ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 13 February 2015

వానప్రస్థం మూడవ ఆశ్రమం. బ్రహ్మచర్య, గృహస్థాశ్రమాల తర్వాత స్వీకరించవలసినది.వానప్రస్థం మూడవ ఆశ్రమం. బ్రహ్మచర్య, గృహస్థాశ్రమాల తర్వాత స్వీకరించవలసినది. బ్రహ్మచర్యంలో విద్యాభ్యాసం చేయాలి. నియమపూర్వకంగా శ్రద్ధగా విద్యనార్జించిన వాడు గృహస్థాశ్రమానికి అర్హుడు. ఈ ఆశ్రమంలో దేవయజ్ఞ, పితృ యజ్ఞ, ఋషి యజ్ఞ, మనుష్య యజ్ఞ, భూత యజ్ఞాలు ఆచరించాలి. తనవరకు వచ్చిన ధర్మ పరంపరను తరువాతి తరాలకు కొనసాగించేందుకు వంశ వృద్ధికి సత్ సంతానాన్ని పొంది తీర్చిదిద్దాలి. సామాజిక బాధ్యతా, కుటుంబ బాధ్యత నిర్వహిస్తూ, ఆ బాధ్యతల హద్దులలో ధార్మికమైన భోగానుభవంతో జీవితాన్ని సాగించాలి.

అయితే ఈ స్థితిలో కేవలం ఒక భాగంగా అప్పుడప్పుడు ఏకాంతం, ఆత్మచింతనతో ఆధ్యాత్మిక సాధనలు కొనసాగిస్తుండాలి. బాధ్యతలు విస్మరించరాదు. వ్యక్తిగా మన ఉనికికీ, మనుగడకీ హేతువైన సమాజం పట్ల మన కర్తవ్యాన్ని అనివార్యంగా పాటించాలి.


ఎంత బాహ్యజీవితంలో బాధ్యతలను నిర్వహించినా చివరికి గ్రహించాల్సింది మన ఆత్మోన్నతినే. దానికి తాత్త్విక చింతన, తపస్సు ముఖ్యం. అది గృహస్థాశ్రమంలో పూర్తి స్థాయిలో చేయలేం. వాటికోసం గృహస్థ బాధ్యతలను వదల రాదు. గృహస్థాశ్రమాన్నే గొప్ప ఆశ్రమంగా శాస్త్రాలు వర్ణించాయి.

అయితే బాధ్యతలు పూర్తిచేశాక ఇంక లౌకిక లంపటాల నుండి మనసును పూర్తిగా మరల్చి భగవచ్చింతనకి, తపస్సుకి కేటాయించాలి. అంటే గృహస్థాశ్రమంలో దైవచింతన కూడదని కాదు. ఆ ఆశ్రమంలో అనేక కర్తవ్యాల వల్ల సంపూర్ణంగా చేయలేని దానిని ఈ వానప్రస్థంలో పూర్తిగా చేయాలి.

లౌకిక లంపటాల నుండి మరలడమంటే కర్తవ్యాన్ని వదిలేయడం కాదు. అందుకే బాధ్యతల్ని తన తరువాతి తరానికి బోధపరిచి అవి నిర్విఘ్నంగా కొనసాగేలా అందించి 'వనానికి బయలుదేరడమే' వానప్రస్థం. ఈ ఆశ్రమ స్థితిలో నిత్యనైమిత్తిక కర్మల్ని మాత్రం విడువరాదు. ఇది సన్యాసాశ్రమం కాదు కదా! దేవ, పితృ, ఋష్యాది యజ్ఞాలను నిర్వహిస్తూ ఏకాంత జీవితం గడపాలి. భార్యను కూడా వానప్రస్థానికి తీసుకువెళ్ళాలి. ఆమె ఒకవేళ పుత్రాదుల దగ్గరే ఉంటానని అంటే సరేనని అంగీకరించి తానొక్కడే వెళ్ళాలి. అంతేగానీ నిర్బంధించరాదు. నగరాదులలోని భోగాలను, ఆహారాలను, విడచి ప్రాణరక్షణార్థం మాత్రమె ఆహార స్వీకరణ చేస్తూ కాలం గడపాలి. ఇవి కొన్ని నియమాలు.

ఇక - ప్రస్తుతాంశం. ఈ ఆశ్రమం ఈ కాలంలో సాధ్యమా? సాధ్యమే. అయితే అడవికి పోనక్కర్లేదు. తనంత తాను ఏకాంతంగా నిత్యకర్మల్ని చేసుకుంటూ లోకవార్తల పట్ల, భోగాల పట్ల లౌకిక చర్యల పట్ల ఆసక్తిని చూపకుండా - మానసికంగా 'నిస్సంగ' (ఎవరితో సంపర్కంలేని) స్థితికి చేరాలి.

పుత్రాదుల విషయాలలో వ్యామోహ పడకుండా కలుగజేసుకోకుండా కేవలం క్షేమ ధర్మాదుల మేరకే, వారు అడిగినప్పుడు సలహా మాత్రమె ఇస్తుండాలి. కోపతాపాదుల్ని పూర్తిగా వదలుకొని తమ చింతనలో తాముంటూ ఆత్మోన్నతికి ప్రయత్నించాలి. రుచుల కోసం తాపత్రయం, భౌతిక కథల జోలికి లేకుండా పూర్తి నిగ్రహాలకు ప్రయత్నిస్తూ అంటీ అంటకుండా తామరాకు పై నీటి బొట్టులా వర్తిస్తుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే 'మానసిక ఏకాంతాన్ని' పూర్తీ స్థాయిలో సాధించాలి.

ఇది హాయిగా ఈ కాలంలోనూ సాధ్యమౌతుంది. సంకల్పమూ, కాస్త పట్టుదల ఉంటే చాలు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML