గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 26 February 2015

ఓ భారతీయుడా ? ఒక్కసారి తెలుసుకో మన దేశపు గొప్పదనం ..

ఓ భారతీయుడా ? ఒక్కసారి తెలుసుకో మన దేశపు గొప్పదనం ..
************************************************************

నాగరికత లేక ప్రపంచం అల్లాడుతున్నప్పుడు….విజ్ఞానం తెలియక నరులు పామరులై ఉన్నప్పుడు మన భారత దేశం సంపూర్ణ సాంకేతిక విజ్ఞానంతో విరాజిల్లింది. మన వేదాలు, మన పురాణాలు అందించిన జ్ఞాన సంపదను ఆసరాగా చేసుకొని భారతీయ ఋషులు శాస్త్ర, విజ్ఞాన రంగంలో అభుతాలు చేసి చూపించారు.


ప్రపంచానికి వైద్యం తెలియని ఆ కాలంలోనే సుశ్రుతుడు వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించాడు. ప్లాస్టిక్ సర్జరీ అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఈ వైద్య విద్యను సుశ్రుతుడు ఆనాడే యుద్దంలో గాయపడిన సైనికులకు నిర్వహించాడు.
విశ్వం, సౌర కుటుంబం, గ్రహాల గమనం వంటి ఖగోళ రహస్యాలను ఆర్యభట్ట ఆనాడే ప్రపంచానికి చాటి చెప్పాడు.
గణిత శాస్త్రంలో ఒక అద్భుతంగా చెప్పుకొనే పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా భారతీయులే.
మన రామాయణ కాలంలోనే పుష్పక విమాన ప్రయాణం గురించి మనం విన్నాం..
ఇప్పుడు రైట్ బ్రదర్స్ కనుక్కున్నారని చెప్పుకుంటున్న విమానం… వారికంటే ముందుగానే భారత్ లో 1895 లో శివకర్ బాపూజీ తాల్పడే అనే భారతీయ ఇంజనీర్ రూపొందించాడు. 1903లో రైట్ బ్రదర్స్ ఎగరేసిన విమానానికి మూలం తాల్పడే విమానమే అనేది నేటి ఆధునిక వైజ్ఞానికులు అంగీకరించిన సత్యం…
వీరే కాదు జగదీశ్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజన్, C.V. రామన్ వంటి అనేక మంది భారతీయ శాస్త్రవేత్తలు ఆధునిక భారత విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటారు.

ఇక నేడు జరగాల్సింది సంపూర్ణ ఆధునిక భారతీయ వైజ్ఞానిక వికాసం… మన పురాణాలు, వేదాలలో మహనీయులు చెప్పిన మహత్తర విశేషాలను ఆచరణలోకి తీసుకొచ్చి, ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞాన బోధ చేసిన భారత మాతను మళ్ళీ జగద్గురు స్థానంలో నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. భారత దేశ వైభవాన్ని తొక్కి పెట్టాలని భావించిన పాలకుల నుండి పాలకుల నుండి జాతీయ వాద భావాలున్న, మన ప్రాచీన జ్ఞాన సంపద మీద అపార గౌరవం ఉన్న దేశ భక్తుల పాలనలోకి దేశం నడిచింది. ఇక మన భారతాన్ని విశ్వ గురువుగా చూడాలని కలలు కన్న మహనీయుల కలలు నెరవేర్చాల్సిన సమయం… నెరవేర్చగల నిష్ఠా కలిగిన ప్రభుత్వ హయాంలోనే ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావాలని ఆశిస్తూ…. సగటు భారతీయుడు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML