ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 13 February 2015

సామవేదీయంసామవేదీయం
(బ్రహ్మశ్రీ సామవేదం వారి ప్రవచనాల నుండి సేకరించినవారు: శ్రీ దినవహి హనుమంతరావు)

ప్రహ్లాదునికి విష్ణువు పట్ల ఉన్నది నమ్మకం కాదు, అనుభవం. నమ్మకం కన్నా అనుభవం చాలా గొప్పది.
అర్థం తెలిసే దాకానే మతం, అర్థం తెలుసుకుంటే ఆధ్యాత్మికత.
తెలిసిన కథను పట్టుకొని తెలియవలసిన తత్త్వాన్ని తెలుసుకోవడమే ప్రవచన పరమార్థం.
దివ్యమైన మౌనం వైపు తీసుకువెళ్ళేదే నిజమైన ఉపాసన. భగవదనుభవమే మౌనం.
సృష్టిలో 'ఇచ్చిన' వారి పేరే నిలుస్తుంది. దాచుకున్నవాడి పేరు నిలవదు.
ధర్మరాజుల మనం ఉండగలిగితే శ్రీకృష్ణుడు మన ప్రక్కనే ఉంటాడు.
దేవతారూపం సూక్ష్మ దృష్టికే గోచరిస్తుంది. అది తపస్సు వలననే సాధ్యమౌతుంది.
జ్ఞానం పొందడమంటే తెలుసుకోవడం కాదు ... అనుభవించడం.
మాయను తన చేతిలో ఉంచుకున్న వాడు శివుడు. మాయ చేతిలోనివాడు జీవుడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML