గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 24 March 2015

చిత్రకేతూపాఖ్యానం మొదటి భాగం, రెండవ భాగంచిత్రకేతూపాఖ్యానం మొదటి భాగం

పూర్వం చిత్రకేతువు అనే మహారాజు శూరసేన దేశాలను ప్రజలు సంతోషించేలా సార్వభౌముడై, ఐశ్వర్యంలో దేవేంద్రునితో తులతూగుతూ, ఎల్లవేళలా ప్రజల కోర్కెలను తీరుస్తూ ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకు చాలామంది భార్యలు ఉండేవారు. చక్కని చుక్కలు, మన్మథుని అస్త్రముల వలే, వాడియైన చూపులతో పందెపు గుర్రాలవలె, అందాల ఆటబొమ్మలవలె, ఉన్న ముద్దు గుమ్మాలతో కూడినవాడై అఖండ కీర్తి వైభవంతో సన్మార్గియై రాజ్యం చేస్తూ ఉన్నాడు.

చాలినంత సంపదలు, వేలకొలది భార్యలు ఉన్న సంతతి యైన ఒక కుమారుడిని పొందలేక మనస్సులో మోయలేని బరువుతో, దిగులుతో వేసవి కాలపు మడుగులా నానాటికీ క్షీణించి పోతూ ఉన్నాడు. చక్కని రూపం, దేవేంద్ర భోగం, నిండు యౌవ్వనం, సాటిలేని ప్రతాపం, మంచి నడవడిక, సాటిలేని ప్రతాపం, సత్య హృదయం, దిగ్విజయలకూ కొరతలేదు. జగద్వ్యాపిత కీర్తి ఉన్నది. చక్కదనాల రాణులు ఉన్నారు. ఇన్ని ఉన్నా ఇవేమీ ఆ సార్వబౌముడికి సుతుడు లేని లోటు పూడ్చలేకపోయాయి..


ఈవిధంగా సంతతిలేక దుఃఖ మనస్కుడైన ఆ నరేంద్రుడి మందిరమునకు ఒకనాడు అంగిరసుడు అనే మహర్షి వచ్చి, అతడి చేత సత్కరములు పొంది కుశలం అడిగి, రాజ్యం నీ ఆధీనంలోనే ఉన్నది కదా! పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తు, అహంకారం అనే ఎడింతిచేత రక్షించబడుతున్న జీవునివలే నీవు అమాత్యులు, జనపదములు, దుర్గము, కోశము, వస్తు సంపద, దండనము, మిత్రుడు అనే సప్తప్రకృతులచేత రక్షితముగా ఉన్నావు కదా! ప్రకృతి పురుషుల యందు భారం వేసి రాజ్యసుఖములు అనుభావిస్తున్నావు కదా! మఱియు భార్యలు, ప్రజలు, అమాత్యులు, భ్రుత్యులు, మంత్రులు, పౌరులు, జానపదములు భూపాలురు నీకు వశవర్తులే కదా! సర్వమూ ఉండి కూడా సార్వభౌముడి వైన నీ వదనంలో చిన్నతనం కలిగి ఉన్నది ఏమి కారణం?అని అడిగిన మహర్షితో సార్వభౌముడు ఇట్లనియె!

మీతపోబలం వలన మీకు తెలియరానిదంటూ ఉంటుందా? అని తలవంచి కూర్చొని ఉన్న అతడి అభిప్రాయం తెలుసుకొని! భగవంతుడైన అంగిరసుడు దయార్థహృదయుడై మహారాజు చేత పుత్రకామేష్టి యజ్ఞం చేయించి యజ్ఞశేషం అతని పెద్ద పట్టమహిషియైన కృతద్రుతికి ఇచ్చి నీకు పుత్రుడు కలుగుతాడు. అతడి వలన నీవు సుఖదుఃఖములు పొందుతావు అని తెలిపి మహర్షి వెళ్ళిపోయాడు. యజ్ఞశేషం స్వీకరించిన పెద్దభార్య కృతద్రుతి గర్భవతియై నవమాసములు గర్భాన్ని మోసి బిడ్డను ప్రసవించింది. ఆ సమయంలో రాజుతో పాటు భ్రుత్యులు, అమాత్యులు, పౌరజనం సంతోషించారు. అప్పుడు మహారాజు శౌచ స్నానం ఆచరించి, సర్వాభారణాలు ధరించి సుతుడికి జారక కర్మలు నిర్వహించి, బ్రాహ్మణులకు అపరిమితమైన భూమీ, వెండి బంగారములు, వస్త్రాభరణములు, గ్రామములను, ఏనుగులను, వాహనములను, ధేనువులను, ఆరేసి అర్బదముల ద్రవ్యములు దానం చేసి ప్రాణి సముదాయానికి వర్షాది దేవతయైన పర్జన్యుడి వలే, మిగిలిన వారికి వారి కిష్టమైన కోర్కెలను వర్షించి (తీర్చి) పరమానంద హృదయుడై ఉన్నాడు.. అంతట పుత్రుడి మీద వ్యామోహంతో కృతద్యుతి యందు బద్ధానురాగుడై ఉండడం తక్కిన భార్యలు సంతాన సంతోష వికలురై, ఈ మొహమునకు కారణం పుత్రుడని ఈర్ష్య పొంది క్రూరత్వంతో కుమారుడికి విషం ఇవ్వగా సుఖంగా నిద్రిస్తున్న వాని వలే బాలుడు మృతిచెందాడు. వేకువన నిద్ర మేల్కొలపగా వెళ్ళిన దాది ఆ కుమారుడి వికృతాకారం చూసి విస్మయం పొంది, భయపడి, శోకించి భూమిపై పడి ఆక్రంచింది.. అప్పుడు...

ఈ మీ జన్మకి కారణం, ఈ బంధాలు, బందుత్వాలు ఎంతవరకు? అనే వాటి గురించి ఎవరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారు తరువాతి భాగంలో చూడండి..

చిత్రకేతూపాఖ్యానం రెండవ భాగం

ఏకైక పుత్రుడు, చక్కగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వంశకర్త (వంశోద్దారాకుడు). మహర్షి వరం వలన జన్మించాడు. విగతజీవుడై ఉండడం చూసి తల్లిగుండే తల్లడిల్లి పెద్దగా ఏడ్చింది. కుంకుమ పూతతో ఎర్రనై చక్కనైన వృక్షోజ ధ్వజం కాటుక కన్నీటితో తడిసి పంకిలములు కాగా పట్టపురాణి కృతద్యుతి కంకణాలు ఘల్లుఘల్లుమని మ్రోగగ, చిగురుటాకుల వంటి కరములతో రొమ్ములు మోదించుకొనుచూ,కోకిల వంటి కంట స్వరంతో భోరుభోరున విలపించింది. ఆ ఆర్థనాదమునకు భూనాయకుడైన చిత్రకేతుడు భయపడి రయమున పరిగెత్తుకొని వచ్చి కుమారుని మృతశరీరం మీద పడి'' నాయనా! నీ మరణవార్త ఒక్కమాటుగా నన్ను కూలద్రోయకుండా ఎందుకు బ్రతికించింది? ఈ దుఃఖాన్ని నేనట్లా భరించాలి? నేనెలా బ్రతికుండేది? నీ కన్నతల్లి కడుపుకోత ఎలా తీరుతుంది? అంటూ తలా మొల ఎరుగకుండా పరిపరివిధాల దుఃఖావేశంతో భ్రుత్యులు, అమాత్యులు, బంధుజనంతో కూడి ఉన్న ఆరాజు దుఃఖం తెలుసుకొని అంగీరసుడు నారదుడితో కూడి వచ్చి మృతుడైన పుత్రుడి పాదాల వద్ద మృతుడి ;వలె పడిఉన్న ఆ రాజును చూసి ఇలా అన్నాడు.

నీకు వీడికి సంబంధం ఏమిటి?? నీకు ఏమౌతాడని ఇతడికోసం ఇంతగా దుఃఖిస్తూ ఉన్నావు? ఈ సంతాపమెందుకు సార్వభౌమ? ఈ పుత్రులు మిత్రులు పూర్వజన్మలో ఎవరికి పుత్రులో మిత్రులో నీకు తెలుసునా? నదిలోని ఇసుకరేణువులు ప్రవాహ వేగానికి కొట్టుకొని పోతూ, మధ్యమధ్యలో కుప్పలుగా కలుస్తూ విడిపోతూ ఉంటాయి. అదేరీతిగా చరాచర జగత్తులోని సకల ప్రాణులు కాలమనే ప్రవాహంలో పుట్టడం, చావడం, కలుస్తూ విడిపోతూ ఉంటారు. దేహధారులకు జనన మరణాలు తప్పవు. ఇది విష్ణుమాయా విలాసం. ఈ మాయవలనే జీవులకు జీవులు జన్మిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఏడవడం ఎందుకు? ఈవిషయంలో దైన్యం పొందడం, ధైర్యం కోల్పోవడం తగదు. కాలగతిని తెలుసుకో
..
అంతేకాదు! నీవు నేను, తక్కినవారందరూ ప్రస్తుత కాలంలో కాలకర్మం వలన కలిగిన జన్మను పొంది, మృత్యువు వలన విరామం పొందినవారమై ఇప్పుడు కలిసి ఉన్నవారం అప్పుడు కలిసి ఉండము. కనుక ఈ జనన మరాణాదులు అన్నావు యదర్థాలు కావు. ఈశ్వరుడు తన మాయచేత జీవులకు జీవులను పుట్టిస్తూ ఉంటాడు. వారిని ఆ జీవుల చేతనే రక్షించుచూ, వారిని ఆభూతముల చేతనే హరిస్తూ ఉంటాడు. స్వతంత్రం లేని తన సృష్టి చేత రక్షించ బడుతున్నావు. బాలకుడు ఆటలాడినంత సేపు ఆడుకొని మరుక్షణంలో ఆపేక్షమాని మరొక ఆట ఆడుకుంటాడు. అలాగే ఈశ్వరుడు కూడా జీవులతో క్రీడిస్తూ ఉంటాడు. దేహధరుడైన పితరుడి దేహం చేత దేహధారియైన పుత్రదేహం మాతృమూర్తి దేహం వలన పుట్టుచూ ఉంటుంది. ఈ ప్రకారంగా బీజం వలన బీజములు పుడుతూ ఉంటాయి. అదే విధంగా దేహధారులైన వారి విషయంలో ఈధర్మమ్ శాశ్వతంగా జరుగుతూ ఉంటుంది. మునుపు ఒక వస్తువుపై అనేక భావాలు కలిగినట్లుగా దేహానికి, జీవునికి పరస్పర బేధం కల్పించబడింది. మండుతున్న అగ్ని ఆయా స్థానాలలో వేరువేరు రీతులుగా కనబతున్నట్లు జీవుడు ఆయా జన్మలను బట్టి అనేకరీతులుగా కనిపిస్తూ ఉంటాడు. దేహికి దేహానికి గల బేధం అజ్ఞాన కల్పితం. మనం స్వప్నంలో భయంకరమైన దృశ్యాన్ని చూసి భయకంపితులమౌతాము. మెలకువ రాగానే అది పీడకల అని, అవి మనకి సంబంధించినవి కావు అని తెలుసుకుంటాం. అదేవిధంగా జ్ఞాని యైనవాడు ఈ బాధలు బంధాలు బంధుత్వాలు శాశ్వతం కాదని నిజం కాదని గ్రహిస్తాడు. కావున అన్నియును మనోభ్రాంతి అని తెలుసుకొని అజ్ఞానమనే అంధకారం నుండి వెలువడి, మోహమనే తామస గుణాన్ని వదలుకొని భగవంతుడైన వాసుదేవుని యందు నిర్మలాత్ముడవై చిత్తము నిలుపుము. అని చెప్పిన వారితో చిత్రకేతుడు ఇలా అన్నాడు.

''అయ్యా! మునీంద్రుల వేషములు ధరించి రహస్యంగా ఇచ్చటికి విచ్చేసిన మీరు ఎవరు? నావంటి మందబుద్ధులైన వారికి జ్ఞానం ఉపదేశించడానికి వచ్చిన పున్యమూర్తులా? సనత్కుమారులా, నారద ఋషులా?ఆసిత దేవతలనే ధీరమణులా? వ్యాస, వశిష్ఠ, దుర్వాస, మార్కండేయ, గౌతమ, శుక, రామ, కపిల, మునులా? యాజ్ఞవల్క్యుడు, దరణి, ఆరుణి, రోమశ, ఆసురి, జాతుకర్ణ, దత్త, మైత్రేయ, భరద్వాజ, పంచశిఖుడు, పరాశరుడు మొదలైన మహర్షుల? వీరలలో మీరు ఎవ్వరు? సుర, సిద్ధ, చారణ, గంధర్వ, సంఘములలోని వారా? ఇంతటి గోప్పజ్ఞానం మరెవ్వరికి ఉంటుంది? పశుత్వం కూడిన మొరటువాడినై మహా శోకమనే తాపమును పొందిన నాముందర దివ్యజ్ఞానాన్ని భోదింప వచ్చిన మీరేవ్వరో చెప్పండి.. అనగా అంగిరసుడు యిట్లనియె..

పుత్రకాంక్షతో ఉన్న నీకు పుత్రుడిని ప్రసాదించిన అంగిరసుడను.. యితడు బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు. తరింప శక్యం కాని పుత్రశోకంలో ఉన్న నీకు పరమజ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చాము. నీ దుఃఖాన్ని తెలుసుకొని మరలా నీకు పుత్రుడిని ప్రసాదించినప్పటికీ బిడ్డలు గలవారికి కలిగే దుఃఖం మరలా నీకు కలుగుతుంది,.

అని చెప్పి మ్రుతుడైన పుత్రుడిని మరల బ్రతికిస్తాడు. అప్పుడు ఆపుత్రుడు చెప్పే మాటలు అత్యంత అద్భుతంగా ఉంటాయి.. అవి తరువాతి పోస్టులో చుడండి.. మిస్ అవ్వద్దు..No comments:

Powered By Blogger | Template Created By Lord HTML