గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 9 March 2015

శివరాత్రి లింగోద్భకాలంలో చదవవలసిన శ్లోకాలుశివరాత్రి లింగోద్భకాలంలో చదవవలసిన శ్లోకాలు
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
17-2-2015 న మహాశివరాత్రి . ఈ సారి లింగోద్భవకాలం రా.గం. 12-21 ని.ల నుండి 12-30 ని.ల వరకు. మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించినది అరుణాచలంలోనే. కనుక ఈ సమయంలో తప్పక అరుణాచలేశ్వరుని స్మరించాలి.
(అరుణాచలం గురించి ఇక్కడ చదవండి )

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

శివరాత్రి లింగోద్భకాలంలో తప్పక చదవవలసిన శ్లోకాలు

1) లింగోద్భవ మూర్తి ధ్యాన శ్లోకం

దేవమ్ గర్భగృహస్య మానకలితే లింగే జటాశేఖరమ్
కట్యాసక్తకరమ్ పరైస్చ తతతమ్ కృష్ణమ్ మృగమ్ చాభయమ్|
సవ్యే టంకమమేయ పాదమకుటే బ్రహ్మాచ్యుతాభ్యామ్ యుతమ్
హ్యూర్ధ్వాతస్థిత హంసకోలమమలమ్ లింగోద్భవమ్ భావయే||

అరూప రూపి అగు జ్యోతి స్వరూప లింగావిర్భావము జరిగిన ఈ నాడు ఆ పరమేశ్వరుని వద్ద ఈ స్తోత్రము చేయడం ఉత్తమం. ఈ స్తోత్రముని పరమేశ్వరుని వద్ద రోజూ విన్నవించుకొనవచ్చు.

లింగోద్భవ కాలంలో జ్యోతి స్వరూపునిగా శివుని ఒక దీపాన్ని కానీ, కర్పూర దీపాన్ని కానీ చూస్తూ అందులో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి (సరిగ్గా మధ్య రాత్రి సమయంలో)

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః|
దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాహి విప్రాః||

2) వశిష్ఠ కృత శివ లింగ స్తుతి (అగ్నిపురాణం) : పూర్వము వశిష్ఠమహర్షి శ్రీపర్వతముపైన (శ్రీశైలమందు) శంభుదేవుని ఈ పైని స్తోత్రముతో స్తుతించగా, శంభుడు అనేక వరములను, శుభములను ఇచ్చి అచటనే అంతర్థానమయ్యెను.

నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః - నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః||
నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః - నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః||
నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః - నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే||
నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే - నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః ||
నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః - నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే నమః ||
పురుష లింగాయ భావ లింగాయ వై నమః - నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః ||
నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే నమః - అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః ||
నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః - నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః ||
నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః - నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే ||
దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా - బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో ||
అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ ||

కనక లింగమునకు నమస్కారము, వేదలింగమునకు, పరమ లింగమునకు, ఆకాశ లింగమునకు, సహస్ర లింగమునకు, వహ్ని లింగమునకు, పురాణ లింగమునకు, వేద లింగమునకు, పాతాళ లింగమునకు, బ్రహ్మ లింగమునకు, సప్తద్వీపోర్థ్వ లింగమునకు, సర్వాత్మ లింగమునకు, సర్వలోక లింగమునకు, అవ్యక్త లింగమునకు, బుద్ధి లింగమునకు, అహంకార లింగమునకు, భూత లింగమునకు, ఇంద్రియ లింగమునకు, తన్మాత్ర లింగమునకు, పురుష లింగమునకు, భావ లింగమునకు, రజోర్ధ్వ లింగమునకు, సత్త్వ లింగమునకు, భవ లింగమునకు, త్రైగుణ్య లింగమునకు, అనాగత లింగమునకు, తేజో లింగమునకు, వాయూర్ధ్వ లింగమునకు, శ్రుతి లింగమునకు, అథర్వ లింగమునకు, సామ లింగమునకు, యజ్ఙాంగ లింగమునకు, యజ్ఙ లింగమునకు, తత్త్వ లింగమునకు, దైవతానుగత లింగ స్వరూపము అగు శివునికి, సర్వరూపములలో సకలము తానై ఉన్న లింగ స్వరూపుడైన శంభుదేవునకు పునః పునః నమస్కారము|

ప్రభూ! నాకు పరమయోగమును ఉపదేశించుము, నాతో సమానుడైన పుత్రుడనిమ్ము, నాకు అవినాశి యగు పరబ్రహ్మవైన నీ యొక్క ప్రాప్తిని కలిగించుము, పరమ శాంతినిమ్ము, నావంశము ఎన్నటికీ క్షీణము కాకుండుగాక, నా బుద్ధి సర్వదా ధర్మముపై లగ్నమైఉండుగాక.

ఇది వశిష్ఠ కృతమైనా దీనిని ఎవరు చదువుతే వారు స్వామికి చెప్పుకున్నట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ స్తోత్రంలో అడిగిన చిట్టచివరి కోరిక మనం అందరం ప్రతిరోజూ ప్రతిక్షణం భగవంతుని పెద్దలను కోరవలసినదే.

3)లింగోద్భకాలంలో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగ స్తుతి

అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!

4) శివపురాణాంతర్గత రుద్రాధ్యాయసార స్తోత్రం : రుద్రం చదవలేకపోయినా ఈ క్రింది స్తోత్రం పఠిస్తే రుద్రం చదివినదానితో సమానం. ప్రతినిత్యం రుద్రాభిషేకంలో ఇది చదివినచో నమక చమకాలతో రుద్రుని అభిషేకించినట్లే! రుద్రం అందరూ చదవకూడదు. ఇది ఎవరైనా చదవవచ్చు.

II విష్ణు ఉవాచః II
నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే I
కపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః II
త్వం హి విశ్వసృపాం స్రష్టా ధాతా తవం ప్రపితామహః I
త్రిగుణాత్మా నిర్గుణశ్చ ప్రకృతైః పురుషాత్పరః II

నమస్తే నీలకంఠాయ వేధసే పరమాత్మనే I
విశ్వాయ విశ్వబీజాయ జగదానన్దహేతవే II
ఓంకారస్త్వం వషట్కార స్సర్వారంభ ప్రవర్తకః I
హన్తకారస్స్వధాకారో హవ్యకవ్యాన్నభుక్ సదా II

నమస్తే భగవన్ రుద్ర భాస్కరామితతేజసే I
నమో భవాయ దేవాయ రసాయాంబుమయాయ చ II
శర్వాయ క్షితిరూపాయ సదా సురభిణే నమః I
రుద్రాయాగ్నిస్త్వరూపాయ మహాతేజస్వినే నమః II

ఈశాయ వాయవే తుభ్యం సంస్పర్శాయ నమో నమః I
మహాదేవాయ సోమాయ ప్రవృత్తాయ నమోఽస్తు తే II
పశూనాం పతయే తుభ్యం యజమానాయ వేధసే I
భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః II

ఉగ్రాయ సూర్యరూపాయ నమస్తే కర్మయోగినే I
నమస్తే కాలకాలాయ నమస్తే రుద్ర మన్యవే II
నమః శివాయ భీమాయ శంకరాయ శివాయ తే I
ఉగ్రోఽసి సర్వభూతానాం నియంతా యఛ్చివోఽసి నః II

మయస్కరాయ విశ్వాయ బ్రహ్మణే హయార్తినాశనే I
అంబికాపతయే తుభ్యముమాయాః పతయే నమః II
శర్వాయ సర్వరూపాయ పురుషాయ పరమాత్మనే I
సదసద్వ్యక్తిహీనాయ మహతః కారణాయ తే II

జాతాయ బహుధా లోకే ప్రభూతాయ నమో నమః I
నీలాయ నీలరుద్రాయ కద్రుద్రాయ ప్రచేతసే II
మీఢుష్టమాయ దేవాయ శిపివిష్టాయ తే నమః I
మహీయసే నమస్తుభ్యం హన్త్రే దేవారిణాం సదా II

తారాయ చ సుతారాయ తరుణాయ సుతేజసే I
హరికేశాయ దేవాయ మహేశాయ నమో నమః II
దేవాయ శంభవే తుభ్యం విభవే పరమాత్మనే I
పరమాయ నమస్తుభ్యం కాలకంఠాయ తే నమః II

హిరణ్యాయ పరేశాయ హిరణ్య వపుషే నమః I
భీమాయ భీమరూపాయ భీమకర్మరతాయ చ II
భస్మాదిగ్ధశరీరాయ రుద్రాక్షాభరణాయ చ I
నమో హ్రస్వాయ దీర్ఘాయ వామనాయ నమోఽస్తు తే II

దూరేవధాయ తే దేవాగ్రేవధాయ నమో నమః I
ధన్వినే శూలినే తుభ్యం గదినే హలినే నమః II
నానాయుధధరాయైవ దైత్యదానవనాశినే I
సద్యాయ సద్యరూపాయ సద్యోజాతాయ వై నమః II

వామాయ వామరూపాయ వామనేత్రాయ తే నమః I
అఘోరాయ పరేశాయ వికటాయ నమో నమః II
తత్పురుషాయ నాథాయ పురాణపురుషాయ చ I
పురుషార్ధప్రదానాయ వ్రతినే పరమేష్ణినే II

ఈశానాయ నమస్తుభ్యమీశ్వరాయ నమో నమః I
బ్రహ్మణే బ్రహ్మరూపాయ నమః సాక్షాత్పరాత్మనే II
ఉగ్రోఽసి సర్వదుష్టానామ్ నియంతాసి శివోఽసి నః I
కాలకూటాశినే తుభ్యం దేవాద్యవనకారిణే II

వీరాయ వీరభద్రాయ రక్షద్వీరాయ శూలినే I
మహాదేవాయ మహతే పశూనాం పతయే నమః II
వీరాత్మనే సువిద్యాయ శ్రీకంఠాయ పినాకినే I
నమోఽనంతాయ సూక్ష్మాయ నమస్తే మృత్యుమన్యవే II

పరాయ పరమేశాయ పరాత్పరతరాయ చ I
పరాత్పరాయ విభవే నమస్తే విశ్వమూర్తయే II
నమో విష్ణుకళత్రాయ విష్ణుక్షేత్రాయ భానవే I
భైరవాయ శరణ్యాయ త్ర్యంబకాయ విహారిణే II

మృత్యుంజయాయశోకాయ త్రిగుణాయ గుణాత్మనే I
చంద్రసూర్యాగ్నినేత్రాయ సర్వకారణహేతవే II
భవతా హి జగత్సర్వం వ్యాప్తం స్వేనైవ తేజసా I
బ్రహ్మవిష్ణ్వింద్రచంద్రాది ప్రముఖాః సకలాస్సురాః II

మునయశ్చాపరే త్వత్తసంప్రసూతా మహేశ్వర I
యతో బిభర్షి సకలం విభ్యజ్య తనుమష్టధా II
అష్టమూర్తిరితీశశ్చ త్వమాద్యః కరుణామయః I
త్వద్భయాద్వాతి వాతోఽయం దహత్యగ్నిర్భయాత్తవ II

సూర్యస్తపతి తే భీత్యా మృత్యుర్భీతావతి సర్వతః I
దయాసింధో మహేశాన ప్రసీద పరమేశ్వర II
రక్ష రక్ష సదైవాస్మాన్ యస్మాన్నష్టాన్ విచేతసః I
రక్షితాస్సతతం నాథ త్వయైవ కరుణానిధే II
నానాపద్భ్యో వయం శంభో తవైవాద్య ప్రపాహి నః II
II ఇతి శివమహాపురాణే రుద్రసంహితాయాం సతీఖండే రుద్రాధ్యాయసార స్తోత్రం సంపూర్ణమ్ II

5) వేద సార శివ స్తోత్రం – ఆదిశంకారాచార్య

పశూనాం పతిం పాపనాశం పరేశం, గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం, మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 ||
మహేశం సురేశం సురారాతినాశం, విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |
విరూపాక్షమింద్వర్క వహ్ని త్రినేత్రం, సదానందమీడే ప్రభుం పంచవక్త్రం || 2 ||
గిరీశం గణేశం గళే నీలవర్ణం, గవేంద్రాధిరూఢం గుణాతీత రూపం |
భవం భాస్వరం భస్మనాభూషితాఞ్గం, భవానీకలత్రం భజే పంచవక్త్రం || 3 ||
శివాకాంతశంభో శశాంకార్థమౌళే, మహేశాన శూలిన్జటాజూటధారిన్ |
త్వమేకోజగద్వ్యాపకోవిశ్వరూపః, ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || 4 ||
పరాత్మానమేకం జగద్బీజమాద్యం, నిరీహం నిరాకారమోంకారవేద్యం |
యతోజాయతే పాల్యతే యేన విశ్వం, తమీశం భజే లీయతే యత్ర విశ్వం || 5 ||
నభూమిర్నచాపో నవహ్నిర్నవాయుః, నచాకాశమాస్తే న తంద్రా ననిద్రా |
నచోష్ణం నశీతం నదేశో నవేశో, నయస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || 6 ||
అజం శాశ్వతం కారణం కారణానాం, శివం కేవలం భాసకం భాసకానాం |
తురీయం పారమాద్యంతహీనం, ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం || 7 ||
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే, నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య, నమస్తే నమస్తే శృతిఙ్ఞానగమ్య||8||
(అష్ట నమస్కార శ్లోకం)
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ, మహాదేవశంభో మహేశ త్రినేత్ర |
శివాకాంతశాంతస్స్మరారే పురారే, త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || 9 ||
శంభో మహేశ కరుణామయ శూలపాణే, గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకః, త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి || 10 ||
త్వత్తో జగద్భవతి దేవ భవస్స్మరారే, త్వయ్యేవతిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవగఛ్ఛతి లయం జగదేతదీశ, లిఞ్గాత్మకే హర చరాచర విశ్వరూపిన్ || 11 ||

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML