.
అంబరీషుడు విష్ణు భక్తుడు .ఏకాదశీ వ్రతాన్ని భ క్తీ శ్రర్ధ లతో చేసే వాడు .
ఒక సారి ఏకాదశి ఉపవాసం వుంది ,మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధ మైన సమయం లో దూర్వాసుడు ,ఆయనకు అతిధి గా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు .ద్వాదశి ఘడియలు పూర్తి ఆయె సమయం అయినా మహర్షి రాలేదు .అక్కడున్న మార్షుల అనుమతి తో ,కొద్దిగా జలాన్ని తీర్ధం గా త్రాగాడు .
తర్వాత దూర్వాసుడు వచ్చి ,జరిగిన దానికి కోప పది తన శిరస్సు లోని ఒక జడ ను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు .అది అతి భయంకరం గా మీదకు రావటం గ్రహించి ,రాజు ,శ్రీ హరిణి మనసు లో ధ్యానించాడు
.వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి ,పిశాచాన్ని చంపి ,,దుర్వాసుని చంప టానికి మీదకు వెళ్ళింది .
భయం తో దుర్వాసుడు పారి పోవటం ప్రారంభించాడు .చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది .మూడు లోకాలూ తిరిగి నా ఎవరూ,దుర్వాసునికి అభయం ఇవ్వ లేదు .చివరికి విష్ణువు ఆజ్ఞా తో మళ్ళీ అమ్బరీశున్నే శరణు వేడాడు .అంబరీషుడు అతన్ని క్షమించాడు .వెంటనే చక్రం అదృశ్య మైంది .భగవంతుని కంటే ,భక్తుడే శక్తి కల వాడు అని ఈ కధ మనకు తెలియ జేస్తుంది .
No comments:
Post a Comment