భృగు పుత్రిక అయిన శ్రీమహాలక్ష్మి దూర్వాసుని శాపవశమున సముద్రమున జన్మించుట -2వ భాగం
"నమోస్తు దేవ్యై భృగు నందనాయై ! నమోస్తు విష్ణోరురసి స్థితాయై! నమోస్తు లక్ష్మై కమలాలయాయై! నమోస్తు దామోదర వల్లభాయై!"
సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించింది ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు.
"భృగోరియం భార్గవీః"
భృగు వంశమున జనియించిన వారిని భార్గవీ భార్గవులు అంటారు కనుక లక్ష్మిని 'భార్గవి' అను నామము కలదు
తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన శ్రీ మహాలక్ష్మి దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు
మహాలక్ష్మి భృగు పుత్రిక కనుకనే భార్గవులు అయిన పద్మశాలి ఇంటి ఆడపడుచు అని తేటతెల్లమవుతుంది
"సిరి పుట్టింటివారు! హరికి అత్తింటివారు పద్మశాలీయులు" అను వాక్యం ప్రసిద్ధమైనది
దీనిపై చిన్న సంఘటన ఉదాహరణగా :
శ్రీ లక్ష్మి నారాయణ దేవస్థానం.
మంగళగిరి..
అనాది కాలంనుండి 108వైష్ణవ దివ్య క్షేత్రాల్లో జరిగే ఉత్సవాలు కళ్యాయనోత్సవాదులలో పద్మశాలీయులే వస్త్రాభరణములు సమర్పించి కన్యాధానం చేయు ఆచరణయున్నది
ప్రతీ ఏటా మంగళగిరి దేవస్థానంలో కూడా అదే అచారం కొనసాగుతన్నది కాని కొత్తగా ఎన్నుకొనబడ్డ ఆలయ ధర్మకర్తగారి ఈ ఆచారాన్ని తిరస్కరించి అతనే సమర్పించెను
ఆచారము విడలేక తిరస్కారాన్ని భరింపలేక
వారు గుంటూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిరి
"అయ్యా మేము మాత్రమే భృగు సంతతి వారము భర్గవులము లక్ష్మి భృగు పుత్రికయే లక్ష్మి అనేక మారలు అనేక అంశలచే జన్మించెను కనుక మా సాంప్రదాయాన్ని ఆచారాన్ని కాలరాయకండి" అని తమ వాదన తెలిపిరి
జడ్జిగారు అందులకు సంబంధించిన వివరణలు నిరూపణ చేయమనగా
అదే దేవస్థాన స్థానచార్యులు చతుర్వేద పారంగతుడు సకల పురాణ ఇతిహాసములు తెలిసిన " శ్రీ శ్రీమాన్ కందాళ రంగాచార్యులు" గారి సహాయముతో సకల శృతి స్మృతి పురాణ ఇతిహాసములు చతుర్వేదాలు సమస్త ఋషుల చరిత్రలు పరిశీలించి పద్మశాలీయులు భృగు నందనులే లక్ష్మి దేవి ఇంటి ఆడపడుచే అను ఋజువులను సమర్పించిరి
అన్నియు పరిశీలించిన జడ్జిగారు
"శ్రీ పీ.సీ త్యాగరాజ అయ్యర్ అవర్గళ్" గారు తమ తీర్పును పద్మశాలీయులు శ్రీ మహాలక్ష్మి పుట్టింటివారే అని వారి హక్కును స్థిరపరుస్తు తీర్మాణం ఇచ్చారు
పద్మావతి దేవి :
తిరుమల పద్మావతి(లక్ష్మి) పద్మశాలి ఇంటి ఆడపడుచు అన్న విషయం అందరికీ తెలిసినదే
పూర్వం పదిహేనవ శతాబ్థిలో పద్మశాలీయులకు చేనేత వృత్తిలో జీవనం గడిపే ఆశ్రిత కులస్థులకు వివాదం జరిగినది "అన్నమాచార్య" గారి మనువడు అయిన "తాళ్ళపాక చిన్నయ్య"గారిని ఆశ్రయించగా
ఆయన పద్మావతి దేవిని ఆరాధించి సమాధానం తడలుపమని కోరెను అంతట స్వయంగా పద్మావతీ దేవియే "తాను పద్మశాలి ఇంటి ఆడపడుచునని" చెప్పెను ఇదే విషయాన్ని "1543" లో తామ్రశానం లికించారు
ధనికులైన పద్మశాలీలు పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం తాళ్ళపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20 వేల వరహాలు విరాళం సమర్పించినట్లుగా శాసనాధారాలున్నాయి.
"పంచ భూతములనెడు పలువన్నెల నూలుతో నేసి, నీడనుండి చీరలమ్మే నే బేహారి"
అని అన్నమయ్య వేంకటేశ్వరుని వర్ణించడం గమనించ దగిన విషయం.
అనగా ఇక్కడ అన్నమయ్య గారి వాఖ్యాలతో స్పష్టముగా అర్థం అవుతుంది
శ్రీ మహాలక్ష్మి పద్మశాలి ఇంటి ఆడపడుచు కనుకనే తనకు పద్మశాలీలపై (పుట్టింటి వారిపై) గల అభిమానంతో మరల పద్మావతి గా జన్మించినది
ఎంతో ఉన్నత చరిత్ర కలిగిన శ్రేష్ట ఋషి వంశము భార్గవ వంశము సాక్షాత్తు శ్రీదేవియే మా ఇంటి ఆడపడుచు అవటం మహా విష్ణువే మా ఇంటి అల్లుడు అవటం అటువంటి పద్మశాలి వంశమున జన్మించుట నా పూర్వ జన్మ సుక్రుతంగా భావిస్తున్నాను
ధన్యుడను....

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 10 February 2015
భృగు పుత్రిక అయిన శ్రీమహాలక్ష్మి దూర్వాసుని శాపవశమున సముద్రమున జన్మించుట
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment