గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 1 March 2015

రాబర్ట్ అర్నెట్రాబర్ట్ అర్నెట్
అమెరికా నుండి భారత్ కు వచ్చి, ఇక్కడ గొప్ప ఆధ్యత్మిక అనుభూతిని పొందిన "రాబర్ట్ అర్నెట్" అనే అమెరికన్ రాసిన పుస్తకం "ఇండియా అన్ వేయిల్డ్" నుంచి అనువదించిన కొన్ని సారాంశాలు: తప్పక చదవండి !

భారత ఉపఖండం నా కనుల ముందు ఆవిష్కరింపబడినది. నా జీవిత పరమార్ధాన్ని కనుగొన్నాను. నా జీవితమే మారిపోయింది. భారత దేశ యోగ శాస్త్రం, ఈ ప్రపంచానికి భారత్ నుండి లభించిన ఒక విలువైన బహుమతి! దానికి పాశ్చాత్య ప్రపంచం టెక్నాలజీని, భౌతికపరమైన సంపదను తిరిగి బహుమతిగా ఇచ్చినా సరిపోదు. ఈనాటికి దేవునితో ఐక్యం అవ్వాలి అని అనుకునే వారికి భారత దేశం ఎంతో స్పూర్తిని ఇస్తుంది. యోగ శాస్త్రం ద్వారా, మనం చేరుకోవల్సిన గమ్యానికి సులభంగా చేరుకోవచ్చును. అదే భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి. ఈ ప్రపంచంలో ఉండే అన్నీ దేశాలకంటే భారత దేశం ఆధ్యాత్మికత ప్రసాదించబడిన దేశం. చాలా మంది అమెరికన్లు భౌతికపరమైన ఆనందం శాశ్వత సంతృప్తి ఇవ్వదని తెల్సుకుంటున్నారు, వారందరు ఆధ్యాత్మిక అనుభూతి కోసం భారత దేశం వస్తున్నారు.


1988 డిసెంబరులో, నా గమ్యం భారత దేశం అని విధి చేత నిర్ణయింపబడింది. ఎటువంటి ఊహలు లేకుండానే భారత్ కు మూడు సార్లు రావడం జరిగింది. వచ్చినపుడల్ల ఆరు నెలలు ఉండడం జరిగింది. రెండవసారి వచ్చినపుడు, నా జెవితమే మారిపోయినది, భారత దేశం నా కనుల ముందు ఆవిష్కరింపబడినది మరియు నా జీవిత పరమార్ధం నాకు తెలిసినది.

నా యాత్రలలో కనుగొన్నది: హిందు విలువలు భారత సమాజంలో చాలా లోతుగా చొచ్చుకోబడి ఉన్నవి.

కొన్ని వేల సంవత్సరాలు అయినా, భారతీయ సంస్కృతి మూల స్తంభాలలో కేవలం కొన్ని మార్పులు వచ్చాయి, బహుశా అందుకేనేమో చరిత్రకారులు భారతీయ నాగరికత ఈ ప్రపంచం లో అన్నిటకంటే ప్రాచీనమైనదని, అంతరించిపోకుండా ఇంకా బ్రతికేఉందని విశ్వసిస్తారు. భారత దేశం 300 సంవత్సరాల మొగల్ దాడులను ఎదురుకొన్నపటికి, పాశ్చాత్య ప్రభావమైన భౌతికవాదం దేశంలోని మధ్య తరగతి కుటుంబాలపై పడకుండా భారతీయ సంస్కృతి తట్టుకోగలదా అని నేను ఆశ్చర్యపోయాను. కాని ఇప్పుడు నాకు అర్థమైనది అది వాస్తవం కాదు. భారత దేశనికి పాశ్చాత్య విజ్ఞనాన్ని తన్సంస్కృతిత్లో సదృశ్యపరుచుకునే సామర్ద్యం ఉండడమే కాకుండా, ఇంకా బలోపేతం కూడా అవ్వగలదు.

హిందు ధర్మం: పాశ్చాత్యుల చేత తప్పుగా అర్థం చేసుకోబడినది.

చాల మంది పాశ్చాత్యులు హిందు ధర్మం ఏకేశ్వరవాద ధర్మం అని, సృష్టికర్త కాలానికి, రూపానికి అతీతమైన వాడు అని అర్థం చేసుకోలేకపోతున్నారు. వివిధ రకాల హిందు దేవీ దేవతలు కనిపించని ఆ పరమాత్మ యొక్క వివిధ రకాల విశేష చిహ్నాలు. పరమాత్మను చేరుకొనుటకు ఆయనలో కలిగిఉండే అశెష గుణాలను ఒక్కొక దేవునిగా హిందు ధర్మం సృష్టించింది. ననెను కొన్ని పల్లెలలో గమనించాను, చాల మంధి కృష్ణ భక్తులైన ఆడవారు బాలకృష్ణ రూపాన్ని కొలుస్తున్నారు. నిస్సందేహంగా వారికి అలా బాల కృష్ణిడిని కొలవడం ద్వారా భగవంతునితో మాతృప్రేమను పంచుకుంటున్నారు.

హిందు ధర్మం- ఎంతో సహనంగల ధర్మం

హిందు ధర్మం కేవలం ఒకడే దేవుడు ఉన్నడు అని చెప్పదు. హిందు ధర్మ పవిత్ర గ్రంథాలలో ఒకటి అయిన ౠగ్వేదం ఇలా చెబుతుంది: " మానవుడు వివిధ పేర్లతో పిలిచినా, పరమాత్మ ఒకడే" భగవంతుడు ఎన్నో సార్లు భూమి మీద అవతరించాడు అని కూడా హిందు ధర్మం చెబుతుంది. భగవంతుడు మానవునిగా జన్మించడాన్ని ఒక అవతారం అంటారు.

హిందువులు తమ దైనందిన జీవితంలో దేవునితో సంగతమైయుంటారు.

నాకు తెలిసి మరే సంస్కృతిలోను, హిందువులు దేవునితో సంగతం అయినట్టు ఇంకెవ్వరూ అవ్వరు. హిందువులు దేవుడు అంటే ఎంతో లోతు భక్తి, ప్రత్యేకంగా ఆడవారికి అయితే పుట్టుకతోనే దేవుడు అంటే చాలా భక్తిని కలిగి ఉంటారు. ఆలయాల్లో దేవునికి అన్నీ సేవలు అయిపోయిన తరువాత పూజారి ఒక జ్యోతిని భక్తుల వద్దకు తీసుకువస్తారు, భక్తులు ఆ జ్యొతిని భగవంతునిగా భావించి, దానిని కనులు అద్దుకొని భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అనే అనుభూతితో తమ తలపై పెట్టుకుంటారు. ఆడవరు అయితే చిన్న పిల్లలవలే దేవుని చూచుటకు ఎంతో ఉత్సాహంతో వెళ్తారు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML