గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 March 2015

బ్రహ్మపురీశ్వర దేవస్థానం – కాంచీపురంబ్రహ్మపురీశ్వర దేవస్థానం – కాంచీపురం

ఈ దేవస్థానం వేయి సంవత్సరముల పురాతనమైనది ఇది కాంచీపురంలో వున్నది శివ సన్నిధి, పార్వతి సన్నిధికి మధ్య కుమారస్వామి సన్నిధి వుండిన సోమస్కంద మూర్తిగా పరిగణింప బడుతుంది కానీ కాంచీపురంలోని తేనంబాక్కం అనేచోట వెలసియున్న బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో శివ పార్వతులకు మధ్య వినాయక సన్నిధి ఉండడం ప్రపంచములో వేరెక్కడ చూడలేని ఒక ప్రత్యేకత దీనికి సోమగణపతి దేవస్థానం అని పిలువబడుతుంది స్థలపురాణం: శివునకు ఎడమపక్క ఉద్భవించిన మహావిష్ణు నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించెను బ్రహ్మ తనకు సృష్టి చేసే విధానము బోధించమని శివుని ప్రార్థించగా భూలోకంలోని పుణ్యక్షేత్రమైన కంచి నగరంలో తనను గురించి ఏకాగ్రచిత్తంతో తపము చేస్తే తనకు ఉపదేశిస్తానని అంటారు. బ్రహ్మకంచికి వెళ్లి తపము ఆచరించుచు సోమయాగము చేయ తలంచి తన దేవేరి సరస్వతిని ఆశించెను కాని సరస్వతికి సమన్వయము కాకుండా వెళ్ళిపోయింది. బ్రహ్మ సావిత్రి గాయత్రి అనే దేవతలను సృష్టించి యాగము ప్రారంభించిరి. దీనిని గ్రహించిన సరస్వతి ఒక నదీ రూపముగా వచ్చి యాగకుండమును పాడుచేయ వచ్చెను. బ్రహ్మ తన యాగమును కాపాడమని శివుని ప్రార్థించగా మహావిష్ణువును పంపుతాడు ఈశ్వరుడు. మహావిష్ణువు సరస్వతి నదికి అడ్డుగా ఒక ఆనకట్టగా అడ్డుపడి యాగము పూర్తి చేయిస్తారు. తర్వాత తన తప్పును గ్రహించి సరస్వతి బ్రహ్మతో రాజీపడి యాగము పూర్తి గావించడానికి తోడ్పడుతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై సృష్టి రహస్యము బ్రహ్మకు చెపుతాడు. అప్పుడు బ్రహ్మ తాను తపము గావించిన ఈ స్థలమును ఆస్థాన స్థలముగా స్వీకరించమని శివుని ప్రార్థించగా శివుడు అనుగ్రహిస్తాడు. అందువల్లే ఈ స్థలమునకు శివాస్థానం అని పేరు. బ్రహ్మ స్వయంగా పూజించినందున శివునికి బ్రహ్మపురీశ్వరుడు అని పేరు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML