
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 2 February 2015
హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ లో నెలకొని ఉన్న పెద్దమ్మతల్లి దేవస్థానం ఏడు ఎకరాల స్థలంలో సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే నిర్మింపబడింది
హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ లో నెలకొని ఉన్న పెద్దమ్మతల్లి దేవస్థానం ఏడు ఎకరాల స్థలంలో సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే నిర్మింపబడింది. పెద్దమ్మ దేవాలయం అత్యంత ప్రాశస్తమైన, మహిమలు గలది. ప్రతి ఆదివారాలు, మంగళవారాలు మరియు శుక్రవారాలలో జంటనగరాలనుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూలలనుండి కూడా పాల్గొనడంతో దేవాలయంలో పండగ వాతావరణం కొలకొని వుంటుంది.
ఈ దేవాలయంలో తెలంగాణ సాంప్రదాయ బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పి.జనార్థనరెడ్డి ఫౌండర్ ట్రస్టీగా తన జీవితకాలంలో ఉన్నారు. జనార్థనరెడ్డిగారు దేవాలయంలో ఏడు అంతస్థుల భవంతిని మార్పులు చేర్పులు చేసి అభివృద్ధి చేశారు. ఎత్తైన గోపురం, అందమైన గర్భాలయం మరియు విశాలమైన కళ్యాణమండపం చూడవచ్చు. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం అతిథి గృహాలు కూడా నిర్మించారు. 1993లో జనార్థనరెడ్డిగారు దేవాలయ ప్రాంగణంలో గణపతి, లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి ఆలయాలను నిర్మించారు. ప్రాంగణంలోని దేవాలయాలు అన్నీ ఆగమశాస్త్ర నియమావళి, దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం నిర్మించబడ్డాయి. తాజాగా దేవాలయ ఆర్చ్ గేట్, అతిథి గృహాలు, అర్చకుల కోసం ఇళ్ళు, అమ్మవారి రథం, రథం కోసం గది, నవశక్తి దేవాలయం, నాగదేవత దేవాలయం, మహామండపం, దేవాలయ సరిహద్దు గోడలపై చిత్రలేఖాలు మొదలగునవి పూర్తయ్యాయి. తూర్పు దిశలో యాగశాల, పుష్కరిణి, దక్షిణ దిశలో కళ్యాణ గృహాలు (కళ్యాణ వేదిక) ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. శ్రీ శ్రీ శ్రీ హంపి విరూపాక్ష స్వామి వారి దిశానిర్దేశాల ప్రకారం 1994లో విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం నిర్వహించారు. ప్రతిరోజూ అభిషేకం మరియు కుంకుమార్చన నిర్వహిస్తారు. నాగదోషం ఉన్న భక్తులు ప్రతి మంగళవారం నాగదేవత దేవాలయంలో నాగదోష పూజలు చేయిస్తుంటారు.
ప్రతి మంగళ, శుక్రవారాలలో అన్నదానం కార్యక్రమాన్ని సమకూరుస్తున్నారు. అన్నదాన విరాళాల పథకం నుండి అన్నదానం ఖర్చులు చేస్తారు. ఈ అన్నదాన పథకాన్ని తాజాగా మొదలుపెట్టారు. భక్తులు రూ.5000/- చెల్లించి వారు కోరుకున్న వారంరోజున అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తారు. దేవాలయంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలలో దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘశుక్ల పంచమి మాసం నుండి మాఘశుక్ల సప్తమి వరకు రథోత్సవం జరుపుతారు. హిందువులకు రథసప్తమి ఎంతో పవిత్రమైన రోజు. ఈ పండగ రోజులలో భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. నవరాత్రి ఉత్సవాలకు ప్రజలు తండోపతండాలుగా దేవాలయానికి తరలి వస్తారు.
సంప్రదించ వలసిన ఫోన్ నెం.
040 – 233 44 592, 040 – 236 07 284
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment