గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 March 2015

అరుణాచలంఅరుణాచలం

తిరువణ్ణామలై(తమిళనాడు)లో తేజోలింగము ఉంది . ఈ స్వామిని "అరుణాచలే్శ్వర స్వామి" అనిపిలుస్తారు. తేజోరూపాన వెలసిన అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీక.

ఈ క్షేత్రాన్ని భూమికి హృదయ భాగంగా చెప్పుకుంటారు. సృష్టి , స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువులు ఒకసారి తమలో తాము ' ఎవరు గొప్ప ' అన్న విషయమై వాదించుకుంటుండగా ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా వెలసింది ఇక్కడే అని స్థలపురాణం(అదే మహాశివరాత్రి పర్వదినానికి మూలం).అప్పుడు శివుడు కార్తీకమాసంలో అగ్ని లింగంగా దేవతలకు దర్శనమిస్తానని వరమిచ్చారట. అందుకు గుర్తుగా ఏటా తమిళకాలం ప్రకారం కార్తీకమాసంలో ఇక్కడ దీపోత్సవం జరుపుతారు.


అలా ఒకనాడు శివుడు వెలసిన అరుణాచలం చుట్టూ(12కి.మం.దూరం) ప్రదక్షిణ చేయడాన్ని సాక్షాత్తూ ఆ స్వామికే ప్రదక్షిణ చేసినట్లుగా భక్తులు భావిస్తారు. దానిని 'గిరి ప్రదక్షిణం' అంటారు.

కంచిలో పుట్టడం, కాశీలో మరణించడం ఎలా ముక్తినిస్తాయో అలా అరుణాచలం గురించి ఆలోచిస్తే చాలు మోక్షం లబిస్తుందని విశ్వాసం.

అరుణాచల ఆలయ ప్రాంగణంలోని నైరుతిమూల ఉండే పాతాళలింగాన్నే రమణ మహర్షి ఆరాధించారు.

ఇక్కడి విశేషమేమిటంటే .. పంచభూతలింగాల్లో మిగతావైన ఏకాంబరేశ్వర, జంబుకేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, చిదంబర లింగాల ఆలయాల నమూనాలను ఈ ప్రాంగణంలోని మూడోప్రాకారంలో దర్శించవచ్చు. అంటే.. అన్ని చోట్లకూ వెళ్ళలేని వారు ఒక్క అరుణాచలాన్ని దర్శిస్తే సరిపోతుందన్నమాట. ఇంక.. చిత్రగుప్తుడికీ ధర్మదేవతకూ కూడా ఆలయాలు ఉండటం ఇక్కడే చూస్తాం. ఇక్కడ అమ్మవారు ఉణ్ణామలై.

25ఎకరాల విస్తీర్ణంలో 217అడుగుల ఎత్తైన 11 అంతస్తుల భారీ రాజగోపురంతో పెద్ద పెద్ద ద్వారాలతో కుండాలు ఏడు ప్రాకారాలతో బాగా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే పెద్ద కోటలా దర్శనమిచ్చే ఆర్కిటెక్చర్ అద్భుతం అరుణాచలం ఆలయం. ప్రస్తుతమున్న గుడిని పల్లవరాజులు కట్టించారు. అంతకు ముందు ఈ నిర్మాణం గురించి చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు.

ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి.మీ దూరంలో ఉంది. విల్లుపురం నుంచి కాట్పాడికి వెళ్లే మార్గంలో ఉంది. విల్లుపురం నుంచి 68కి.మీNo comments:

Powered By Blogger | Template Created By Lord HTML