గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 2 February 2015

పూర్వం రుషులు, మునులు తపస్సులోకి దిగితే రెండు వేళ్లను కలిపి ఉంచే ముద్రల్లోనే నిమగ్నమై తపస్సులు చేసుకునేవారు.

పూర్వం రుషులు, మునులు తపస్సులోకి దిగితే రెండు వేళ్లను కలిపి ఉంచే ముద్రల్లోనే నిమగ్నమై తపస్సులు చేసుకునేవారు. అంటే కొన్ని వేల ఏళ్ల క్రితమే ముద్రల ఆరోగ్య రహస్యాన్ని మన పెద్దలు కనిపెట్టారన్నమాట. అందుకనే మీరు తరచూ యోగముద్రలు వేస్తే నిత్య ఆరోగ్యంతో హాయిగా జీవించొచ్చు అంటున్నారు
యోగా నిపుణులు ధరణీప్రగడ ప్రకాశరావు. ఆధునిక జీవనశైలిలో తలెత్తే సమస్యలకు పరిష్కారం ఈ ముద్రలు..
కీళ్ల ముద్ర
ఎలా చెయ్యాలి: ఈ ముద్రకు సుఖాసనంలో కూర్చోవాలి. కుడి చేతి బొటన, ఉంగరపు వేళ్లు శిఖరాగ్రములను స్పర్శించి ఎడమ చేతి బొటన, మధ్య వేళ్ల శిఖరాగ్రం స్పర్శిస్తే ఈ ముద్ర వస్తుంది. మిగిలిన వేళ్లు స్వేచ్ఛగా వదలాలి. ఈ ముద్రలో రెండు అరచేతుల వెనుక భాగం మోకాళ్లపైన ఆనించి ఉంచాలి. కుడిచేయి పృథ్వీ ముద్ర, ఎడమ చేయి ఆకాశ ముద్ర వల్ల కీళ్ల ముద్ర ఏర్పడుతుంది.
ఎంతసేపు చెయ్యాలి : కీళ్ల నొప్పులకు ఈ ముద్రలో రోజుకు నాలుగుసార్లు, పదిహేను నిమిషాలపాటు కూర్చుని సాధన చేయాలి. నొప్పులు విపరీతంగా ఉంటే.. రోజుకు ఆరుసార్లు అరగంట చొప్పున చేస్తే ఫలితం లభిస్తుంది.
హైపర్‌టెన్షన్‌ తగ్గించే.. రక్తపోటు ముద్ర
ఎలా చెయ్యాలి: ఏదైనా ఆసనంలో కూర్చుని బొటన, చూపుడు, చిటికెన వేళ్లు తెరచి వుంచి మధ్యమ ఉంగరపు వేళ్లు మూసి వుంచాలి. చేతులు ముణుకుల వద్ద ఉండాలి.
ఎంతసేపు చెయ్యాలి : ఈ ముద్రను ముప్పయి నిమిషాల పాటు చేయాలి. లేకపోతే ఉదయం పదిహేను నిమిషాలు, సాయంత్రం పదిహేను నిమిషాలపాటు చేయొచ్చు.
ప్రయోజనం : అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు (లోబీపీ) వారికి ఈ ముద్ర రామబాణం వంటిది. శరీరంలోరక్తప్రసరణ చక్కగా జరిగి రక్తనాళాల్లో అవరోధాలను తొలగిస్తుంది ఈ ముద్ర. సమస్య నియంత్రణలోకి వచ్చిన తరువాత ముద్రను ఆపేయవచ్చు.
శీతాకాలానికి.. జులుబు ముద్ర
ఎలా చెయ్యాలి: పద్మాసనంలో కూర్చుని చేతుల వేళ్లను పరస్పరం కలిపి మూయాలి. ఎడమచేతి బొటన వేలు నిలువుగా వుండాలి. మిగిలిన వేళ్లు బంధించి వుంచాలి.
ఎంతసేపు చెయ్యాలి : ఈ ముద్రను రోజులో ఏ సమయంలోనైనా సాధన చేయొచ్చు. కాని అవసరమైనప్పుడు మాత్రమే సాధన చేయాలి. రోజుకు మూడుసార్లు పదిహేను నిమిషాల చొప్పున చేయండి.
ప్రయోజనం : ఈ ముద్ర శరీరంలో వేడిని పెంచుతుంది. కనక ముద్రను వేయడంతోపాటు మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. జులుబు తీవ్రంగా ఉన్నవాళ్లకు లింగముద్ర (జలుబు ముద్ర) బాగా ఉపశమనం ఇస్తుంది. దగ్గును నయం చేస్తుంది. ఈ ముద్రను ఎక్కువగా చేస్తే శీతాకాలంలో చెమటలు కూడా పట్టొచ్చు.
వేడిని పెంచే.. మూత్రపిండ ముద్ర
ఎలా చెయ్యాలి : పద్మాసనంలో కూర్చుని ఉంగరం చిటికెన వేళ్లను మడిచి దానిపైన వెనక బొటనవేలును స్పర్శించి మిగిలిన రెండు వేళ్లు అనగా మధ్య, చూపుడు వేళ్లను తిన్నగా వుంచితే ఈ ముద్ర ఏర్పడుతుంది. రెండు చేతులు ఈ ముద్రలో ఉండాలి. అరచేతుల వెనక భాగం మోకాళ్లపైన ఆనించి వుంచాలి.
ఎంతసేపు చెయ్యాలి : ఈ ముద్రను 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు చేయాలి.
ఈ ముద్రను క్రమం తప్పకుండా చేస్తే.. శరీరంలో జలతత్వం తగ్గి వేడిని పెంచుతుంది. నిత్యసాధన వల్ల కిడ్నీ సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. శ్వాస సమస్యలు తొలగిపోతాయి. గొంతునొప్పి ఉంటే తగ్గుతుంది. మూత్ర సంబంధిత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. హైపోఽథైరాయిడ్‌, కఫ ఇబ్బందులు తగ్గుతాయి.
ప్రశాంతత కోసం శాంతిముద్ర
ఎలా చెయ్యాలి: పద్మాసనంలో కూర్చుని, కుడి అరచేతిని నేలపై బోర్లించి మధ్య వేలును సున్నితంగా చూపుడు వేలుపై ఆనించి ఉంచాలి. మిగిలిన వేళ్లు తిన్నగా వుంచితే సరిపోతుంది.
ఎంతసేపు చెయ్యాలి: పదిహేను నుంచి ముప్పయి నిమిషాల సేపు ముద్రను చేయాలి.
ప్రయోజనం : మనసు భారాన్ని తగ్గించి ప్రశాంతతను అందజేస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. శరీరపు బరువును కూడా అదుపులో ఉంచుతుంది. రక్తపోటు, అధిక రక్తపోటు, చెవికి సంబంధించిన రుగ్మతలను నియంత్రిస్తుంది.+
గుండెజబ్బులకు అపానవాయు ముద్ర
ఎలా చెయ్యాలి : పద్మాసనంలో కూర్చుని ముందుగా వాయు ముద్ర అంటే చూపుడు వేలును బొటనవేలు యొక్క మొదలు భాగంపైన తేలికగా అణిచి పెట్టాలి. బొటనవేలుతో మధ్యమ, అనామిక వేళ్ల చివర భాగాలను స్పర్శించటం వల్ల ఈ ముద్ర ఏర్పడుతుంది. చిటికెన వేలు తిన్నగా ఉంచి రెండు అరచేతుల వెనక భాగం మోకాళ్లపైన ఆనించి వుంచాలి.
ఎంతసేపు చెయ్యాలి : ఈ ముద్రను రోజులో అవసరమైనన్ని ఎక్కువసార్లు సాధన చేయవచ్చు. హృద్రోగులు, అధికరక్తపోటుతో బాధపడేవారు, గుండెపోటుకు గురైన వారు చేయవచ్చు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా 20 నిమిషాల చొప్పున చేయాలి. రోజుకు మూడుసార్లు చేయండి.
ప్రయోజనం : అపాన వాయు ముద్ర మృత్యువు నుంచి కాపాడుతుంది. అందువల్ల దీన్ని సంజీవనీ ముద్ర అంటారు. ఈ ముద్రకు అత్యంత వేగంగా ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి గుండెకు ప్రయోజనకారి. గుండెపోటును ఆపటానికి ప్రయత్నిస్తుంది. వాయుతత్వాన్ని తగ్గించి హృద్రోగాలను నయం చేస్తుంది. ఆయుర్వేద పద్ధతి ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫములు ప్రకోపించినప్పుడు పలు రకాల హృదయ సంబంధిత వ్యాధులు ఏర్పడతాయి. ఈ ముద్ర ఆ త్రిదోషాలను సరిచేస్తుంది. (గుండెపోటు వచ్చినప్పుడు ఆస్పత్రులకు వెళ్లడం తప్పనిసరి అని గమనించగలరు..)

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML