గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 March 2015

వరుణదేవుడు పడమటి దిక్కుకు దిక్పాలకుడు. ఈయన రాజధాని శ్రద్ధావతి. ఈయన ఆయుధం నాగపాశంవరుణదేవుడు పడమటి దిక్కుకు దిక్పాలకుడు. ఈయన రాజధాని శ్రద్ధావతి. ఈయన ఆయుధం నాగపాశం. ఈయన వాహనం మకరం మొసలి. వరుణుడు శ్వేతవర్ణుడు. ఈయన దేవేరి పేరు శ్యామలా దేవి. ఈయన జలాలకు (వర్షాలు, నదులూ, సముద్రాలూ ఇత్యాదులకు) అధిదేవత. వరుణుడిని దిక్పాలకులలో ఒకరుగా గుర్తించటమే తప్ప, ఆయనను ఒక దేవుడిగా భావించి, ఆలయాలు కట్టించి, విగ్రహాలు పెట్టించి, నిత్య పూజలు చేయటం అనేది లేదు. కానీ, అనావృష్టి, కరువు కాటకాలూ సంభవించిన ప్పుడు మాత్రం మొలబంటి నీటిలో నిలిచి, సామూహికంగా వరుణ జపాలు చేసి, వర్షాల కోసం ఆయన్ని ప్రార్థించటం ఉంది. అలాగే, జాలరులు వలలు విసిరేటప్పుడు ఆయనను స్మరించుకొంటారు.


వేద సూక్తాలు వరుణుడిని అందగాడుగా, శక్తిశాలిగా, మహిమాన్వితుడిగా అభివర్ణిస్తాయి. ఆయన విశ్వంలో నీతినీ, ధర్మాన్నీ, సత్యాన్నీ, ఋతాన్నీ పరిరక్షించే దేవత. సర్వసాక్షి. సర్వ వ్యాపి. ఆయనది చాలా నిశితమైన, సూక్ష్మ దృష్టి. ప్రాణుల అంతరంగాలలోకి కూడా చొచ్చి చూడగల దృష్టి. ఈ విశ్వంలో ఆయన చూపు దాటి వెళ్లే విషయమే లేదం టాయి వేదాలు. ‘మిత్రా వరుణులారా, మీ మాయా శక్తిని ఆశ్రయించుకొని అవకాశం నిలిచి ఉంది. మీ వల్లనే సూర్యుడి అద్భుత ప్రకాశం, సంచారం సాధ్యమవుతున్నాయి. మీ వల్లే పర్జన్యుడు తియ్యని జలధారలతో లోకాలకు ఆనందాన్ని ఇస్తున్నాడు’ అంటుంది ఋగ్వేదంలో ఓ సూక్తం. మిత్రావరుణుల జంటలో మిత్రుడు పగటి కాలానికి అధిదేవత అయితే, వరుణుడు రాత్రి కాలానికి అధిదేవత.

వరుణుడు సంతాన ప్రదాయకుడు కూడా! ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుడు వరుణుడిని బహు కాలం ఉపాసించి, సంతానం పొందిన కథ ఋగ్వేద బ్రాహ్మణంలోనూ, కొన్ని మార్పులతో దేవీ భాగవత పురాణంలోను కనబడుతుంది. ఆ కొడుకును, వరుణ యజ్ఞంలో వరుణుడికే బలి చేస్తానని ముందు ఒప్పు కొన్న హరిశ్చంద్రుడు, పుత్ర ప్రేమ వల్ల ఆ బలిని వాయిదా వేస్తూ వెళతాడు. చివరికి తన పుత్రుడి బదులు డబ్బుతో కొనుక్కొన్న శునశ్సేపుడు అనే క్షత్రియ పుత్రుడిని బలి చేయటానికి సిద్ధపడతాడు. శునశ్సేపుడు తనకు విశ్వామిత్రుడు ఉపదేశించిన వరుణ మంత్రం జపించి, వరుణుడిని ప్రసన్నం చేసు కొంటాడు. వరుణుడు చివరకు ఏ బలీ లేకుండానే హరిశ్చంద్రుడికి వరుణ యజ్ఞఫలం ప్రసాదించి అనుగ్రహిస్తాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML