గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 February 2015

శ్రీ గురుభ్యో నమ: - ౧శ్రీ గురుభ్యో నమ: - ౧

ఒక ఇంటిలో "పూజా గృహం" ఎలాంటిదో, ఈ భువనానికి మన భారతావని అటువంటి పవిత్ర స్థలం. ఇక్కడ అనాదిగా ఆధ్యాత్మికత ఋషుల నుంచీ నేటికీ నిరంతరంగా ప్రవహిస్తూ ఉంది. ఎందరో పుణ్యపురుషులు ఈ భారతావనిలో జన్మించి తమ తపశ్శక్తితో, మేధా సంపత్తితో విదేశీయులను సైతం ఆకర్షించి వారి జ్ఞానతృష్ణను తీర్చిదిద్దారు.
గత 2000 ఏళ్లుగా భారతావనిలో 1. గౌతమబుద్ధుడు, 2. మహావీరుడు, 3. ఆదిశంకరులు, 4. గురునానక్, 5. రామకృష్ణ పరమహంస, 6. పండిట్ రవిశంకర్, 7. రామ్ దేవ్, 8. మాతా అమృతానందమయ, 9. మహేష్ యోగి, 10. సత్యసాయి బాబా వరకూ ఎందరో యోగ పుంగవులు భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసి, భారత గురుపీఠాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. పేర్లు తెలిసిన వారికంటే వ్యక్తం కాకుండా తెర వెనుకనే అజ్ఞాతంగా పని చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఆ పుణ్యమూర్తులను స్మరించుకుంటూ కొందరిగురించి తెలుసుకుందాం.

గౌతమ బుద్ధుడు(క్రీ. పూ. 5వ శతాబ్దము):-
గౌతమ బుద్ధుడు ఒక రాజకుమారుడు. ఇతని పూర్వనామం సిద్ధార్థుడు అంటే ఆశలు సిద్ధించిన వాడు అని అర్థం. గౌతమ బుద్ధుడు బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా అంతఃపురంలో రాజభోగాలలో పెరిగాడు. అయితే ఒకరోజు అనుకోకుండా నడవటానికి కూడా శక్తిలేని ఒక వృద్ధుణ్ణి, ఓ రోగినీ చూడటంతో అతనికి లోకంలో ఆర్తులు ఉన్నారని తెలిసింది. ప్రపంచంలోని ఈ బాధలకు కారణం తెలుసుకోటానికి తన రాజప్రసాదం వదిలిపెట్టాడు సిద్ధార్థుడు. తరువాత సకల కష్టాలకూ ఆశలే కారణమని, మోక్షసాధనలో ఈ ఆశలకు లొంగని ప్రయాణమే విజయం సాధిస్తుందనీ కనుగొన్నాడు. ఈ ఆలోచనే బుద్ధభగవానుని బోధనలలో ప్రముఖంగా ప్రసిద్ధి గాంచింది. కోరికల నుంచి విడుదలైన మనిషి మరుజన్మలేని నిర్వాణం(ముక్తి) లభిస్తుందని బుద్ధుడు ప్రవచించాడు. బోధివృక్షం నీడలో జ్ఞానోదయం కలగటం వలననే సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయినాడు. ఎందరో ప్రజలు కుల, మత, వర్గ రహితంగా ఇతని అనుచరులుగా మారిపోయారు. ఆ తరువాత ఏ బేధంలేని జీవన విధానం అనుసరించే సన్యాస ఆశ్రమ విధానం అయిన "సంఘాన్ని" బుద్ధుడు స్థాపించాడు.

మనిషి వాంఛించే నిర్వాణం పొందగలిగిన 8 సూత్రాలను లేదా మధ్యేమార్గాల్ని బుద్ధుడు మనకు ప్రసాదించాడు.
1. సరిగా అర్థం చేసుకోవటం.
2. సరైన ఆలోచనా విధానం.
3. సరైన పలుకులు.
4. సరైన పని.
5. సరైన జీవన విధానం.
6. సరైన కృషి.
7. సరైన మానసిక స్థితి.
8. సరైన ఏకాగ్రత.
గౌతమ బుద్ధుని "లైట్ ఆఫ్ ఆసియ" అని కూడా పిలుస్తారు. ఇతని బోధనలు ఆసియా ఖండం దాటి మొత్తం ప్రపంచమంతా కూడా విస్తరించాయి. గౌతమ బుద్ధుడు మన భారతదేశానికి గొప్ప గర్వకారణం.

మహావీరుడు(క్రీ. పూ. 599-527):-
ఇతను జైనమత స్థాపకుడు. 30సంవత్సరాల వయస్సులో సత్యాన్వేషణలో కుటుంబాన్ని పరిత్యజించి, పరివ్రాజకునిగా మారాడు. జ్ఞానసిద్ధి పొంది "జైనుడు"గా మారి తాను తెలుసుకున్న సత్యాన్ని సర్వమానవులకు వివరిస్తూ సంచారం చేశాడు. అహింస, సత్యం, అసత్యత్యాగం, అపరిగ్రహ, బ్రహ్మచర్యమనే "పంచ" సిద్ధాంతాలను బోధించాడు. ముక్తిమార్గంలో మానవులంతా సమానులే అని కుల, మత, వర్గ, భాషా భేదాలను నిరశించాడు.

ఆదిశంకరులు(క్రీ. పూ. 1వ శతాబ్దం):-
ఆధునిక విజ్ఞానం నేడు ఈ జగత్తును అద్వితీయమైన చైతన్య శక్తిగా గుర్తిస్తూ ఉంది. కానీ 2000 సంవత్సరాల క్రితమే ఈ "అద్వైత" భావనని ప్రపంచానికి అందించిన వాడు ఆదిశంకరులు. శివగురు, ఆర్యాంబ ఎంతో ఘోర తపస్సు చేసి ఉంటారు. అందుకే ఆ పుణ్య దంపతులకు తెలివైన "శంకరుడు" జన్మించాడు. వీరి స్వస్థలం కేరళలోని "కాలడి" గ్రామం. ఈ కుర్రవాడు, తన 6సంవత్సరాల వయస్సులోనే తొలి పుస్తకం రచించాడు. అంత చిన్న వయస్సులోనే అతనితో రాజులు, గొప్ప వ్యక్తులు సంప్రదించేవారు. 8సంవత్సరాల వయస్సులోనే శంకరుడు సన్యాసం స్వీకరించడానికి తన తల్లిని అనుమతి అడిగాడు. ఎంతో కష్టంతో ఆ అనుమతి సాధించాడు. ఆ తరువాత ఎక్కడ ఉండాలో, ఏమి తినాలో కూడా తెలీకుండానే కేవలం కాలినడకన కేరళ నుంచీ మధ్యప్రదేశ్ వరకూ ప్రయాణించాడు. తన గురువైన "గోవిందపాద"ను నర్మదా తీరంలో కలుసుకున్నాడు. విద్యాభ్యాసం ముగించుకుని గురువుగారి ఆశీస్సులతో శంకరుడు ఉపనిషత్ వివరణలు రచించడం ప్రారంభించాడు.
అతను రచించిన భగవద్గీత వివరణ, ఉపనిషత్ లు, బ్రహ్మ సూత్రాల వివరణలు పండితులచే కూడా కొనియాడబడ్డాయి. చివరకు తన స్వంత రచనలు చేయటం ప్రారంభించిన శంకరుడు "భజగోవిందం", "ఆత్మబోధన", "తత్వబోధ", "దక్షిణామూర్తి స్తోత్రాలు", "వివేక చూడామణి" మొదలైనవి రచించాడు. ఇవన్నీ కూడా మోక్షాన్వేషణ చేసే మానవులకు ఆ దాహార్తిని తొలగించే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు. ఆదిశంకరులు దేశం నాలుగు దిక్కులలో నాలుగు శంకర మఠాలు స్థాపించి,(పూరి, శృంగేరి, బదరీనాథ్, ద్వారక) హైందవ మతాన్ని పునరుద్ధరించారు. ఎందరో రాజులు, మేధావులు, విజ్ఞానులు, వ్యాపారులు ఇతని అనుచరులుగా మారిపోయారు. 32సంవత్సరాల వయస్సుకే "హైందవధర్మ" పరిరక్షణ పూర్తిచేసి, 72 వివిధ రంగాలలో తన ఆలోచనా విధానాలను నెలకొల్పాడు. "అద్వైత సిద్ధాంతాన్ని" ప్రబోధించాడు. అంత చిన్న వయస్సులోనే పరమాత్మను చేరుకున్నాడు. శంకరుడు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ.

తిరువళ్ళువర్:-
తమిళులకు ఆరాధ్య గ్రంథం "తిరుక్కురల్" రచించాడు. దీనిని "ముపృల్" అని కూడా పిలుస్తారు. అంటే "త్రివర్గం" అని అర్థం. ఈ గ్రంథం "ధర్మ, అర్ధ, కామ"మనే మూడు గుణాల గురించి వివరిస్తుంది కనుక ఆ పుస్తకానికి ఈ పేరు వచ్చింది. తిరువళ్ళువర్ జీవితకాలం గురించిన సరైన వివరాలు లభించటం లేదు. ఇతను కన్యాకుమారికి రాజుగా ఉండి, బుద్ధునిలా అన్నీ త్యజించాడనీ కొందరు, చేనేత కుటుంబంలో జన్మించిన వాడనీ కొందరు నమ్ముతారు. "కురల్" అంటే చిన్న శ్లోకం వంటిది. "తిరుక్కురల్"లో ఇలా 10 శ్లోకాలు వంటివి ఒక భాగంగా, మొత్తం 133 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో జీవితం, ప్రేమ, అదృష్టం, కుటుంబం, అనుబంధం, సత్యం, జ్ఞానం, భార్య, మంచిగుణం, అవకాశం, కర్మ వంటి ఎన్నో నిత్యజీవిత విషయాలు చర్చించబడ్డాయి. ఉదా: "ఒక సజ్జనునికి చిరునవ్వు దానగుణం, న్యాయబుద్ధి, మంచి పలుకులు ముఖ్యం" అని అంటాడు తిరువళ్ళువర్.

రామానుజాచార్యులు(1017-1137):-
రామానుజాచార్యులు క్రీ. పూ. 1017లో పెరంబూరులో జన్మించారు. బాల్యం నుంచీ ఇతను చాలా తెలివైన విద్యార్థి. గురువుల బోధనలలోనే లోపాలు కనిపెట్టేవాడు. ఇతని భార్య చాదస్తం భరించలేకనే ఇతను సన్యాసం స్వీకరించాడు. ఆ తరువాత శ్రీరంగంలో "వైష్ణవ మఠాధిపతి" అయినాడు. తన గురువుగారి ఆజ్ఞ ప్రకారం "విశిష్టాద్వైతానికి" భాష్యం రచించాడు. అలాగే తాను స్వంతంగా 'వేదాంతసారం', 'వేదాంత సంగ్రహం', 'వేదాంత దీపం' అనే గ్రంథాలనూ రచించాడు. అనేకసార్లు పరిశీలించిన తరువాతే 'స్వామినంబి' రామానుజానికి "ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని ఉపదేశించి దీనిని చాలా రహస్యంగా ఉంచమని చెప్పాడు. అయితే వెంటనే రామానుజుడు సకల జనులను కుల, మత, వర్గ బేధం లేకుండా గుడివద్ద సమావేశపరచి ఆ గుడి గోపురమెక్కి తనకు తెలిసిన మంత్రాన్ని అందరికీ బిగ్గరగా బహిర్గతపరచాడు. అటు తరువాత తన చర్యకు బదులుగా "ఈ మంత్రం వినటం వల్లా సకల జనులు స్వర్గం పొందగలిగితే, వారికి ఈ మంత్రం ఉపదేశించిన పాపానికి నేను నరకం భరించడానికి కూడా సిద్ధమే" అన్నాడు. అక్కడి హరిజనులందరికీ దేవాలయ ప్రవేశం కలిగించాడు. 120 సంవత్సరాల తన జీవిత యానంలో హైందవ దేవాలయాల విధి నిర్వహణ, పూజాదికాలను ససాంప్రదాయంగా నిర్ణయించిన ఘనత రామానుజులదే!!

బసవేశ్వరుడు(1131-1167):-
లింగధారులకి ప్రముఖ గురువు. కర్నాటక సాహిత్యంలో గొప్ప పండితుడు, జ్ఞాని. ఇతను పరమశివుని నంది అవతారమని ప్రజలు భావిస్తారు. తన గురువు సంగమేశ్వరుని వద్ద దాదాపు 12 సంవత్సరాలు కఠినమైన శిక్షణ పొందాడు. అన్ని మతాలు, అందరు దేవుళ్ళూ ఒక్కటేననీ, మనిషే భగవంతుని దేవాలయమని ప్రవచించాడు. "మానవ సేవే మాధవ సేవ" అని ఆచరించి చూపాడు.

మధ్వాచార్యులు(1238-1317):-
ఒకరోజు ఓ సన్యాసి తన శిష్యబృందంతో గంగా నదిని దాటుతున్నాడు. అటువైపు ఉన్నది ముస్లిం రాజ్యం. అక్కడి సైనికులు ఈ సన్యాసులను చూచి దాడి చేయటానికి ప్రయత్నించగా ఆ బృందం నాయకుడైన స్వామి ఆ సైనికులతో మేము మీ రాజును చూడటానికి వస్తున్నాం, యుద్ధానికి కాదు అన్నాడు. ఇది విన్న రాజు నా సైన్యంలోకి రావటానికి మీకు ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించాడు. అందుకా సన్యాసి "ఓ రాజా! మనలందరినీ రక్షించే ప్రభువు పైన ఉన్నాడు. కాకపోతే మీరు అతనిని "అల్లా" అంటారు. మాకు అతడు "నారాయణుడు" అంతే అని ధైర్యంగా సమాధానం చెప్పాడు. అతడే మధ్వాచార్యుడు. మధ్వాచార్యుడు "ద్వైత" సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కులాల కంపుతో పతనమౌతున్న జాతికి "భగవంతుని సృష్టిలో అందరూ సమానమే అని" చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమ పరిధిని తెలుసుకొని భగవంతుని శరణు కోరాలి అంటాడు. ఇంకా, నిజమైన పని ఇతరులకు సేవ చేయటమే అంటాడు మధ్వాచార్యుడు. క్రీ. పూ. 1238లో జన్మించిన మధ్వాచార్యుడు 12వ ఏటనే సన్యాసం స్వీకరించాడు. తన జీవితం మొత్తం వేద విజ్ఞాన వ్యాప్తికే పాటుపడ్డాడు. భగవద్గీతకు, పది ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాడు. 1317లో తనవారి నుంచి అనుమతి తీసుకొని బదరీ ప్రయాణమైన మధ్వాచార్యుడు ఆ తరువాత ఎవరికీ కనిపించలేదు.

స్వామి జ్ఞానేశ్వర్(1275-1296):-
13వ శతాబ్దంలో మహారాష్ట్రలో జన్మించిన జ్ఞానేశ్వర్ సాహిత్యాన్ని, భక్తినీ రంగరించి మోక్షమార్గంగా అంతః దృష్టిని పెంపొందించారు. మానవులలో దుష్టబుద్ది నశించి, విశ్వమానవ ప్రేమతత్వం జనించాలని ఆకాంక్షించాడు. భగవద్గీతను చక్కగా, శ్రావ్యంగా గానం చేశాడు.

-- Jajisarma --

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML