మన ఖగోళ విజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి
ప్రయత్నం చేద్దాం.
ఖగోళ విజ్ఞానాన్ని వేదంయొక్కనేత్రంగా పరిగణిస్తారు.
కాలం యొక్క జ్ఞానం గ్రహగతులతో ముడిపడి
ఉంటుంది. ప్రాచీన కాలంనుండి ఖగోళ
విజ్ఞానం వేదాంగము యొక్క అంతర్బాగంగానే
ఉండింది. ఋగ్వేదం, శతపథ బ్రాహ్మణం మొదలైన
గ్రంథాలలో నక్షత్రములు, చాంద్రమానము,
సౌరమానము, అధికమాసము, ఋతువులమార్పులు,
ఉత్తరాయణము, దక్షిణాయనము, ఆకాశ చక్రము,
సూర్య మహిమ, కల్పముల గణన మొదలైన వాటిని
గురించి తెలియజేయబడింది. వీటిని గురించి మన
ఋషులు ప్రత్యేక పరిశోధనలు చేశారు.
దీర్ఘతమసుడనే ఋషి సూర్యుని గూర్చి
అధ్యయనం చేసే సమయంలో తన
కళ్ళు పోగొట్టుకున్నాడని వ్రాయబడింది.
గృత్సమదుడు అనే మహర్షి చంద్రుని గర్బంలో
జరిగే పరిణామాలను వివరించాడు. యజుర్వేదం లోని 18వ
అధ్యాయంలోని 40 వ పనస(మంత్రం)లో సూర్యుని
వలననే చంద్రుడు ప్రకాశిస్తున్నాడని చెప్పబడింది.
యత్రాల ను ఉపయోగించి ఖగోళమును పరీక్షించే పద్దతి
ఉన్నది. ఆర్యభట్టు 15వందలసంవత్సరాల
పూర్వంవాడు. ఆ కాలంలోనే పాటలీపుత్రంలో వేధశాల
(నక్షత్రశాల – Observatory) ఉండేది. దీనిద్వారా
ఆర్యభట్టు క్రొత్తవిషయాలను సూత్రీకరించాడు.
దీనిని బట్టి మనకు అర్థంకావలసిన విషయాలేమిటంటే
ఆర్యభట్టుకు ముందు కాలం నుండి ఈ
విద్య భారతదేశంలో చాలా ప్రాచుర్యంలో ఉండేది అని.
ఖగోళ గణనానికి యంత్రాలు ఉపయోగించేవారుఅని.
మహాభారతం లో కృష్ణ జననం. ధర్మరాజు జననం,
దుర్యోధనుడి జననం, భారత యుద్ద ప్రారంభం,
ధర్మరాజు పట్టాభిషేకం, కృష్ణ నిర్యాణం వీటన్నిటికీ
గ్రహస్థితిని ఇచ్చారు. ఇది ఎవ్వరూ మార్చలేని ఖచ్చితమైన
తేదీలను, కాల గణనాన్ని తెలియజేస్తుంది. కృష్ణ
నిర్యాణంతో కలి శకం ప్రవేశించింది. అంటే
క్రీ.పూ 3102 సం. గా గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు.
రేపు ఖగోళ గణనకు ఉపయోగించిన యంత్రాల గురించి
తెలుసుకుందాం.

No comments:
Post a comment