గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 11 February 2015

బ్రహ్మాండం యొక్క విశాలతను గురించి కూడా మన పూర్వులు వివరించారు

బ్రహ్మాండం విశాలత ఎంత?
బ్రహ్మాండం యొక్క విశాలతను గురించి కూడా మన పూర్వులు వివరించారు. నేడు ఈ వైశాల్యాన్ని కొలవడానికి కాంతివర్షాన్ని ప్రమాణంగా
తీసుకుంటారు. కాంతి సెకనుకు 3లక్షల కి.మీ. ప్రయాణిస్తుందని ఇంతకు ముందు ఇచ్చిన పోస్ట్ లలో తెలుసుకున్నాం. ఈ
వేగం తో ప్రయాణించే కాంతి ఒక సంవత్సరంలో ఎంత ప్రయాణిస్తుందో దానినే కాంతి సంవత్సరం అంటారు. ఈ లెఖన ఆధునిక
విజ్ఞానం మన పాలపుంత పొడవు 1 లక్ష కాంతి సంవత్సరాలుగా, వెడల్పు 10 వేల కాంతి సంవత్సరాలుగా నిర్థారించింది. మన
పాలపుంత పైన ఎండ్రోలా అనే పాలపుంత 20 లక్షల 20 వేల కాంతిసంవత్సరాల దూరంలో ఉంది. ఇలాంటి పాలపుంతలు కొన్ని
కోట్లు ఉన్నాయి.
శ్రీమధ్బాగవతంలో పరీక్షిత్ మహారాజు శుకమహర్షిని బ్రహ్మాడం యొక్క వ్యాప్తి గురించి అడుగుతాడు. శుకబ్రహ్మ బ్రహ్మాండ
విస్తరణగురించి చెబుతాడు.
మన బ్రహ్మాడమును దానికి పదిరెట్లున్న ఆవరణము కప్పియున్నది. ఇలాంటి ఆవరణములు ప్రతి ఒక్కటి పదిరెట్లున్న వానిని ఏడింటిని
నేనెరుగుదును. దేనిలో వీటన్నిటితో కూడుకున్న ఈ బ్రహ్మాడం మొత్తం ఒక పరమాణువు అంత చిన్నగా కనిపిస్తుందో అది సమస్త
కారణాలన్నింటికీ కారణమై కోట్లాది బ్రహ్మాండాలను తనలో కలిగి ఉన్నది. ఈ మాట మన బుద్దిక్షమతకు అర్థంకాదనిపిస్తుంది. ఒక మహాశక్తి
ఈ బ్రహ్మాండములన్నింటినీ నడిపిస్తున్నది. ఆ మహాశక్తినే ఈశ్వరుడు అని, దైవము అని, బ్రహ్మ అని, విష్ణువు అని అనేక పేర్లతో
పిలస్తున్నాము. ఏపేరుతో పిలిచినా ఆ మహాశక్తి ఒక్కటే. ఈశ్వరుని అనేక నామాలలో అనంతకోటి బ్రహ్మాండ నాయకా అనేది ఒకటి.
దీని వలన మన పూర్వులకు పాలపుంతల ను గురించిన జ్ఞానం ఉంది అని అర్థం అవుతుంది. ఈ అనంత కోటి బ్రహ్మాండాలన్నింటినీ
నడిపించే శక్తిని ఈశ్వరుడు అని దైవము అని అన్నారని అర్థం అవుతుంది. సంకుచితంగా కాకుండా శాస్త్రీయమైన ఆలోచన, విశాలమైన
దైవభావన మనది అనే సంగతి దీనిని బట్టి అర్థం అవుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML