష్టిని, మనస్సుని తదేకంగా నిలపటం కష్టము. అటువంటప్పుడు నిరాకారుడైన ఆ “పరబ్రహ్మ” పై మన మనస్సుని ఎలా నిలుపగలం. సామాన్యులకు అది సాధ్యం కాని విషయం.

మానవునికి క్షణకాలంలోనే అనేక సంకల్పాలు శరపరంపరలుగా కలుగుతుంటాయి. అటువంటి విపరీత చంచల స్వభావమైన మనస్సును కదలక నిశ్చలంగా ఉండేటట్లు చేయడం చాల కష్టం. కాబట్టి మనస్సును “విగ్రహారాధన” అనే ప్రక్రియలో నిశ్చలపరచి, “మనోనిగ్రహాన్ని” పొందటం అత్యంతావశ్యకం.

కాబట్టి, మనస్సుని నిగ్రహించి, ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందటానికి లేక ‘పరబ్రహ్మతత్త్వాన్ని’ తెలుసుకోవటానికి ‘విగ్రహారాధన’ యే మిక్కిలి ప్రయోజనకారిగా ఉంది.

సర్వవ్యాప్తుడై సర్వభూతాలలో చిద్రూపుడైన ‘పరమాత్మ’ స్వరూపాలకు శిలా, మృత్తిక, దారుకలతో, కళావిన్యాస ప్రక్రియలతో విగ్రహాలుగా తయారు చేసి, ఆ దేవతామూర్తులను మంత్ర తంత్ర సంస్కారములచే ఆవాహన చేసి, ప్రతిష్టించి, వర్ణ, రూప నామములతో మంత్ర, తంత్ర యంత్ర విధులతో సామాన్యులైన భక్తులు పూజించి, భగవదనుగ్రహాన్ని పొందటం శాస్త్ర సంబంధమై ఉంది.

దుర్లభో మానుశోదేహః దేహీనాం క్షణభంగురః
తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనమః

జీవులలో మానవజన్మదుర్లభమైనది. కాని, క్షణ భంగురమైనది. కావున ఆ కొద్ది దుర్లభమైన “దైవ సాక్షాత్కారా”నికి వినియోగించుకోవలెను. ఇది ఉత్తమం. భగవదారాధన పూర్వకమైన విగ్రహారాధన కేవలం వైదికమైన పరలోకప్రాప్తికే కాక శారీరక, మానసికశాక్తులను పెంచుకోవడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. శాస్త్రాలలో అవ్యక్తమని చెప్పబడుతున్న ‘పరమాత్మ’ను ఆరాదిన్చాదానికిగల మార్గాలలో సులభమైంది ఈ ‘విగ్రహారాధన’.

భగవంతుడు సర్వవ్యాపి. ఆ స్వామి అన్నింటా వ్యాపించి ఉన్నాడు. కనుక మనం పూజించే విగ్రహంలో కూడ ఎందుకు లేదు? తప్పక ఉన్నాడు. అందుకే మనకు విగ్రహాన్ని చూడగానే భక్త్యావేశం కలిగి పరవశులం అవుతుంటాం! ఆ విగ్రహరూపం ముందు మన గోడును చెప్పుకుని సేదతీరుతుంటాం

విగ్రహారాధనకు ఆసక్తి, నమ్మకం చాలా ముఖ్యం. భక్తి, ప్రేమలు ప్రధానం. ఆడంబరాలతో చేసె విగ్రహారాధనలకు, అహంకారపూరితమైన భావావేశాలకు ‘పరమాత్మ’ గోచరింపడు. ప్రశాంత చిత్తంతో ఆరాధిస్తూ, నిష్కామంగా దృఢవిశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే తప్పని సరిగా సాక్షాత్కరిస్తాడు. ఆయన భక్తజన పరాధీనుడు.

విగ్రహమనగా విశేషంగా గ్రహించేది. అంటే భగవంతుని శక్తిని, గుణాలను, స్వరూపాన్ని పూర్తిచేసిగా తనలో ఇముడ్చుకొనగలిగినవే “దైవ విగ్రహాలు”. అవి దేనితో చేయబడినప్పటికీ కళావిన్యాస పూర్వకంగా ఉండి, మంత్రశక్తిచే శాస్త్రప్రకారం ప్రతిష్టించబడటం చేత, అవి “భగవంతుని” తత్త్వాన్ని ఆకర్షించుకుని, తమలో నిక్షిప్తపరచుకుని, ఆ శక్తితో అవి ప్రకాశిస్తుంటాయి. కాబట్టి వాటిని ‘అర్చామూర్తులు’ అని అన్నారు.

భగవద్గీతలో ఉదాహరించిన ప్రకారం, ఉపాసింప వీలులేని భగవత్త్వమును సామాన్య భక్తులు ఉపాసించుటకు వీలుగా విగ్రహారాధన రూపొందింది. అందరికి అందుబాటులో ఉండి, సులభసాధ్యమైనది ఈ విగ్రహారాధన.

సర్వాంతర్యామియైన భగవంతుడు కేవలం తపఃసంపన్నులను, యోగులకే చూడ సాధ్యమవుతాడు. ఆకారణంగా సామాన్యులకు ‘అర్చావతారవిగ్రహా’లే శరణ్యమవుతున్నాయి.

విగ్రహాలలో శక్తి ని నింపటానికి మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సాధనములు ఉన్నాయి. భగవతత్వం ప్రప్రథమంగా శబ్దంచే గ్రహింపబడుతుంది. భగవద్రాహకమగు శబ్దమేది ఉందో, అదే ఆ దైవం యొక్క మంత్రంగా నిలుస్తోంది.

నిత్యపూజాగృహములయందు పూజావిగ్రహాలు 4 అంగుళాలు మొదలు 12అంగుళాల వరకు ఉండాలి. పూజా ప్రతిమలు రత్నాలతో తయారైనవైతే అత్యుత్తమం. ఆ తరువాత బంగారం, వెండి, రాగి లోహాలతో విడివిడిగా గాని, ఈ లోహములన్నింటిలో కలిపి గాని (పంచలోహాలు) చేయుంచుకోవటం ఉత్తమం. రాయితో తయారైనవి మధ్యమం, చెక్కలతో తయారైనవి అధమం. దైవపటాలకన్నా విగ్రహాలు శ్రేష్ఠం. అందులోనూ పంచలోహాల విగ్రహాలు గాని, శిల, దారు, మృత్తికావిగ్రహాలు కాని, శక్త్యానుసారంగా ఉపయోగించుకోవచ్చు.

దైవవిగ్రహాలు చూడటానికి ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మనస్సుని ఆకట్టుకునే విధంగా, కళాత్మకంగా, సుందర మనోహరంగా తీర్చిదిద్దిఉండాలి.

ఇంట్లో ఈశాన్యభాగంలోగాని, ఉత్తర, తూర్పుభాగాలలోగాని పూజామందిరాన్ని ఏర్పరచుకోవాలి. పూజామందిరంలో ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాలలో ఉన్నతమైన స్థలంలో గాని, ఎత్తైన పీఠంపైగాని పూజావిగ్రహాలను ప్రతిష్టించాలి. దైవవిగ్రహాలకు ఎదురుగా కూర్చుని పూజించరాదు.

సగుణ జ్ఞానహీనస్య నహినిర్గుణ వేదనమ్
నందిదర్శన హీనస్య యథా న శివదర్శనమ్

ఎలాగైతే నంది దర్శనాన్ని చేయలేనివాడు శివదర్శనాన్ని చేయలేకపోతాడో, అలాగు సగుణజ్ఞానంలేనివానికి నిర్గుణజ్ఞానం సిద్ధించదు. పెద్దఆకారంతో గర్భగుడికి బైటనున్న నందీశ్వరుని చూడజలని అశక్తుడు చీకట్లో చిన్నదిగా ఉన్న శివలింగాన్ని ఎలా చూడగలడు? అని శివపూరానం చెబుతోంది. అందుకనే సగుణరూపంలో మనకోసం భూలోకానికి విచ్చేసి కొలువైన దైవాలను నియమనిష్ఠలతో పూజించి వారి ముందు మన లోరికలను ఉంచి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో మన జన్మలను ధన్యం చేసుకుందాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML