గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 17 February 2015

మన వైదిక సంవత్సర పంచాంగములో అత్యున్నత ప్రాధాన్యత కలిగినది మాఘమాసములోని మహాశివరాత్రి.

మన వైదిక సంవత్సర పంచాంగములో అత్యున్నత ప్రాధాన్యత కలిగినది మాఘమాసములోని మహాశివరాత్రి. ఆనాడు అమావాస్యకు ముందుగా చంద్రునిలోమిగిలిపోయిన రెండు కళలు జీవునికి మోక్షసాధకమగు విధి సూచకము. అవి కాలాంత సంధ్యాసమయ ప్రతీకలు. దీనిని ప్రతిజీవుడు భూలోక స్థితియందు, తనకిక వేరుకర్తవ్యమేమీ లేదనీ, స్వాత్మోద్ధరణ మాత్రమే కర్తవ్యమనీ గ్రహించి, ఇతరవిషయములు వర్జించి, ఏకాగ్రత సాధించి, మనోబుద్ధిచిత్తములను శివమయము చేసుకొని పూర్తి శాంతినిపొందుటకు అత్యంత అనుకూల సమయము. అనగా మనస్సును శూన్యము చేసుకొనుట. అదే జీవన్ముక్తి. మనః కారకుడగు చంద్రుడు ఆత్మకారకుడగు సూర్యునిచేరుటకు సిద్ధపడుట ఇందలి రహస్యము. అందువలననే "జన్మకొక్క శివరాత్రి చాలునని" పెద్దల నానుడి.
మనమందరము లౌకిక జిజ్ఞాసను యథాశక్తిగా విరమించి, శివధ్యాన పరాయణులమగుచూ, స్వకీయ జీవస్వార్థ కర్తవ్యములను పాటించుటకు ఈ మహాపర్వదినమందు ప్రయత్నము చేయుదుముగాక. అట్లుకానిచో ఈ మహాపర్వమునందు ఉపవాసము, పంచాక్షరీజపము, రుద్రాభిషేకములు మనందరికీ పవిత్ర కర్తవ్యము. ఇది ఇహలోకమందు శుభప్రదము.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML