వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. . ఈ పంచమిని గురించి దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం మొదలైన పురాణాలు విశేషంగా చెప్పాయి. ఈ రోజే జ్ఞానప్రదాత అయిన శ్రీ శారదాంబ జన్మించినదని పురాణాలు చెబుతున్నాయి. సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామరపువ్వునీ, మిగతా రెండు చేతుల్తో వీణను వాయిస్తుంటుంది. సరస్వతీ బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతుంటుంది .సరస్వతి అంటే జ్ఞానాన్ని కల్గించే కిరణమనే అర్థం కూడా ఉంది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. అందుచేత వసంత పంచమి నాడు విద్యాభ్యాసం మొదలెడితి జ్ఞానులవుతారు. విద్యాభ్యాసమే కాకుండా శుభకార్యాలకు వసంతపంచమి మంచి రోజు అవుతుందని జ్యోతిష్యము చెబుతుంది. ఈ రోజున ప్రారంభించే ఏ కార్యమైనా విజయవంతమవుతుందని విశ్వాసం.
ప్రతి ఒక్కరు ఈ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, తల స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలు పూర్తీ చేసుకుని, సరస్వతిని ఆరాధించాలి.ఆబాలగోపాలమంతా ఈ రోజు ఆ వాగ్దేవిని విధిగా పూజించాలని శాస్త్ర వచనం.
చదువులతల్లిని పూజిస్తే విద్యాబుద్ధులు, మేధాశక్తి పెంపొందుతాయి.జ్ఞాన చక్షువులు తెరిపించే ఆ విపంచిని పూజిస్తే లౌకిక చదువులే కాకుండా పరమమైన బ్రహ్మ విద్య పొందగలుగుతాము. ఎంతటి ఐశ్వర్యవంతునికైన విద్య లేకపోతె విలువ ఉండదు. అందుకే '' విద్య లేని వాడు వింత పశువు '' అన్నారు. జ్ఞానం ఉన్నవాడు ఎక్కడైన జీవించగలడు.
స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్సర్వత్ర పూజ్యతే--
అంటే మూర్ఖుడిని వారి ఇంటిలోని వారే గౌరవిస్తారు. గ్రామాధికారికి తన వూళ్ళోనే మర్యాద ఉంటుంది. రాజుకు తన రాజ్యంలోనే గౌరవం. కానీ విద్వత్తు ఉన్న వాడు ప్రపంచంలో ఎక్కడైనా గౌరవింపబడుతాడని భావం. అటువంటి విద్యా ప్రదాతను ఈ రోజున బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తారట. ముఖ్యంగా ఈ రోజున జోతిష్కులు ఆ అమ్మవారిని ఆరాధించాలి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment