గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 February 2015

మాఘమాసంలో మరొక గొప్ప అంశం ఏమిటంటే దంపతీ పూజ.విష్ణు ద్వాదశి అనగా ఈ మాఘ ద్వాదశి నాడు తిల స్నానము చేసి అంటే తిలలతో స్నానం చేసి, తిలలతో విష్ణు పూజ చేయడం , తిలలతో నైవేద్యం పెట్టడం, తిలతో దీపదానం చేయడం ఇవి చాలా విశేషం. ఎందుకంటే ఎప్పుడైనా ఉత్తరాయణ కాలం తిలలతో ఆరాధన, తిలా భక్షణం, తిలలు నైవేద్యం చేయడం చాలా శ్రేష్ఠం. మాఘమాసంలో ప్రత్యేకించి ఆరు రకాలుగా తిలస్నానముతో కూడి వ్రతములు చేయాలి అని చెప్తున్నారు.

"తిల స్నాయీ తిలోద్వర్తి తిల హోమీ తిలోదకీ!

తిలభుక్ తిలదాతా చ షట్తిలా పాపనాశాః!!


అని చెప్తున్నారు. దీని అర్థం ఏమిటి అంటే తిలలు కలిపిన నీటితో స్నానం చేయడం ఒకటి. అలాగే నువ్వుల పిండిని వంటికి అలదుకొని స్నానం చేయడం ఒకటి,తిలలు హోమం చేయడం, అదేవిధంగా తిలలతో అర్చించడం, తిలలు దానం చేయడం ఇవి చేసినట్లయితే సర్వ పాపనాశనము జరుగుతుంది. రాగిపాత్రలో తిలలు నింపి దానం చేయడం ఈరోజు చేయవలసిన విధానాలలో ఒకటి. అలాగే నారాయణునికి నువ్వుల నూనెతో దీపాన్ని సమర్పించడం, హోమములు మొదలైనవి చేసేవారు తిలలతో హోమం చేయడం, నారాయణ ప్రీతిగా తిల దానం చేయడం, అలాగే నువ్వులతో వండిన వంటకాలు నారాయణునికి నివేదన చేసి దానిని ప్రసాదంగా స్వీకరించడం ఇవి చేయడం చాలా శ్రేష్ఠం.

మాఘమాసంలో మరొక గొప్ప అంశం ఏమిటంటే దంపతీ పూజ. మాఘమాసంలో ప్రతిరోజూ దంపతీ పూజ చేయవచ్చు. లేదా ఈ అయిదు రోజులూ చేయవచ్చు. లేదా ద్వాదశి నాడు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశినాడు విష్ణు పూజ అనంతరం లక్ష్మీ నారాయణ భావంతో విప్రదంపతులను ఆరాధించడం అనేది చాలా గొప్ప విధిగా చెప్పారు. ఈ దంపతీ పూజ అత్యంత శ్రేష్ఠమైనది. ముఖ్యంగా విప్రదంపతులకు భోజనం పెట్టి పూజ చేయడం అనేది విధిగా చెప్తూ ఉన్నారు. ఈరోజు దానం చేయడానికి ముఖ్యమైనవి ఏమిటంటే కంబలములు, రక్త వస్త్రములు అంటే ఎర్రని వస్త్రాలు, పాదరక్షలు, మొదలైనవి మాధవ ప్రీతిగా చేయాలి. ఎందుకంటే ఈరోజున మాధవ నామంతో విష్ణువు ఆరాధింపబడుతున్నాడు. అందుకే మాధవ మంత్ర జపం కూడా చాలా విశేషం. "శ్రీ మాధవాయ నమః" అనే మంత్రాన్ని జపించుకున్నా చాలా శ్రేష్ఠం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML