గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 1 March 2015

భగవత్ సాక్షాత్కారమునకు సాధనా మార్గము గలడు. తన యిష్టదైవ స్వరూపమును విగ్రహ రూపమున గాని, చిత్రపట రూపమున గాని తన ముందుంచుకొని సాధకుడు ఆరాధింపవలెను

భగవత్ సాక్షాత్కారమునకు సాధనా మార్గము గలడు. తన యిష్టదైవ స్వరూపమును విగ్రహ రూపమున గాని, చిత్రపట రూపమున గాని తన ముందుంచుకొని సాధకుడు ఆరాధింపవలెను. ఆ ఆరాధన సమయమునందే ఏకాంతముగా ప్రతి దినము నియమ పూర్వకముగా ధ్యానించుచు ఆ స్వరూపమును దృఢముగా చిత్తమునందు నిలుపుకొన వలెను. కొంత ధారణ ఏర్పడిన పిమ్మట ఏకాంతమున కూర్చొని, కనులు తెరచి, ఆకాశమున మానసిక మూర్తిని ఏర్పరచుకొని, దానిని చూచుచు సాధన చేయవలెను. భగవదనుగ్రహమును గోరుచు దృఢమైన భక్తి శ్రద్ధా విశ్వాసములతో నిరంతరమూ సాధన చేసినచో కాలక్రమమున ఆకాశామునండు సర్వాంగ శోభలతో భగవంతుడు వానికి దరహాసముతో దర్శనమిచ్చును. ఈ సాధన సాధ్యమే. సాధకుడు తన చిత్తవృత్తులను ఇష్టదైవ స్వరూపములో పరిపూర్ణము గావించి అనన్య భావముతో ఆ స్వరూపమునే చింతన చేయుచుండవలెను. ఆ స్థితిలో దయాళువైన భగవంతుడు సాధకునకు కోరిన రూపమున కోరిన చోట దర్శనమిచ్చుచుండును. ఈ సాధన బలపడిన పిమ్మట సాధకుడు అటునిటు తిరుగుచున్నాను, మనుష్యులయందును, పశుపక్ష్యాదులయందును, లతలయండును, వృక్షములయందును, భగవత్స్వరూపమునే చూచుచుండవలయును. ఈ విధమైన సాధనను చేయగా చేయగా ప్రతి వస్తువునందును, ఆ వస్తుస్థానమునందును, మానసికముగా గూడ సాధకుడు తన ఇష్టదైవ స్వరూపమును సులభముగా చూడగలడు. అనంతరము భగవత్కృపా ప్రభావమున ఆతనికి ప్రత్యక్షముగా దైవదర్శనము సిద్ధించును. అతడు సర్వత్ర సర్వదా భగవంతుని దర్శింపగలడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML