దేవుడి పేర్లు పిల్లలకు పెట్టే ఆచారం ఎలా వచ్చింది!?
పిల్లలకు భగవంతుని నామాలు పెట్టడం సహజం. కానీ దేవుళ్ల పేర్లను పిల్లలకు పెట్టడం వెనుక పరమార్ధం దాగి వుంది. రాముడు, కృష్ణుడు, శివుడు.. ఇవన్నీ భగవంతుని నామాలు. ఈ నామాలు వచ్చేలా పిల్లలకు పేర్లు పెడతారు. ఆ పేర్లతో పిల్లలను పిలుచుకుంటే భగవన్నామస్మరణ చేసినట్టవుతుందని విశ్వాసం.
భగవంతుడి నామానికి అంత శక్తి వుందా.? అని అడిగితే ఉందని వాగ్గేయకారుడు త్యాగరాజు అన్నారు. “రామ”లోని “మ” అనే అక్షరం పంచాక్షరి మంత్రం. ఆ అక్షరానికి “రా” అనేది చేరినప్పుడు, అది ఒక దివ్యమైనటువంటి మంత్రమవుతుంది. ఆ విషయాన్ని గమనించినందుకే శ్రీరామునికి ఆ పేరు పెట్టారు. ఆ పేరుని ఉచ్చరించటమే మంత్రం పఠించటమే.
అలా మంత్రం పఠించి, దానివల్ల కలిగే సత్ఫలితాలను పొందటం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి వారి వారి పిల్లలకు రాముడని, కృష్ణుడని పేర్లు పెడతారు. ఆ పేర్లతో పిల్లను పిలుచుకుంటూ, భగవన్నామస్మరణ వల్ల కలిగే లాభాన్ని పొందుతారు. ఈ నమ్మకంతోనే దేవుడి పేర్లు పిల్లలకు పెట్టే ఆచారం ఏర్పడిందని పురోహితులు చెబుతున్నారు

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment