గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 2 February 2015

సోమకాంతుడనే రాజు సౌరాష్ట్ర దేశాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. అతని భార్య "సుధర్మ" సార్థక నామధేయురాలు.సోమకాంతుడనే రాజు సౌరాష్ట్ర దేశాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. అతని భార్య "సుధర్మ" సార్థక నామధేయురాలు. కొడుకు హేమంకరుడు. ఆ రాజుకు కుష్ఠువ్యాధి సంక్రమించింది. ఆ రాజు అధ్యాత్మిక చింతన ఉండడంవల్ల కొడుకుకు నిత్య నైమిత్తిక ధర్మాలను తెలిపి (ఇవి చాలా వివరంగా చెప్పబడ్డాయి.), రాజ్యాన్ని అప్పజెప్పి, భార్యతో సహా అడవులకు పయనమయ్యాడు. ఒకనాడు భృగుమహర్షి పుత్రుడైన చ్యవన మహర్షి ఆ దంపతులపై జాలిపడి భృగుమహర్షి ఆశ్రమానికి తీసుకురాగా భృగు మహర్షి వారికి అభయాన్నిచ్చాడు. రాజు యొక్క ఈ బాధకు కారణాన్ని భృగు మహర్షి తన దివ్య దృష్టితో తెలుసుకుని ఈ విధంగా చెప్పనారంభించాడు.


ఈ రాజు పూర్వ జన్మలో "కామందుడు" అనే వైశ్యుడు. అతని భార్య కుటుంబిని. వారికి 7గురు పుత్రులు, 5గురు పుత్రికలు. కామందుడు సప్తవ్యసనాలకు బానిస అయి, రాజు చేత దేశ బహిష్కరణకు గురి అయ్యేడు. అక్కడ కూడా పిల్లలను, స్త్రీలను హింసిస్తూ, దొంగతనాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవించసాగాడు. ఒకనాడు గుణవర్ధనుడనే కొత్తగా పెళ్ళి అయిన బ్రాహ్మణకుమారుడు ఎంత వేడుకున్నా వినకుండా చంపివేసాడు. క్రమంగా వృద్ధాప్యం వచ్చింది. తను చేసిన పాపాలన్నీ ఒకేసారి తలచుకొని బాధపడ్డాడు. తను అనుభవించగా మిగిలిన ధనాన్ని దానం చేయడానికి బ్రాహ్మణులను పిలిచాడు. కానీ అక్రమంగా ఆర్జించిన ఆ ధనాన్ని పుచ్చుకోడానికి బ్రాహ్మణులు నిరాకరించారు. దానికి విచారిస్తూ వెళ్తున్న కామందునికి శిథిలావస్థలోనున్న ఒక దేవాలాయం కంటబడింది. తన యదార్థ స్థితి గుర్తించి, సద్భుద్ధి కలిగి దానిని ఉద్ధరించాడు. అది గణేశుని పరామూర్తి కొలువై ఉన్నా దేవాలయం. కొంతకాలనికి మరణించగా యమ ధర్మరాజు తనతో "ముందుగా పుణ్యఫలాన్ని అనుభవించెదెవా..పాప ఫలమునా?" అని అడుగగా పుణ్య ఫలాన్నే కోరుకున్న ఆ కామందుడు రాజుగా జన్మించి భోగ భాగ్యాలు అనుభవించి పాప ఫలంగా ఇప్పుడు ఈ వ్యాధి సంక్రమించింది.

ఇదంతా విన్న రాజు మహర్షిని కరుణించమని వేడుకోగా..ఇన్ని పాపాలు చేసిన జీవునికి ఉత్తమగతి ఎలా కలుగుతుందా అని క్షణకాలం ధ్యానమగ్నుడై తరువాత ఇలా చెప్పాడు "ఇన్ని పాపాలను పోగొట్టే శక్తి శ్రీ గణేశ పురాణ శ్రవణానికి ఉంది. దానిని నీకు చెప్తాను. భక్తి శ్రద్ధలతో వినుమని" చెప్పి గణేశ అష్టోత్తర శతనామాలతో మంత్రించిన జలాన్ని ఆ రాజుపై ప్రోక్షించగా రాజుయొక్క ముక్కుపుటాలనుండి నల్లని ఆకారం గల పురుషుడు బయటకి వచ్చి క్షణాలలో భీకరాకారుడై 7 తాటిచెట్లంత ఎత్తుగలవాడై, భయంకరమైన కోరలతో, నోటినుండి అగ్నిజ్వాలలు, చీము, నెత్తురు వెళ్ళగ్రక్కుచూ అతి భయంకరంగా మారాడు. భృగుమహర్షి ఆ భీకరాకారుని ఎవరని అడుగుగా అతను అందరి జీవులలో ఉండే పాప పురుషుడనని, మంత్రజల ప్రోక్షణ వల్ల రాజు దేహంలో ఉండలేక బయటకు వచ్చేనని, తనకు ఆకలిగా ఉందని చెప్పి ఆహారం, నివాసానికి స్థలం చూపమన్నాడు. దానికి భృగు మహర్షి అక్కడ గల ఒక మామిడి చెట్టుని చూపెట్టి ఆ తొర్రలో నివసిస్తూ ఎండుటాకులను తింటూ ఉండమనిచెప్పి, లేనిచో భస్మం చేస్తానని చెప్పాడు. పాపపురుషుడు ఆ చెట్టుని తాకగానే అది బూడిదైపోయింది. మహర్షి శాపానికి భయపడి ఆ పాపపురుషుడు ఆ బూడిదలోనే నివసింపసాగాడు. అంతట భృగు మహర్షి ఆదేశానుసారం సోమకాంతుడు భృగుతీర్థంలో స్నానం చేసి వచ్చి, "ఈ నాటినుండి శ్రీ గణేశ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటాను" అని సంకల్పించగానే తన కుష్ఠు వ్యాధి నాశనమైపోయింది. దానితో సోమకాంతునకు ఆ పురాణంపై మరింత శ్రద్ధ పెరిగి ఆనందాశ్రువులతో ఆ పురాణాన్ని చెప్పమనగా, భృగు మహర్షి చెప్పాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML