గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 February 2015

సీతా శోకనాశనకరుడే పంచముఖాంజనేయుడు.సీతా శోకనాశనకరుడే పంచముఖాంజనేయుడు. నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహస్వామి, ఆంజనేయుడు - ఈ అయిదూ ఒకే తత్త్వం తాలూకు విభిన్న వ్యక్తీకరణలు. ఇది మంత్రపరమైన ఔచితీ దర్శనం. మృగవదనం, నరశరీరం కలిగిన దేవతలు 'క్షిప్రప్రసాద' (వెంటనే అనుగ్రహించే) లక్షణం కలవారు.

రాక్షస సంహారంలో ప్రతాపాన్ని చూపిన నారసింహ లక్షణం జ్ఞాన స్వరూపునిగా హయగ్రీవ స్వభావం, గరుత్మంతునిగా మహావేగం, వరాహ స్వామిగా సంసారసాగరం నుంచి, శోకపంకం నుంచి ఉద్ధరించే తత్త్వం, తనకు సహజమైన వానరాకారం - ఇవన్నీ కలబోసినా లీలలను రామాయణంలో ప్రదర్శించాడు హనుమ. అందుకే పంచముఖాంజనేయునిగా దర్శనమిచ్చాడు. అంతేకాక - గజవదనుడైన గణపతి తత్త్వం, హనుమ తత్త్వమూ కూడా ఒకటేనని విజ్ఞుల విశదీకరణ.


"అవ్యక్త అప్రమేయ పరతత్త్వమితదు" అని వాల్మీకి సుందరకాండలో పేర్కొన్నాడు.

'సుతరాం ఆద్రియతే ఇతి సున్దరః' అందరి ఆదరణా పొందే గుణ మహిమ రూపాలు కలవాడు హనుమయే సుందరుడు. మంత్రశాస్త్రంలో హనుమ నామం సుందరుడు. అందుకే హనుమ కథ "సుందర కాండ"గా రామాయణ రత్నమాలలో కొలికి పూసలా ప్రకాశిస్తున్నవాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML