గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 17 February 2015

శివరాత్రి నాలుగు విధాలు: నిత్య శివరాత్రి - ప్రత్రిరోజూ రాత్రి శివుడిని ఆరాధించడం.శివరాత్రి

శివరాత్రి నాలుగు విధాలు:

నిత్య శివరాత్రి - ప్రత్రిరోజూ రాత్రి శివుడిని ఆరాధించడం.
పక్ష శివరాత్రి - పదిహేను తిథులలో చతుర్ధశి లయకారుడైన పరమ శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు చేసె శివారాధన పక్ష శివరాత్రి.
మాస శివరాత్రి - బహుళ పక్షంలో (అమావాస్యకు ముందు) వచ్చే 'చతుర్దశి' అంటే శివునికి మరింత అత్యంత ప్రీతికరమైనది మరియు శివపూజమ విశిష్టమైనది. అదే మాస శివరాత్రి.
మహా శివరాత్రి - మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడే శివుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.


ఇలా శివున్ని నాలుగు విధాలైన శివరాత్రులలో ఆరాధించడం అనంతమైన పుణ్యఫలదాయకం. ఈ శివరాత్రులలో 'శివ' అనే నామాన్ని ఉచ్ఛరించడమే మోక్షదాయకం.

బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా 'శివ' అనే పేరులోని 'శి' అనే అక్షరం పాపాలను హరింపజేస్తుంది. 'వ' అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుంది. "శివ" అంటే చాలు పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుంది. ఒక్క శివ నామంలోనే ఇంత శక్తి ఉంటే, నాలుగు విధాల శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. అయితే ఈ నాలుగు ఆచరించలేకపోయినా, కనీసం ఒక్క మహాశివరాత్రిని పాటించినా అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలం లభిస్తుంది. ఒక్క శివరాత్రి వ్రతం సర్వపాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

మహాశివరాత్రి ఆచరణ విధానం
మహా శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రిపూట అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని 'లింగ పురాణం' చెబుతోంది. శివనామస్మరణతో పగలు గడిపి, అభిషేకాలు, పూజలు రాత్రి చేయవలెను. రాత్రి నాలుగు ఝాముల్లో నాలుగు రకాలైన అభిషేకాలు, పూజలు చేయాలి.

మొదటి ఝాములో శివుడిని పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించవలెను.
రెండవ ఝాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించి తులసి దళములతో పూజించి పాయసాన్ని నైవేద్యం సమర్పించవలెను.
మూడవ ఝాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళములతో పూజించి నువ్వులతో వండిన నైవేద్యంగా సమర్పించవలెను.
నాలుగవ ఝాములో శివలింగాన్ని తేనెతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి, అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవలెను.

మహాశివరాత్రినాడు పాటించ వలసిన మరో ప్రధానమైన విధి 'ఉపవాసం'. భగవత్ప్రాసాదితమైన జ్ఞానామృతంతో ఆత్మ ప్రక్షాళన గావించుకుని శివసాన్నిధ్యంలో కామక్రోధలోభ మోహాది విషయాలను త్యజించి శివ సాన్నిధ్యంతో వాసం చేయడమే 'ఉపవాసం'.

మహాశివరాత్రి నాడు ఆచరించవలసిన మరో నియమం 'జాగరణ' అంటే బుద్ధిని మెలుకువగా -- జాగృతావస్తా -- లో ఉంవడమే. అజ్ఞానాందకారంతో తలెత్తి మన మీద దాడిచేసే అరిషడ్వర్గాలను గుర్తించి, సావధానంలో మేల్కొని వానిని జయించాలని జాగరణలోని పరమార్థం. ఎవరి బుద్ధి మేల్కొని ఉంటుందో వారికి మరణ-జననాల పునరావృత్తి ఉండదు. అందువలన చిత్తశుద్ధితో జాగరణ చేయడం మోక్షదాయకం.

శివలింగం మూలం బ్రహ్మ స్వరూపము, మధ్య భాగం విష్ణు స్వరూపం, పైభాగం సదాశివ స్వరూపం, పానవట్టం గౌరీస్వరూపం. కనుక, శివలింగాన్ని పూజించినట్లైయితే, సృష్టి, స్థితి లయకారులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను ఆదిశక్తిని ఒకే సమయంలో పూజించినట్లు లెక్క.

(సంక్షిప్తంగా శ్రీకనకదుర్గప్రభ, ఫిబ్రవరి 2015, సంచికలో ఉన్న 'మహాశివరాత్రి' అను వ్యాసం నుంచి)

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML