గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 28 March 2015

శ్రీనారాయణ పరబ్రహ్మము దాల్చిన పరిపూర్ణ అవతారం శ్రీరామావతారం

శ్రీనారాయణ పరబ్రహ్మము దాల్చిన పరిపూర్ణ అవతారం శ్రీరామావతారం. శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన కళలతో అవతరించిన రోజే చైత్రశుద్ధ నవమి. ఈ పవిత్రమైన పర్వాన్ని ఆధారం చేసుకొనే చైత్రశుద్ధ పాడ్యమినుంచి కూడా నవరాత్రుల పూజతో స్వామివారిని ఆరాధన చేస్తారు.
రామనామం చాలా విశిష్టమైనది. రెండక్షరాల నామానికి చాలా శక్తి ఉన్నది. అలాంటి నామానికి మరికొన్ని శబ్దములు సంపుటితం చేసి మరికొన్ని ప్రయోజనాలని పొందవచ్చు. రామనామానికి శ్రీకారం కలిపి చేసినట్లైతే శ్రీరామ అవుతున్నది. అక్కడ సాక్షాత్తూ మహాలక్ష్మి సీతాదేవి. దీనికి తోడు జయ శబ్దం కూడా కలిపినట్లైతే అది సాధకుడికి కావలసిన జన్మ సాఫల్యాన్నిస్తున్నది. చతుర్విధ పురుషార్ధములను ప్రసాదించే జయశబ్దం రామనామానికి కలపడం వల్ల రామానుగ్రహం వల్ల ఆ జీవుడికి కావలసిన చరితార్థత లభిస్తున్నది.
శ్రీరామ జయరామ జయజయ రామ - అని మంత్రశాస్త్రం జయశబ్దంతో రామనామాన్ని కలిపి ఎలా ఉపాసన చేయాలో చెప్తున్నది. పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఉపదేశిస్తూ చెప్పినటువంటి మహామంత్రం
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!
శ్రీరామ రామ రామ - ఇది మహామంత్రం. ఇందులో మూడుమార్లు రామనామం వచ్చి, ముందు శ్రీకారం ఉన్నది. ఆ శ్రీ సీతమ్మను తెలియజేస్తున్నది. మూడుసార్లు రామ అనేసరికి ఆ శక్తి ఒక విశేషాన్ని పొందుతుంది. ఇక్కడ ముమ్మార్లు రామనామం పెట్టినప్పుడు దానికి మూడు మార్లు జయ శబ్దం కలిపితే అదొకమంత్రం అవుతున్నది. శ్రీరామ రామ రామ ఒక మంత్రం అయితే దానికి జయశబ్దం ముమ్మార్లు కలిపితే అది పదమూడు అక్షరాల మహామంత్రం అవుతున్నది. ఈ పదమూడు అక్షరాల మహామంత్రం నిరంతరం జపించే వారికి ఎక్కడైనా జయమే! కార్యసిద్ధికీ జయమని పేరు. దుఃఖములు తొలగి ఆనందం లబించితే అదీ జయమని పేరు. కోరికలు నెరవేరితే జయం. చతుర్విధ పురుషార్ధాలు సిద్ధిస్తే జయం. యే జయమైన ఇవ్వగలిగే శక్తి ఈ నామానికున్నది. అందుకే మొత్తం దేశక్షేమం కోసమని ఆనాడు ఛత్రపతి శివాజీకి సమర్థరామదాసు ఇచ్చిన మహామంత్రం కూడా "శ్రీరామజయరామ జయజయ రామ". నేటికీ దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలలో శ్రీరామజయం అని వ్రాయడం ఒక అలవాటు. ఎలాగైతే శ్రీరామ అని రామకోటి వ్రాస్తారో శ్రీరామజయం అని కూడా రచిస్తారు. శ్రీరామజయం అని నామాన్ని రచించి దానిని ఒకమాలగా చేసి ఆ మాలను హనుమంతుని మెడలో వేసి పూజించడం కూడా ఒక లక్షణంగా కనపడుతున్నది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML