గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 24 March 2015

వైకుంఠం ద్వారపాలకులుగా ఉండే జయవిజయులు ఒకనాడువైకుంఠం ద్వారపాలకులుగా ఉండే జయవిజయులు ఒకనాడు సనకసనందాది మునులు బాలకుల రూపంలో దిగంబరులుగా శ్రీవారిని దర్శించుకోవడానికి రాగా లోపలికి వెళ్ళనీయక అడ్డుకోగా ఆగ్రహించిన మహర్షులు జయవిజయులరా! ఈ వైకుంఠం సత్వగుణంతో ఉండాల్సిన మీరు రాజస్తమోగుణ ప్రదానులైన రాక్షసుల వలే ప్రవర్తించారు. కనుక మీరు వైకుంఠంలో ఉండడానికి అర్హులు కారు. భూలోకమందు రాక్షసులుగా జన్మించండి అని శపించారు. శాపానికి భయపడిన జయవిజయులు మునీశ్వరులని మన్నించమని వేడుకొనగా! వెన్నవంటి మనస్సు గల ఆ సనకసనందాదులు వారి ప్రార్థన మన్నించి మీకు మేము ఇచ్చిన శాపం మీరు అనుభవించక తప్పదు. మూడు జన్మలలో నారాయణునికి బద్ధవిరోదులై జన్మించి శాపాన్ని తొలగించుకుంటారు అని శాపవిమోచనం తెలిపి వెళ్ళిపోయారు. అలా వైకుంఠం నుండి భ్రష్టులైన జయవిజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు గాను, ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతవక్త్రులుగాను జన్మించి శ్రీహరి చేతిలో మరణించి ఆయనలోనే ఐఖ్యం అయ్యారు.

ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అనేకదా మీ సందేహం! సృష్టిలో రాక్షసులు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉంటారు అని మీ అంతట మీరు తెలుసుకోవాలంటే ఈ ఒక్క పద్యం తాత్పర్యం చదవండి తెలుస్తుంది..

మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా కశ్యపుడికి దితికి జన్మించారు.. వారిలో హిరణ్యాక్షుడు భూమిని పట్టుకొని పాతాళంలోకి వెళ్ళగా విష్ణుమూర్తి వరాహరూపం ధరించి హిరణ్యాక్షుడిని వధించాడు. ఈవిషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు శ్రీహరిపై మండిపడ్డాడు.

రాక్షసులారా! చూశారా! మీ ఆప్తమిత్రుడిని, అత్యంత బలాడ్యుడిని, ఆ వైకుంఠుడు, నారాయణుడు, ఆ శ్రీహరి హిరణ్యాక్షుడిని సంహరించాడు. అతడు ఎవరికీ చిక్కడు, ఎక్కడా కనబడడు. అన్నింటిలో వ్యాపించి ఉంటాడు. కాని ఎవ్వరితోను యుద్దానికి రాడు. కలహాభోజనుడు కాడు. వెదకడానికి దొరకదు. శత్రువులను సంహరిస్తాడు. ఎవరికైనా ఆపద కలిగితే తననితానే సృష్టించుకొని ఆపదలు తొలగిస్తాడు. వీడిని వెంటాడడం కష్టం. చూడడం కుదరదు. కనుక మనం వెంటపడకుండా అతడే మన వెంటపడేలా చేసి సంహరిద్దాం. కాబట్టి!

ప్రియమైన నా రాక్షస సోదరులారా! కదలండి.

సీ. పొండు దానవులారా! భూసురక్షేత్ర సంగతయైన భూమికి గములు గట్టి
మఖతపస్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదికి ఖండింపుడుఁ, విష్ణుఁ డనఁగ
నన్యు ఁడొక్కఁడు లేఁడు యజ్ఞంబు వేదంబు నతఁడే, భూదేవ క్రియాది మూల
మతఁడే, దేవర్షి పిత్రాది లోకములకు దర్మాధులకు మహాధార మతఁడే

తే. యే స్థలంబుల గో భూసురేంద్ర వేద వర్ణ ధర్మాశ్రమంబులు వరుస నుండు
ఆ స్థలములకెల్ల మీ రరిగి చెఱచి దగ్ధములు చేసి రండు మీ దర్ప మొప్ప. (భాగవతం. 7. 34)

దానవులారా! వెళ్ళండి! భుసురులైన బ్రాహ్మణులు ఉండే చోటికి గుంపులు గుంపులుగా వెళ్ళండి. యజ్ఞాలు, జపతాదులు, వేదాద్యయనాలు, మౌన వ్రతస్థులను వెదికి చంపండి. విష్ణువు కంటే అన్యుడు మరొక్కడు లేడు. యజ్ఞము అతడే, వేదము అతడే, బ్రాహ్మణులు చేసే యజ్ఞ, కర్మాది క్రియలకు మూలం అతడే, దేవలోకం, పితృలోకములకు, సర్వధర్మాలకు మహా ఆధారం అతడే. ఏయే స్థలము లందు గోవులు, బ్రాహ్మణులు, చతుర్విద వర్ణాశ్రమ నియమాలు క్రమంగా నడుస్తాయో ఆయా ప్రదేశములకు వెళ్లి వారు ఆచరించే ధర్మాలను చెఱచి, ద్వంసం చేసి మీదర్పం ఒసగెలా దగ్దం చేసి రండి.. అని విష్ణుమూర్తి స్వభావ స్వరూపాలు తెలిపగా హిరణ్యకశిపుడు నిర్దేశములు శిరసావహించి అనేకమంది రాక్షసులు భూతలమునకు వెళ్లి గ్రామాలు, నగరాలు, క్షేత్రాలు, పల్లెలు, వనాలు, భావనలను ఆశ్రమాలను భూడిద చేసి, వర్ణాశ్రమ ధర్మాలను మంటగలిపి, ప్రాకరాలను, గోపురాలను త్రవ్వి, వంతెనలను కూల్చి, పూలతో పళ్ళతో ఉండే వనములను నరికివేసి, చలిపందిళ్ళను, పర్ణశాలను పాడుచేసి, సాదువులను, గోవులను, బ్రాహ్మణులను హింసించి వేద సంప్రదాయాలను నాశనం చేసారు. ఈవిధంగా దైత్యులు అనేకవిధాలుగా ఉపద్రవాలు ఉత్పాతాలు కల్పించారు..

పైన చెప్పిన ఒక పద్యం వలన (2వ పద్యం రాయలేదు. కానీ దాని తాత్పర్యం మాత్రమే వ్రాశాను.) మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను.. రాక్షసులు చేసేపనులు చదివారు కదా! ఆనాడు ప్రత్యక్షంగా చేశారు. రాక్షసులు కూడా అప్పట్లో ప్రత్యక్షంగా ఉన్నారు. ఈనాడు అంటే ఈ కలియుగంలో మాములు మనవులలాగానే ఉండి అనేకరకాల ఉపద్రవాలు తీసుకొచ్చారు. తీసుకొస్తున్నారు. ఎలా అంటారేమో! ఆనాడు మహమ్మదీయులు దాడులు చేసి ఏమి చేసారో చారిత్రక ఆధారలుగా ఈనాటికి మిగిలిపోయిన అనేక గుర్తులు ఉన్నాయి.. అన్నిటిని కూలద్రోసి ద్వంశం చేసి, బ్రాహ్మణులను ఊచకోత కోశారు.. ఇప్పుడు ప్రస్తుతం మతమార్పిడి పేరుతొ వైదిక సంప్రదాయాలను నాశనం చేస్తున్నారు. అది కూడా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. కనుక మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.. మనుష్యులుగా కనిపిస్తున్నారు కదా అని ఎవరితో పడితే వారితో, వేళాపాళా లేకుండా టింగురంగా అంటూ తిరక్కండి. ఇలా తిరిగిన వారిలో మా మరదలు కూడా అన్యమతస్థులలొ కలిసిపోయి వర్ణాన్ని సంకరం చేసింది.. నిత్యం రాక్షసుల చేతిలో అనేక ఇబ్బందులు పడుతున్న అనేకమందిని మనం చూడవచ్చు. 1,3 తరగతులు చదివే పసిపిల్లని చాక్లెట్ ఇచ్చి 55ఏళ్ళ మృగం ఒకటి రాక్షసత్వంగా చెరిచింది.. డిల్లీలో జరుగుతన్న నిర్భయా లాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి. ప్రతి దాంట్లో కుట్రలే. రాజకీయం రౌడీయిజం అయింది. మంచితనానికి విలువలు తరిగిపోయాయి.. రాబోయే కాలాల్లో మనుష్యులు రోడ్లమీద తిరగాలంటే భయపడే రోజులు వస్తాయని భవిష్య పురాణం స్పష్టం చేస్తుంది. కనుక అప్రమత్తంగా ఉండండి/ నిత్యం హరినామ కీర్తన చేయండి.. కలియుగంలో దోషాలు మనకి తగలకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ''కలౌ కేశవ కీర్తనాత్'' హరినామం కీర్తనం, పురాణ శ్రవణం చేస్తే ఇలాంటి దోషాలు తగలవు.. అడ్మిన్ శ్రీకృష్ణ..

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML