గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 March 2015

పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి వర్ధంతి = ఫాల్గుణ బహుళ ద్వాదశి.

పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి వర్ధంతి నేడు -ఫాల్గుణ బహుళ ద్వాదశి.
తెలుగు సాహిత్యంలో "పదకవితా పితామహుడి'గా ప్రసిద్ధికెక్కిన అన్నమయ్య నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు శ్రీ సర్వధారి నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి (క్రీ.శ. 1408 మే 9) నాడు కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా పసితనం నుండే అన్నమయ్య తిరుమలేశుని భక్తుడు 8 ఏళ్ళవయసులోనే కొండ ఎక్కుతూ ఆశువుగా 'మంగాంబికా శతకం' పాడాడు. కొండపైకి చేరి స్వామినీ, ఇతర దేవీ దేవతలనూ దర్శిస్తూ 'వేంకటేశ శతకం' పాడాడు.
టంగుటూరుని ఏలుతున్న సాళువ నరసింగ రాయుడు అన్నమాచార్యుని గొప్పదనం, అతనికి గల ఆధ్యాత్మిక శక్తి గురించి తెలిసి, తన ఆస్థానంలో గురువుగా ఉండమని కోరాడు. అన్నమయ్య అందుకు అంగీకరించాడు. ఒకరోజు అన్నమాచార్య పాడిన మధుర భక్తికి సంబంధించిన పాట విన్న రాజుగారు తన్మయుడై అదేవిధమైన పాట ఒకటి తనను స్తుతిస్తూ పాడాల్సిందిగా కోరాడు. తాను భగవంతుడి వైభవాన్ని చాటే పాటలే తప్ప మానవ మాత్రులను పొగడను అనడంతో రాజు అహం దెబ్బతింది. పట్టరాని కోపం వచ్చింది. వెంటనే అన్నమయ్యను గొలుసులతో బంధించి కారాగారంలో పెట్టించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామిని తలచుకుంటూ ఒక పాట పాడాడు. వెంటనే గొలుసులు తెగిపోయాయి. రాజు తనను క్షమించాల్సిందిగా అన్నమయ్యను వేడుకొన్నాడు. భక్తులను అవమానించడం తగని పని అని రాజుకు సలహా ఇచ్చి సంకీర్తనల ద్వారా భగవంతుడి మహిమలను చాటి చెప్పడానికి తిరుపతి వెళ్ళిపోయాడు అన్నమయ్య.
అన్నమయ్య తన జీవితకాలం (95ఏళ్ళు)లో 32,000 సంకీర్తనలు రచించి పాడగా, నేడు 14,000 సంకీర్తనలే లభ్యమవుతున్నాయి. అన్నమయ్య తాళపత్రాల మీద వ్రాసిన ఆ సంకీర్తనలను ఆయన కుమారుడు తిరుమలాచార్య రాగి రేకులపైన చెక్కించాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML